బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

IT Hub: మసీదులో కట్టేసి శ్రీధర్ కు ముంజీ చేసి సల్మాన్ చేశారు. మాజీ కార్పోరేటర్ ఖర్మకాండ, దెబ్బకు !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: హిందూ యువకుడి తల్లిదండ్రులు చనిపోయారు. ఉన్న ఆస్తి కోసం బంధువులు గొడవ చెయ్యడంతో ఏం చెయ్యలేని పరిస్థితిలో యువకుడు ఐటీ హబ్ చేరుకుని సైబర్ సెంటర్ లో ఉద్యోగం చేస్తున్నాడు. సోషల్ మీడియాలో వేరే సిటీలో ఉన్న యువతి ఆ యువకుడికి పరిచయం అయ్యింది. సోషల్ మీడియా గర్ల్ ఫ్రెండ్ ను కలవడానికి వెళ్లిన యువకుడిని స్థానికులు పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. తాను పుట్టుకతో హిందువు, తనను కొందరు బలవంతంగా ఇస్లాం మతంలోకి మతమార్పడిచి చేసి ఖత్నా( ముంజి) తన పేరు సల్మాన్ అని మార్చారని ఆ యువకుడు చెప్పడంతో పోలీసులు హడలిపోయారు. బలవంతంగా మతమార్పిడి చేసి మసీదులో యువకుడిని నిర్బంధించిన కేసులో బెంగళూరు మాజీ కార్పోరేటర్ తో ఐదు మంది అరెస్టు కావడం కలకలం రేపింది.

Kerala: నరబలి ఎంత భయంకరంగా ఉంటే దేవుడు అంత అనుగ్రహిస్తాడు, శ్రీదేవి పేరుతో ఫేస్ బుక్ లో !Kerala: నరబలి ఎంత భయంకరంగా ఉంటే దేవుడు అంత అనుగ్రహిస్తాడు, శ్రీదేవి పేరుతో ఫేస్ బుక్ లో !

మండ్య టూ బెంగళూరు

మండ్య టూ బెంగళూరు

కర్ణాటకలోని మండ్య జిల్లా, మద్దూరు సమీపంలోని గ్రామంలో శ్రీధర్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. డిప్లొమా పూర్తి చేసిన శ్రీధర్ తల్లిదండ్రులు చనిపోయారు. ఆస్తి విషయంలో సమీప బంధువులు, రక్త సంబంధం ఉన్న వారితో గొడవలు మొదలు కావడంతో శ్రీధర్ బెంగళూరు వచ్చేశాడు.

సైబర్ సెంటర్ లో ?

సైబర్ సెంటర్ లో ?

ఆస్తి కోసం బంధువులు గొడవ చెయ్యడంతో ఏం చెయ్యలేని పరిస్థితిలో బెంగళూరు చేరుకున్న శ్రీధర్ పొట్టకూటి కోసం ఓ సైబర్ సెంబర్ లో ఉద్యోగంలో చేరాడు. ఆ సందర్బంలో బెంగళూరులోని కావేరీనగర్ లో నివాసం ఉంటున్న ముస్లీం మతానికి చెందిన షబీర్ (34), శ్రీధర్ కు పరిచయం అయ్యాడు.

మతం మారాలని బెదిరింపులు, రూ. 35 వేలు ఇస్తామని ?

మతం మారాలని బెదిరింపులు, రూ. 35 వేలు ఇస్తామని ?

షబీర్ కారణంగా తుమకూరు జిల్లాలోని కుణిగల్ కు చెంది మోహమ్మద్ అలియాస్ అత్తావర్ రెహమాన్ (45) తదితరులు శ్రీధర్ కు పరిచయం అయ్యారు. తరువాత శ్రీధర్ ను ఇస్లాం మతంలోకి మారాలని షబీర్, రెహమాన్ తదితరులు ఒత్తిడి చేశారు. మతం మారితో నీకు రూ. 35 వేలు ఇస్తామని శ్రీధర్ కు చెప్పారు.

 ఉగ్రవాది అని ముద్రవేస్తామని బ్లాక్ మెయిల్

ఉగ్రవాది అని ముద్రవేస్తామని బ్లాక్ మెయిల్

శ్రీధర్ ను బనశంకరి సమీపంలోని కావేరీనగర్ లో ఉన్న ఓ మసీదులోకి పిలుచుకుని వెళ్లి బలవంతంగా ఇస్లాం మతంలోకి మతమార్పడిచి చేసి ఖత్నా( ముంజి) తన పేరు సల్మాన్ అని మార్చేశారు. మసీదులో నుంచి బయటకు రాకుండా చేసి శ్రీధర్ దగ్గర ప్రతిరోజు ఖురాన్ చదివించారు. చెప్పిన మాట వినకుంటే నీకు ఉగ్రవాదులతో సంబంధం ఉందని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని శ్రీధర్ ను బ్లాక్ మెయిల్ చేశారు.

హుబ్బలిలో చిక్కిపోయిన శ్రీధర్

హుబ్బలిలో చిక్కిపోయిన శ్రీధర్

ఇటీవల సోషల్ మీడియాలో హుబ్బళి సిటీలో నివాసం ఉంటున్న యువతి శ్రీధర్ కు పరిచయం అయ్యింది. సోషల్ మీడియా గర్ల్ ఫ్రెండ్ ను కలవడానికి హుబ్బళి వెళ్లిన శ్రీధర్ అనుమానస్పదంగా తిరుగుతుంటే స్థానికులు అతన్ని పట్టుకుని చితకబాది హుబ్బళి పోలీసులకు అప్పగించారు. హుబ్బళి పోలీసుల విచారణలో శ్రీధర్ షాకింగ్ విషయాలు చెప్పడంతో హుబ్బళి పోలీసులు హడలిపోయారు.

శ్రీధర్ పేరు సల్మాన్ అయిపోయింది

శ్రీధర్ పేరు సల్మాన్ అయిపోయింది

పోలీసుల విచారణలో శ్రీధర్ షాకింగ్ విషయాలు బయటకు చెప్పాడు. తాను పుట్టుకతో హిందువు, తన పేరు శ్రీధర్ అని, తనను బెంగళూరులో కొందరు బలవంతంగా ఇస్లాం మతంలోకి మతమార్పడిచి చేసి ఖత్నా( ముంజి) తన పేరు సల్మాన్ అని మార్చారని శ్రీధర్ చెప్పడంతో హుబ్బళి పోలీసులు హడలిపోయారు. కేసు బెంగళూరులోని బనశంకరి పోలీస్ స్టేషన్ కు బదిలి అయ్యింది.

 బెంగళూరు మాజీ కార్పోరేటర్ అరెస్టు

బెంగళూరు మాజీ కార్పోరేటర్ అరెస్టు

శ్రీధర్ కు బలవంతంగా మతమార్పిడి చేసి మసీదులో అతన్ని నిర్బంధించిన కేసులో బెంగళూరులోని బనశంకరి మాజీ కార్పోరేటర్, కావేరీ నగర నివాసి అన్సర్ పాషా అలియాస్ అన్సర్ (47), షబీర్, అత్తార్ రెహమాన్, నయాజ్ పాషా, హాజీసాబ్ అనే ఐదు మందిని అరెస్టు చేశామని బెంగళూరులోని బనశంకరి పోలీసులు చెప్పారు. బలవంతంగా మతం మార్చిన కేసులో బెంగళూరులోని బనశంకరి మాజీ కార్పోరేటర్, కావేరీ నగర నివాసి అన్సర్ పాషా అలియాస్ అన్సర్ అరెస్టు కావడం ఐటీ హబ్ లో కలకలం రేపింది.

English summary
IT Hub: Religious conversion case, BBMP former corporator arrested in Bengaluru city in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X