ఐటీ హబ్ లో అదుర్స్, ఆ రోడ్లలో వెలితే సినిమా కాదు ఇంకా ఎక్కువే కనపడుతోంది !
బెంగళూరు: భారతదేశంలో మొదట్లో ప్రారంభమైన రుతుపవనాలు తీవ్రరూపం దాల్చడంతో ఎక్కడికక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు వర్షాలు కురుస్తున్నాయి. ఐటీ హబ్ బెంగళూరులో బుధవారం రోజంతా భారీ వర్షాలు, సాయంత్రం మంచి వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా బెంగళూరు నగరంలోని పలు రహదారులు జలమయం కావడంతో పలు చోట్ల ట్రాఫిక్ సమస్య ఏర్పడింది.
ముఖ్యంగా బెంగళూరు ఔటర్ రింగ్ రోడ్డుపై, ముఖ్యంగా ఎకోస్పేస్, ఇబ్బళూరు మధ్య రోడ్డు జలమయం కావడంతో వాహనాల రద్దీ నెలకొంది. బెల్లందూర్ డౌన్ ర్యాంప్ మరియు ఎకోస్పేస్ సమీపంలోని రహదారులు జలమయమయ్యాయి, సాయంత్రం రద్దీ సమయాల్లో భారీ ట్రాఫిక్ ఏర్పడింది. ఇబ్బళూరు వైపు వెళ్లే వాహనాలు నీటమునిగిన రోడ్లలో ఇరుక్కుపోయి ప్రయాణికులు అవస్థలు పడ్డారు.

అయితే, ఆ రోడ్డును మినహాయిస్తే ప్రత్యామ్నాయ రహదారులు ఏమిటని నెటిజన్లు పోలీసు అధికారులను ప్రశ్నించారు. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టుపక్కల ఉన్న కుందనహళ్లి, మారతహళ్లి, కాడుబీసనహళ్లి, వైట్‌ఫీల్డ్‌లోని ట్రాఫిక్ పోలీస్ ఏరియాల్లో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోవడంతో అక్కడి ప్రజలు నానా తంటాలుపడ్డారు. బీబీఎంపీ పరిధిలోని పలు ప్రాంతాల్లో బుధవారం విపరీతమైన వర్షం కురిసింది.
గురువారం కూడా మేఘావృతమై ఉంటుందని, వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు, మధ్యాహ్నం నుంచి సాయంత్రం, రాత్రి వర్షం పడే అవకాశం ఉంది. వర్షం కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా వాహనాలు నడపాలని ట్రాఫిక్ పోలీసులు మనవి చేశారు. భారీ వర్షాల సమయంలో అండర్‌పాస్‌లలో ఎక్కువగా ప్రయాణించకుండా చూసుకోవాలని పోలీసు అధికారులు బెంగళూరు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రద్దీగా ఉండే రోడ్లను నివారించి ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని ట్రాఫిక్ పోలీసులు కోరారు.












Click it and Unblock the Notifications