చిక్కుల్లో కేజీఎఫ్ బాబు, ఎఫ్ఐఆర్ లో ఏముంది ?, పిన్ టూ పిన్ ?
బెంగళూరు/కేజీఎఫ్: బెంగళూరు నగరంలోని చిక్కపేట్ అసెంబ్లీ నియోజక వర్గంలో భార్యతో స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేయించిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ప్రముఖ వ్యాపారవేత్త కేజీఎఫ్ బాబు చిక్కుల్లో పడ్డాడు. కేజీఎఫ్ బాబు ఇంటిలో ఆదాయపన్ను శాఖ అధికారులు ఇటీవల దాడులు చేశారు. ఐటీ శాఖ అధికారులు కేజీఎఫ్ బాబు ఇంటిలో వేలాది పట్టుచీరలు, డీడీలు సీజ్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ప్రకటించక ముందే కేజీఎఫ్ బాబు ఆయన భార్య షాజియా తరనమ్ తో స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేయించారు. భార్యతో నామినేషన్ వేయించి కేజీఎఫ్ బాబు తనకు సీటు ఇవ్వపోతే స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తామని బహిరంగంగా చాలెంజ్ చేశారు. తరువాత కేజీఎఫ్ బాబు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మీద ఒత్తిడి చేశారు.

కేజీఎఫ్ బాబు కు ఐటీ శాఖ అధికారులు షాక్ ఇచ్చారు. బెంగళూరులోని హైగ్రౌండ్స్ సమీపంలోని కేజీఎఫ్ బాబు ఇంటిలో, కార్యాలయాల్లో ఐటీ శాఖ అధికారులు దాడులు చేశారు. కేజీఎఫ్ బాబు మీద చాలా రోజు నుంచి ఐటీ శాఖ అధికారుల కన్నుపడింది. ఐటీ శాఖ అధికారుల సోదాల్లో దిమ్మతిరిగి వివరాలు బయటకు వచ్చాయి.

కేజీఎఫ్ బాబు ఇంటిలో ఒక్కో చీర రూ. 5, 000 వేల విలువైన ఐదు వేల కంచి పట్టు చీరలు, రూ. 1. 105 విలువైన డీడీలను ఐటీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డీడీల మీద చిక్కపేట్ లోని ఓటర్ల పేర్లు ఉన్నాయని అధికారులు అంటున్నారు. లక్షల విలువైన 5 వేల కంచిపట్టు చీరలను చిక్కపేట్ ఓటర్లకు పంచిపెట్టడానికి కేజీఎఫ్ బాబు ప్రయత్నించారని వెలుగు చూసింది.
కొన్ని నెలల క్రితం ఈడీ అధికారులు కేజీఎఫ్ మీద పంజా విసిరారు. అప్పటి నుంచి కేజీఎఫ్ బాబు మీద ఐటీ శాఖ అధికారులు డేగ కన్ను వేశారని సమాచారం. వేల కోట్ల రూపాయలకు అధిపతి అయిన కేజీఎఫ్ బాబు ఏదో చెయ్యాలని అనుకుంటే మొత్తం రివర్స్ అయ్యింది. కేజీఎఫ్ బాబు మీద కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ తయారు చేసిన పోలీసు అధికారులు పలు కోణాల్లో విచారణ చేస్తున్నారు. చిక్కపేట్ నియోజక వర్గం కాంగ్రెస్ టిక్కెట్ మాజీ ఎమ్మెల్యే, కేఎస్ఆర్ టీసీ మాజీ చైర్మన్ ఆర్ వీ. దేవరాజ్ కు ఇవ్వడంతో కేజీఎఫ్ బాబు ఆయన భార్యను స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా బరిలో దింపారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications