NHAI హైవేలపై మలుపుల్లో వాహనాల వేగానికి ఇక బ్రేకులు

అటవీ మార్గాల గుండా సాగే జాతీయ రహదారులపై తరచూ వన్యప్రాణులు ప్రమాదాలకు గురవుతుంటాయి. జింకలు, దప్పులు, ఎలుగుబంట్లు, పులులు.. ఇలా అనూహ్యంగా రోడ్డు మీదికి రావడం, వాహనాల కింద పడి ప్రాణాలు వదలటమో లేక తీవ్రంగా గాయపడటమో మనం తరచూ చూస్తుంటాం. ఇటువంటి సంఘటనలు జరక్కుండా వన్యప్రాణులు రోడ్డు దాటే పాయింట్ల వద్ద ప్రత్యేకంగా బోర్డులు పెట్టినప్పటికీ పెద్దగా ఉపయోగం ఉండట్లేదు.

ఈ పరిస్థితులను నివారించడానికి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఓ వినూత్న విధానాన్ని ప్రవేశపెట్టింది. జాతీయ రహదారుల మీద ఎరుపు రంగులో ఉండే టేబుల్‌టాప్ లను ఏర్పాటు చేసింది. అయిదు మిల్లీమీటర్ల మందంతో ఉండే టేబుల్ టాప్ లు ఇవి. రోడ్డు ఉపరితలం నుంచి కొద్దిగా ఎత్తులో ఉంటాయి. వాహనదారులకు స్పష్టంగా కనిపిస్తాయి కూడా. వాహనాలు దీనిపై వెళ్ళినప్పుడు తేలికపాటి కుదుపును సృష్టిస్తాయి ఇవి. దీంతో- డ్రైవర్లు ఆటోమేటిక్ గా వాహన వేగాన్ని తగ్గిస్తారు.

Jabalpur-Bhopal Highway Receives India s 1st Tabletop Red Road Markings for Wildlife Safety

ఫలితంగా ఏదైనా వన్యప్రాణి హఠాత్తుగా రోడ్డు మీదికి వచ్చినా సడన్ గా బ్రేకులు వేయడానికి లేదా వేగాన్ని నియంత్రించడానికి ఇది ఉపకరిస్తుంది. జంతువులు సురక్షితంగా రోడ్డు దాటడానికి వీలవుతుంది. అంతేకాకుండా, డ్రైవర్లలో పరిసరాల పట్ల అవగాహన కూడా పెరుగుతుంది. ప్రస్తుతం ఈ విధానం మధ్యప్రదేశ్ లో అమలులోకి వచ్చింది. జబల్‌పూర్- భోపాల్ జాతీయ రహదారిపై ఈ టేబుల్ టాప్ లు అందుబాటులోకి వచ్చాయి.

వీరంగన దుర్గావతి టైగర్ రిజర్వ్, నౌరాదేహి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం వంటి రెండు ప్రధాన అటవీ ప్రాంతాల గుండా వెళ్తుందీ రోడ్డు. అత్యంత రద్దీగా ఉండే జాతీయ రహదారుల్లో ఇదీ ఒకటి. అలాగే- వన్యప్రాణుల సంఖ్య ఇక్కడ ఎక్కువ. జింకలు, నీల్గాయ్, నక్కలు వంటి జంతువులు ఈ రోడ్డును దాటే క్రమంలో ప్రమాదాలకు గురయ్యేవి. వన్య ప్రాణులకు అత్యంత ప్రమాదకరమైన జోన్‌.

దీంతో తొలి దశలో ఈ మార్గంలోనే ఈ టేబుల్ టాప్ వ్యవస్థను ప్రవేశపెట్టింది జాతీయ రహదారుల సంస్థ. అటవీ జంతువులు ఎక్కువగా రోడ్డు దాటే పాయింట్లను గుర్తించింది. ఈ రహదారిపై 12 కిలోమీటర్ల వరకు టేబుల్ టాప్ వేసింది. దీంతో పాటు NH 25 అండర్‌పాస్‌లను కూడా నిర్మించింది. ఇది విజయవంతమౌతోన్న క్రమంలో దేశవ్యాప్తంగా అటువంటి పాయింట్లను గుర్తించి దశలవారీగా వీటిని ఏర్పాటు చేయనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+