జాదవ్ టెర్రిరిస్టు: ఎంపి నరేష్ అగర్వాల్ వివాదాస్పద వ్యాఖ్య

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: పాకిస్తాన్ జైలులో ఉన్న కులభూషణ్ జాదవ్‌పై సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) రాజ్యసభ సభ్యుడు నరేష్ అగర్వాల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కులభూషణ్ జాదవ్ తల్లి, భార్య పట్ల నరేష్ అగర్వాల్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతన్నాయి.

పాకిస్తాన్ కులభూషణ్ జాదవ్‌ను ఉగ్రవాదిగానే చూస్తోందని, అందుకు అనుగుణంగానే ఆ దేశం వ్యవహరించిందని ఆయన అన్నారు. భారత్ కూడా తను ఉగ్రవాదులుగా పరిగణించేవారి పట్ల అదే రీతిలో వ్యవహరిస్తుందని ఆయన అన్నారు.

పాకిస్తాన్‌లో ఇంకా చాలా మంది జైల్లో ఉన్నారని, మీడియా కులభూషణ్ జాదవ్ గురించే మీడియా ఎందుకు మాట్లాడుతోందని నరేష్ అగర్వాల్ అన్నారు. జాదవ్‌తో ఆయన భార్య,, తల్లి భేటీపై విదేశీ వ్యవహారాల శాఖ వివరాలు అందించిన నేపథ్యంలో ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు.

Jadhav is a terrorist, Pak treated him accordingly: MP Naresh Agarwal spurs row

అగర్వాల్ వ్యాఖ్యలు దేశ ప్రయోజనాలకు విఘాతమని బిజెపి అధికార ప్రతినిధి జివిఎల్ నరసింహారావు అన్నారు. కాంగ్రెసు మిత్రపక్షమైన కాంగ్రెసు కూడా ఎల్లవేళలా పాకిస్తాన్ పక్షం వహిస్తోందని ఆయన అన్నారు.

ఇదిలావుండగా, జాదవ్ భార్య, తల్లి పట్ల పాకిస్తాన్ వ్యవహరించిన తీరుకు నిరసన వ్యక్తం చేస్తూ ప్రతిపక్షాలు బుధవారం ఆందోళనకు దిగాయి. జాదవ్ తల్లి, భార్య పట్ల పాకిస్తాన్ వ్యవహరించిన తీరును కాంగ్రెసు సభ్యుడు మల్లికార్జున్ ఖర్గే ఖండించారు. కులభూషణ్ జాదవ్‌ను భారత్ తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు.

పాకిస్తాన్ నుంచి అంతకన్నా ఉత్తమమైంది ఆశించలేమని కాంగ్రెసు నేత కపిల్ సిబల్ అన్నారు. ఈ విషయంపై విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మ స్వరాజ్ గురువారం మాట్లాడుతారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Samajwadi Party Rajya Sabha member Naresh Agarwal provoked a controversy today with his comments on Kulbhushan Jadhav.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి