కల్లు తాగి తోటలో రచ్చ రంబోలా.. హేమ, సురేఖవాణి వీడియో వైరల్..
టాలీవుడ్ సీనియర్ నటీమణులు హేమ, సురేఖ వాణి గురించి మనకు తెలిసిందే. ఇప్పటి వరకు వందల సినిమాల్లో నటించిన వీళ్లు సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. అయితే ఇటీవలి కాలంలో సినిమాలు కొంత తగ్గించి సామాజిక మాధ్యమాల్లో ఫ్యాన్స్ కు అందుబాటులో ఉంటున్నారు. ఎప్పటికప్పుడు తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటూ ఉంటారు.
అయితే తాజాగా హేమ, సురేఖ వాణి తమ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. అయితే ఆ వీడియోలో ఏం ఉందో చూస్తే మీరు షాక్ అవుతారు. ఇటీవల హేమ, సురేఖవాణి తమ స్నేహితులతో కలిసి ఓ తోటలో హాలీడే ట్రిప్ ను ఎంజాయ్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను తమ ఇన్ స్టా ఖాతాలో షేర్ చేశారు. అదికాస్తా వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో హేమ, సురేఖవాణి తోటలో ఉన్న ఈత చెట్టు నుంచి కల్లును తీశారు. వీళ్లే డైరెక్ట్ గా ఈత కల్లు తీసుకుని.. వాటిని వడపోసి తాగుతూ ఎంజాయ్ చేశారు. వీళ్లకు సంబంధించిన హాలీడే వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ప్రకృతి మధ్య ఇలా సరదాగా గడపడం తమకు ఎంతో ఇష్టమని తెలిపినట్లు తెలుస్తోంది. ఇక ఈ వీడియోలో హేమ, సురేఖవాణి ఇద్దరూ ఎంతో సంతోషంగా నవ్వుతూ, స్నేహితులతో సరదాగా మాట్లాడుకుంటూ కనిపించడం అభిమానులను ఆకట్టుకుంటోంది.

ఇక ఈ వీడియోకు సామాజిక మాధ్యమాల్లో మంచి రెస్పాన్స్ వస్తోంది. చాలా మంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మీరు తోటలో ఇలా ఎంజాయ్ చేయడం చాలా బాగుందని కొందరు కామెంట్స్ పెడుతున్నారు. నిజమైన హాలీడే మూడ్ అంటూ మరికొందరు అంటున్నారు.












Click it and Unblock the Notifications