Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Kangana Ranaut:మంగ్లీ పాటపై మండిపడ్డ ఎంపీ కంగనా-హద్దులు దాటేశారంటూ..!!

ఈ మధ్యకాలంలో సినిమా అనేది హద్దులు దాటుతోంది. ఇప్పటికే పాశ్చాత్య సినిమాల్లా మన సినిమాల్లో కూడా అడల్ట్ కంటెంట్ ఎక్కువైపోతోంది. అడల్ట్ కంటెంట్ ఉంటేనే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు కురుస్తాయనే నమ్మకం మూవీ మేకర్స్‌లో బలంగా నాటుకుపోయింది. ఈ క్రమంలోనే హాట్ ఐటెమ్ సాంగ్స్‌తో రెచ్చిపోతున్నారు. చిన్నపిల్లలు సినిమాకు వస్తారన్న కనీస జ్ఞానం లేకుండా డైలాగుల నుంచి పాటల వరకు డబుల్ మీనింగ్‌తో రెచ్చిపోతున్నారు. ఇక స్కిన్ షో గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.

ప్రాంతీయ చిత్రాల్లో కూడా అవసరం లేకపోయినప్పటికీ ఒక ఐటెం సాంగ్ను పెట్టేందుకు స్పేస్ క్రియేట్ చేసుకుని మరీ కథను అల్లుతున్నారు. ఇక ఈ ఐటెం సాంగ్ కోసం స్కిన్ షో చూపించేందుకు అస్సలు మొహమాటం లేని వాళ్లనే చాలా సెలెక్టివ్‌గా ఎంచుకుని వారికి రెమ్యూనరేషన్ రూపంలో కోట్లు కుమ్మరిస్తున్నారు. తాజాగా సోషల్ మీడియాలో KD-ది డెవిల్ అనే చిత్రంలోని ఓ ఐటెం సాంగ్ వైరల్ అవుతోంది. దీనిపై నటి, ఎంపీ కంగనా రనౌత్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

kangana-ranaut-slams-kd-the-devil-item-song-sparks-debate-on-obscenity-in-bollywood

బాలీవుడ్ హద్దులు దాటేస్తోంది

కన్నడ స్టార్ ధృవ సర్జా ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం KD-ది డెవిల్.ఇది పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవుతోంది. హిందీ వెర్షన్‌లో" సర్కే చునార్ తేరీ సర్కే" అనే పాట మార్చి 14న సోషల్ మీడియాలో విడుదలైంది. చాలా గ్రాండ్‌గా రిలీజ్ అయిన ఈ సాంగ్‌ అంతే వివాదాల్లో చిక్కుకుంది. ఇందుకు కారణం ఈ పాటలోని లిరిక్స్ ఒకటైతే రెండవది నోరా ఫతేహీ స్కిన్ షో. దీనిపై ఎంపీ నటి కంగనా రనౌత్ స్పందించారు. బాలీవుడ్‌ హద్దులు దాటేస్తోందని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ మధ్య వస్తున్న సినిమాల్లో అశ్లీలత ఎక్కువగా పెరిగిపోయిందని మండిపడ్డారు. అటెన్షన్ కోసం బాలీవుడ్ అన్ని హద్దులు దాటి వెళుతోందని అన్నారు. దేశం యావత్తు ఈ పాటలో ఉన్న లిరిక్స్‌ను ఖండిస్తుంటే...మూవీ మేకర్స్‌ మాత్రం సిగ్గులేకుండా దున్నపోతుపై వర్షం పడితే ఎలా చలించదో అలానే వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

స్టార్ హీరోకి ఆ హీరోయిన్ సెంటిమెంట్.. ఒక్క పైసా తీసుకోకుండా సినిమాకి ఓకే !!
స్టార్ హీరోకి ఆ హీరోయిన్ సెంటిమెంట్.. ఒక్క పైసా తీసుకోకుండా సినిమాకి ఓకే !!

CBFC వద్ద ఫిర్యాదు

బాలీవుడ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ఇలాంటి అశ్లీలతను ప్రదర్శించకుండా చెక్ పెట్టేలా నిబంధనలను కఠినతరం చేయాలని కంగనా డిమాండ్ చేసింది. ఇదిలా ఉంటే మార్చి 14న సోషల్ మీడియాలో విడుదల చేసిన ఈ సాంగ్‌కు ఒక వర్గం నుంచి మంచి మద్దతు లభిస్తుండగా.. ఇంకో వర్గం దీనిపై మండిపడుతున్నారు. ఈ పాటపై వివాదం ముదురుతున్న వేళ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ వద్ద వినీత్ జిందాల్ అనే అడ్వకేట్ ఫిర్యాదు చేశారు.మూవీ మేకర్స్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది.ఈ పాట మైనర్లు చూడాల్సినది కాదని ఆయన పేర్కొన్నారు. వెంటనే హిందీ వెర్షన్‌కు సంబంధించి చిత్ర బృందం వీడియోను తొలగించగా.. కన్నడ, తమిళం, తెలుగు మళయాలం భాషల్లో ఈ వీడియో ఇంకా చక్కర్లు కొడుతోంది.

నాపై ఒత్తిడి తెచ్చారు: లిరిసిస్ట్ రకీబ్

ఇదిలా ఉంటే ఈ లిరిక్స్ రాసింది రకీబ్ ఆలం. ఈ వివాదం నడుస్తున్న వేళ రకీబ్ ఆలం స్పందించారు. ఒరిజినల్‌గా ఈ చిత్రం కన్నడలో చేస్తుండగా...కన్నడ లిరిక్స్‌ను ఈ చిత్ర దర్శకుడు ప్రేమ్ రాశారని చెప్పుకొచ్చారు. అయితే ఈ పాటను హిందీలో కూడా కావాలని తనపై ఒత్తిడి చేయడంతో కేవలం అనువాదం మాత్రమే చేసినట్లు చెప్పుకొచ్చాడు. హిందీ వెర్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో మిగతా పాటలు కూడా తానే రాసినట్టు అంగీకరించాడు.

విడుదల వేళ.. ఉస్తాద్ షాకింగ్ డెసిషన్
విడుదల వేళ.. ఉస్తాద్ షాకింగ్ డెసిషన్

ఇక ఆదిలోనే వివాదాలు చుట్టుముట్టిన ఈ చిత్రంలోని పాటను మంగ్లీ పాడింది.ఈ చిత్రాన్ని ప్రేమ్ డైరెక్ట్ చేస్తుండగా.. సంజయ్ దత్, శిల్పా శెట్టి, రీష్మా నన్నయలు ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం 2026 ఏప్రిల్ 30వ తేదీన విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+