Jailer: జైలర్ సినిమా నిర్మాత గొప్ప మనస్సు.. పేద పిల్లల గుండె ఆపరేషన్లకు రూ.కోటి సాయం..
సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ సినిమా వసూళ్లలో దూసుకెళ్తోంది. ఆగస్ట్ 10న విడుదలైన ఈ మూవీ నెల రోజులు కాకముందే ప్రపంచవ్యాప్తంగా రూ.700 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లు చేసింది. దీన్ని బట్టి చెప్పొచ్చు సినిమా ఏ స్థాయిలో విజయం సాధించిందో. రజనీకాంత్ చాలా కాలం తర్వాత ఈ పెద్ద హిట్ లభిచింది. ముఖ్యం తమిళంలో ఈ మధ్య కాలం ఇంత పెద్ద హిట్ ఏ సినిమా కూడా కాలేదు. ఇటు తెలుగులో కూడా ఈ స్థాయి విజయం సాధించిన సినిమాలు లేవు. ఈ సినిమా సినీ నిర్మాత భారీగా డబ్బు సంపాదించారు.
జైలర్ సినిమాను సన్ పిక్చర్స్ తెరకెక్కించింది. అయితే చిత్రం ఈ స్థాయిలో విజయం సాధిస్తుందని నిర్మాణ సంస్థ కూడా అనుకోలేదు. దీంతో ఈ సినిమా నిర్మాత కళానిధి మారన్ చాలా సంతోషంగా ఉన్నారు. ఇప్పటికే తనకొచ్చిన లాభాల్లో కొంత భాగాన్ని హీరో రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్, మ్యూజిక్ డైరక్టర్ అనిరుధ్ కు ఇచ్చారు. లాభాల్లో వాటానే కాదు ఖరీదైన కార్లను బహుమతిగా ఇచ్చాడు. కళానిధి మారన్ లాభాల్లో కొంత మేర సామాజిక సేవలకు అందివ్వాలని నిర్ణయించుకున్నాడు.

అందులో భాగంగా 100 మంది నిరుపేద పిల్లలకు గుండె శస్త్ర చికిత్స కోసం కోటి రూపాయల చెక్ ను అపోలో ఆస్పత్రికి అందించారు. సన్ పిక్చర్స్ తరఫున నిర్మాత కళానిధఇ మారన్ కావేరి ఈ చెక్ అందజేశారు. మంగళవారం అపోలో ఆస్పత్రుల ఛైర్మన్ డాక్టర్ ప్రతాప్ చంద్రరెడ్డికి కావేరి రూ.కోటి చెక్ అందజేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోను సన్ పిక్చర్స్ ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేసింది. కాగం సన్ పిక్చర్స్ తీసుకున్న నిర్ణయం పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా రజనీ ఫ్యాన్స్ దీన్ని గొప్ప విషయంగా కొనియాడుతున్నారు.
సన్ పిక్చర్స్ చేసింది గొప్ప పని అంటూ పొగడుతున్నారు. ఇలా ప్రతి ఒక్క నిర్మాత తనకొచ్చిన లాభాల్లో కొంత మేర పేద ప్రజలకు సాయం చేస్తే బాగుంటుందని పలువురు నెటిజన్లు అభిప్రాపయపడుతున్నారు. జైలర్ మూవీ ఓవర్సీస్ లో 192.45 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. జైలర్ తో పాటు బాలీవుడ్ మూవీ గదర్ 2 భారీగా వసూళ్లు రాబట్టింది. జైలర్, గదర్ 2 రెండు కలిపి 1263 కోట్ల గ్రాస్ ను వసూళ్లు చేశాయి.
On behalf of Sun Pictures, Mrs. Kavery Kalanithi handed over a cheque for Rs.1 Crore to Dr. Prathap Reddy, Chairman, Apollo Hospitals, towards heart surgery for 100 under privileged children.
— Sun Pictures (@sunpictures) September 5, 2023
#Jailer #JailerSuccessCelebrations pic.twitter.com/o5mgDe1IWU
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!!












Click it and Unblock the Notifications