వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికా సైన్యంలో 'ఇండియన్': కళ్లు చెదిరే ప్యాకేజీతో బంపర్ ఆఫర్!

ఏహెచ్-64ఇ కంబాట్ ఫైటర్ హెలికాప్టర్ యూనిట్‌లో శాస్త్రవేత్తగా అతను నియమింపబడ్డాడు. ఇందులో భాగంగా.. ఫైటర్ గా హెలికాప్టర్స్ డిజైన్స్ పరిశీలించడం, తనిఖీలు, నిర్వహణ బాధ్యతలు మోనార్క్ శర్మ చూసుకోనున్నాడు.

|
Google Oneindia TeluguNews

జైపూర్: అమెరికా సైన్యంలో భారతీయులు ఉద్యోగం దక్కించుకోవడం కాస్త ఆశ్చర్యపరిచే విషయమే. అయితే ఉద్యోగం సంపాదించడమే కాదు, కళ్లు చెదిరే ప్యాకేజీని ఓ ఇండియన్ తన ఖాతాలో వేసుకున్నాడు.

జైపూర్‌కు చెందిన మోనార్క్ శర్మ అనే యువకుడు రూ.1.20కోట్ల వార్షిక వేతనంతో అమెరికా సైన్యంలో ఉద్యోగం పొందాడు. ఏహెచ్-64ఇ కంబాట్ ఫైటర్ హెలికాప్టర్ యూనిట్‌లో శాస్త్రవేత్తగా అతను నియమింపబడ్డాడు. ఇందులో భాగంగా.. ఫైటర్ గా హెలికాప్టర్స్ డిజైన్స్ పరిశీలించడం, తనిఖీలు, నిర్వహణ బాధ్యతలు మోనార్క్ శర్మ చూసుకోనున్నాడు.

Jaipur youth joins US army, to get Rs 1.2 crore annual pay: Report

2013లో నాసా నిర్వహించిన ఒక కాంటెస్ట్ లో పాల్గొని మోనార్క్ శర్మ గెలుపొందాడు. అదే అతని కెరీర్ కు టర్నింగ్ పాయింట్. అతని ప్రతిభకు మెచ్చి జూనియర్ రీసెర్చీ ఇంజనీర్ గా నాసా అవకాశం ఇచ్చింది. ఆపై 2016మే నెలలో అమెరికా సైన్యంలో చేరారు. అనంతరం కొద్ది నెలలకే డిజైనింగ్, రీసెర్చీ విభాగాల్లో మోనార్క్ శర్మ తన నైపుణ్యాన్ని నిరూపించుకోవడంతో.. అనతి కాలంలోనే ప్రతిష్టాత్మక మెడల్స్ ఆర్మీ సర్వీస్ మెడల్, సేఫ్టీ ఎక్స్ లెన్స్ అవార్డులు వరించాయి.

కాగా, రాజస్థాన్ లోని ఒక ప్రభుత్వ ఉద్యోగి కొడుకైన మోనార్క్ శర్మ.. తొలి నుంచి ఖగోళ శాస్త్రం, డిఫెన్స్ పరికరాల రంగంలో ఆసక్తి కలిగి ఉండేవాడు. అయితే తనకు భారత సైన్యంలో పనిచేసే అవకాశం రాలేదని, అమెరికా సైన్యంలో తన నైపుణ్యంతో స్వదేశానికి పేరు తీసుకొస్తానని శర్మ చెబుతున్నారు.

English summary
Monark Sharma, a young boy from Rajasthan’s Jaipur, has been appointed as a scientist in the US army’s AH-64E combat fighter helicopter unit, according to a Times of India report.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X