జామియా వర్సిటీలో మళ్లీ టెన్షన్.. ఈసారి అమ్మాయిల ముందడుగు.. భారీగా మోహరించిన పోలీసులు.. దేశమంతటా అదే
ఏ విద్యార్థులైతే తూటాలు, లాఠీ దెబ్బలుతిని.. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్త ఆందోళనలకు బీజం వేశారో.. ఆ జామియా వర్సిటీ విద్యార్థులు మళ్లీ ఆందోళనబాటపట్టారు. వర్సిటీ గేటే బయట శనివారం నిరసనకు దిగారు. సీఏఏ, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ చట్టాలను కేంద్రం వెంటనే వెనక్కి తీసుకోవాలిని డిమాండ్ చేశారు. 'ఆజాదీ..', 'ఇంక్విలాబ్' ధ్వనులతో క్యాంపస్ ను హోరెత్తించారు. వారం రోజుల కిందట వర్సిటీలో జరిగిన గలాటాలో దెబ్బలు తిన్న పలువురు విద్యార్థులూ ఈ నిరసనల్లో పాల్గొన్నారు.
అమ్మాయిలే మొదలుపెట్టారు..
జామియా వర్సిటీలో గలాటా జరిగినప్పటి నుంచి సెక్యూరిటీని కట్టుదిట్టం చేశారు. అయినా సరే, విద్యార్థినులు గుంపులు గుంపులుగా.. పోలీస్ పహారాను దాటుకునిమరీ వర్సిటీ గేటు దగ్గరికి చేరుకుని బైఠాయించారు. అమ్మాయిలు నిరసనలో కూర్చున్న కొద్ది సేపటి తర్వాతగానీ అబ్బాయిలు జాయిన్ కాలేదు. ఎలాంటి హడావుడి లేకుండా వరుస క్రమంలో కూర్చొని అందరూ శాంతియుతంగా నిరసనలు తెలిపారు. విద్యార్థులు మళ్లీ గుమ్మికూడటంతో అప్రమత్తమైన పోలీసులు.. జామియా వర్సిటీలో అదనపు బలగాలను మోహరింపజేశారు.

సౌత్ లోనూ నిరసనల హోరు..
సౌత్ ఇండియాలోని నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోనూ సీఏఏ వ్యతిరేక నిరసనలు కొనసాగాయి. చెన్నైలోని సెంట్రల్ రైల్వే స్టేషన్ బయట లెఫ్ట్ పార్టీలకు చెందిన కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రదర్శన చేశారు. కేరళలోని కొజికోడ్ జిల్లాలో సీఏఏను నిరసిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు ర్యాలీ తీశారు. వారిని పోలీసులు వాటర్ కెనాన్లతో చెదరగొట్టారు.
Kerala: Police use water cannons on Congress workers who were protesting against #CitizenshipAmendmentAct in Kozhikode pic.twitter.com/M4scQ3RwGd
— ANI (@ANI) December 21, 2019

Click it and Unblock the Notifications