జమ్మూ కాశ్మీర్ కొత్త సీఎం ఖరార్: వారసుడికే పట్టాభిషేకం
Jammu Kashmir Assembly Election Results 2024: కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్- కాంగ్రెస్ సంకీర్ణ కూటమి ఘన విజయం సాధించింది. ఈ రెండు పార్టీలు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోన్నాయి. దీనికి అవసరమైన మేజిక్ ఫిగర్‌ను అందుకున్నాయి.
మధ్యాహ్నానికే ఇక్కడ అధికారం ఎవరిదనేది తేలిపోయింది. ఇక్కడ హంగ్ అసెంబ్లీ ఏర్పడవచ్చని, నేషనల్ కాన్ఫరెన్స్ - కాంగ్రెస్ కూటమి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆవిర్భవిస్తుందంటూ మొన్నటి ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినప్పటికీ అది వాస్తవ రూపాన్ని దాల్చలేదు. ఎగ్జిట్ పోల్స్‌కు భిన్నంగా కూటమి విజయదుందుభిని మోగించింది. మంచుకొండలపై జెండా పాతింది.

మొత్తం 90 నియోజకవర్గాలు ఉన్న జమ్మూ కాశ్మీర్‌లో భారతీయ జనతా పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ ఏ మాత్రం కూడా ప్రభావాన్ని చూపలేకపోయింది. జమ్మూ కాశ్మీర్‌కు గల స్వయ ప్రతిపత్తి హోదాను తొలగించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370ని రద్దు చేయడం, ఆ రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా మలచడం కాశ్మీర్ ఓటర్లకు రుచించలేదు. బీజేపీకి పరాజయాన్ని పరిచయం చేశారు.
మధ్యాహ్నం 2:30 గంటల సమయానికి నేషనల్ కాన్ఫరెన్స్- 41, బీజేపీ- 29, కాంగ్రెస్- 6, స్వతంత్రులు- 7, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ- 4, ఆమ్ ఆద్మీ పార్టీ- 1, సీపీఎం- 1 స్థానాల్లో ఆధిక్యతలో ఉన్నాయి. బుద్గాం నుంచి నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్థి, మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఘన విజయం సాధించారు. మరో నియోజకవర్గం గందెర్‌బల్‌లో భారీ ఆధిక్యతలో కొనసాగుతున్నారు.
ఈ ఫలితాలపై నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత, కేంద్ర మాజీ మంత్రి ఫరూఖ్ అబ్దుల్లా స్పందించారు. పదేళ్ల తరువాత జమ్మూ కాశ్మీర్ ఓటర్లు అద్భుతమైన తీర్పు ఇచ్చారని వ్యాఖ్యానించారు. వారి అంచనాలకు అనుగుణంగా పరిపాలన సాగిస్తామని పేర్కొన్నారు. ఇకపై ఇక్కడ పోలీస్ రాజ్ నడవబోదని, ప్రజా ప్రభుత్వం ఏర్పాటవుతుందని అన్నారు.
ఒమర్ అబ్దుల్లా కాబోయే ముఖ్యమంత్రి అవుతారని ఫరూఖ్ ప్రకటించారు. త్వరలోనే శాసన సభాపక్ష నేతగా ఆయనను ఎన్నుకుంటామని అన్నారు. హిందువులు- ముస్లింల మధ్య ఐక్యత, ఒకరి పట్ల ఒకరికి విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికే అధిక ప్రాధాన్యత ఇస్తామని ఫరూఖ్ అబ్దుల్లా తేల్చి చెప్పారు.
జమ్మూ కాశ్మీర్ విషయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తీసుకున్న నిర్ణయాలను జనం తిప్పికొట్టారని పేర్కొన్నారు. కాశ్మీర్‌కు మళ్లీ రాష్ట్ర హోదాను తీసుకుని రావడానికి కాంగ్రెస్‌తో కలిసి కృషి చేస్తామని అన్నారు. హర్యానాలో కాంగ్రెస్ ఓడిపోవడం బాధాకరమని, అంతర్గత కుమ్ములాటల వల్ల ఈ పరిస్థితి తలెత్తి ఉండొచ్చని వ్యాఖ్యానించారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications