ప్రశాంత్ కిశోర్ వ్యూహం: జనసురాజ్ 51 మంది తొలి జాబితా విడుదల!

Bihar Election 2025: బీహార్ అసెంబ్లీ ఎన్నికలు 2025 తేదీలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయాలు ఉద్ధృతం అవుతున్నాయి. అయితే ఈ సారి పాత పార్టీల కంటే ప్రశాంత్ కిశోర్ పార్టీ అయిన జనసురాజ్ చాలా ముందుంది. ఎన్డీయే, మహాకూటమి ఇంకా సీట్ల పంపకంలో తలమునకలై ఉండగా.. జనసురాజ్ పార్టీ గురువారం తమ మొదటి 51 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.

జనసురాజ్ పార్టీ తొలి జాబితాలో అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం
పార్టీ మొదటి జాబితాలో కుల, ప్రాంతీయ సమతుల్యతను ప్రత్యేకంగా పాటించారు. 51 టికెట్లలో 17 అత్యంత వెనుకబడిన తరగతి(EBC) వారికి, 11 వెనుకబడిన తరగతి(బీసీ) వారికి, దాదాపు 9 మైనారిటీ వర్గానికి, మిగిలినవి జనరల్ కేటగిరీ అభ్యర్థులకు దక్కాయి. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని.. మరో ఒకట్రెండు రోజుల్లో కొత్త జాబితాను విడుదల చేస్తామని.. తద్వారా మొత్తం 243 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే తమ లక్ష్యాన్ని పూర్తి చేస్తామని జనసురాజ్ బృందం స్పష్టం చేసింది. ప్రతి సీటులో ప్రజలు స్వయంగా ఎన్నుకోవాలని కోరుకునే అభ్యర్థిని నిలబెట్టాలనేదే ప్రశాంత్ కిశోర్ వ్యూహం. ఈ జాబితాలో పాట్నాలోని కుమ్హ్రార్, దర్భంగా, మాంఝీ, సుల్తాన్‌గంజ్ వంటి పెద్ద నియోజకవర్గాలు ఉండటం పార్టీ పట్టు, ప్రాంతీయ ప్రభావాన్ని తెలియజేస్తుంది.

Jan Suraaj Party Releases First List of 51 Candidates Prashant Kishor Strategy in Action

అక్టోబర్ 11న రాఘోపూర్ నుండి ప్రచార శంఖారావం
అక్టోబర్ 11న రాఘోపూర్ నుండి పార్టీ ప్రచార కార్యక్రమం ప్రారంభమవుతుందని పార్టీ అధ్యక్షుడు ఉదయ్ సింగ్ వెల్లడించారు. ఈ ముఖ్యమైన సందర్భంలో ప్రశాంత్ కిశోర్ స్వయంగా హాజరై పార్టీ ఎన్నికల మిషన్‌ను ప్రారంభిస్తారు. అయితే మొదటి జాబితాను విడుదల చేసే పత్రికా సమావేశానికి ప్రశాంత్ కిశోర్ రాకపోవడం రాబోయే రోజుల వ్యూహంపై మరింత సస్పెన్స్ పెంచింది.

టికెట్ పొందిన అభ్యర్థుల వివరాలు
ఆర్సీపీ సింగ్ ఒక్కొక్కరిగా 51 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించారు.

1.వాల్మీకి నగర్- థారూ తెగకు చెందిన మొదటి అభ్యర్థి ఘృత్ నారాయణ ప్రసాద్.

2. హరసిద్ధి- అవధేష్ కుమార్

3.సీతామర్హి- ఉషా కిరణ్ (సుర్సండ్ సీటు)

4.రున్నీసైద్‌పూర్- విజయ్ షా

5.బేనీపట్టి -మహ్మద్ పర్వేజ్ ఆలం

6.నిర్మలి- రామ్ ప్రవేశ్ కుమార్ యాదవ్

7.సిక్టీ- రాగిబ్ బబ్లూ
8. కోచాధామన్- అబూ అఫాక్ ఫారూఖ్
9.బయసీ-షాహనవాజ్ ఆలం
10.ఆలమ్‌నగర్- సుభోద్ కుమార్ సుమన్‌
11.సహర్సా- కిషోర్ కుమార్ మున్నా,
12.మహిషి- షమీమ్ అఖ్తర్,
13.దర్భంగా గ్రామీణ్- షోయబ్ ఖాన్
14.దర్భంగా- ఆర్ కె మిశ్రా, మీనాపూర్- తేజ్ నారాయణ్ సహనీ
15.ముజఫర్‌పూర్- డా. అమల్ కుమార్ దాస్
16.గోపాల్‌గంజ్- డా. శశిశేఖర్ సిన్హా
17.భోరే- ప్రీతి కిన్నర్
18.రఘునాథ్‌పూర్- రాహుల్ కీర్తి సింగ్
19.దరౌందా- సత్యేంద్ర కుమార్ యాదవ్
20.మాంఝీ- యాదవ్ వంశ గిరి
21.బనియాపూర్- శ్రవణ్ కుమార్ మహతో
22.ఛాప్రా -జయ్ ప్రకాష్ సింగ్
23.పర్సా- ముసాఫిర్ మహతో
24.మతిహాని- అరుణ్ కుమార్‌
25.బేగుసరాయ్-సురేంద్ర కుమార్ సహనీ
26.ఖగారియా- జయంతి పటేల్
27.బేల్‌దౌర్ -గజేంద్ర నిషాద్
28.పరబత్తా-వినయ్ కుమార్ వరుణ్
29.అస్తావాన్ -లతా సింగ్
30.బీహార్‌షరీఫ్-దినేష్ కుమార్
31.నలంద- కుమార్ సిన్హా
32.కుమ్హ్రార్-ప్రొఫెసర్ కెసి సిన్హా
33.ఆరా -డా. విజయ్ కుమార్ గుప్తా
34.చేనారి-నేహా కుమార్ నటరాజ్ (నట్ సమాజ్ నుండి)
35.కర్గహర్-రితేష్ రంజన్ పాండే
36.గోహ్- సీతారాం దుఖారి
37.నబీనగర్-అజయ్ చంద్ర యాదవ్
38.ఇమామ్‌గంజ్-డా. అజిత్ కుమార్
39. బోధగయ-లక్ష్మణ్ మాంఝీ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+