తమిళ తారలను వేధించిన దినకరన్, జనార్దన్, అందుకే నమిత, ఇంధ్ర హీరోయిన్!

టీటీవీ దినకరన్, జయా టీవీ జనార్దన్ తమిళ సినీ రంగానికి చెందిన అనేక మంది తారలను వేధించారని వెలుగు చూసింది.

చెన్నై: అన్నాడీఎంకే నాయకుడు, మాజీ ఎంపీ టీటీవీ దినకరన్ దెబ్బకు ఇప్పుడు ఆయనకు గతంలో సన్నిహితంగా ఉంటున్నవారు హడలిపోతున్నారు. టీటీవీ దినకరన్ బండారం ఒక్కొక్కటి బయటకు వస్తుండటంతో ఆయన అనుచరులు హడలిపోతున్నారు.

గురువారం టీటీవీ దినకరన్ కు చెందిన ఓ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. తమిళ సినీ పరిశ్రమకు చెందిన అనేక మంది తారలను టీటీవీ దినకరన్, జయా టీవీకి చెందిన జనార్దన్ అలియాస్ జనా అనే ఇద్దరూ పీడించారని వెలుగు చూడటంతో అన్నాడీఎంకే వర్గాలు హడలిపోయాయి.

జనార్దన్ అంటే

జనార్దన్ అంటే

జనార్దన్ అనే వ్యక్తిని టీటీవీ దినకరన్ తన సహాయకుడిగా పెట్టుకుని చెంచ్మా పనులు చేయించుకునేవాడు. తరువాత టీటీవీ దినకన్ కు జనార్దన్ చాల దగ్గర అయ్యాడు. అక్కడి నుంచి వీరి కన్ను మీడీయా మీద పడింది. ఎప్పటికప్పుడు వివరాలు సేకరించాలని ప్లాన్ వేశారు.

సీన్ కట్ చేస్తే జయా టీవీ

సీన్ కట్ చేస్తే జయా టీవీ

జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో టీటీవీ దినకరన్ కు ఓ ఆలోచన వచ్చింది. అమ్మ తనను ఎప్పటికీ దగ్గరకు రానివ్వరని తెలుసుకున్న దినకరన్ తన చిన్నమ్మ శశికళ సహాయంతో తన చెంచ్మా జనార్దన్ ను జయా టీవీలో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగంలో చేర్చాడు.

కుష్బూతో జాక్ పాట్

కుష్బూతో జాక్ పాట్

జయా టీవీలో జాక్ పాట్ అనే షో ప్రసారం చేశారు. జాక్ పాట్ షో వ్యాఖ్యాతగా ప్రముఖ నటి కుష్బూ ఉన్నారు. అనేక ఎపిసోడ్లకు కుష్బూనే వ్యాఖ్యాతగా ఉన్నారు. అయితే జయా టీవీలో జనార్దన్ అలియాస్ జనా ప్రమేయం పేరిగిపోయింది. దినకరన్, శశికళ అండ చూసుకుని జనార్దన్ రెచ్చిపోయాడని వెలుగు చూసింది.

సీన్ కట్ చేస్తే నమిత

సీన్ కట్ చేస్తే నమిత

జయా టీవీలో జనార్దన్ ఒకే సారి పై స్థాయికి చేరుకున్నాడు. జాక్ పాట్ షో నుంచి ఒక్క సారిగి కుష్బూను తప్పించారు. ఆమె స్థానంలో బహుబాష నటి నమితాను తీసుకు వచ్చారు. ఆ షో ప్రారంభం అయ్యే సమయంలోనే నమితా తమిళ్ బాషమాట్లాడటం నేర్చుకుంది.

జయా టీవీ నుంచి అన్నాడీఎంకేలోకి నమితా

జయా టీవీ నుంచి అన్నాడీఎంకేలోకి నమితా

జయలలిత జీవించి ఉన్న సమయంలోనే జనార్దన్ ఈ తతంగం మొత్తం నడిపించాడు. తరువాత టీవీవీ, శశికళ, జనార్దన్ ప్లాన్ ప్రకారం నమితాను అన్నాడీఎంకే పార్టీలో చేర్పించారు. జయలలిత స్వయంగా నమితాను పార్టీలోకి ఆహ్వానించేలా ప్లాన్ చేశారు.

ఇంధ్ర సినిమా హీరోయిన్

ఇంధ్ర సినిమా హీరోయిన్

ఇంధ్ర (తమిళ్) సినిమాలోని హీరోయిన్ వ్యాఖ్యాతగా జయా టీవీలో ఓ షో ప్రారంభించారు. అ షో విషయంలో జనార్దన్ జోక్యం చేసుకున్నాడు. తరువాత తను చెప్పిన మాట వినలేదని ఇంధ్ర సినిమా హీరోయిన్ ను తప్పించి తనకు అనుకూలంగా ఉన్న మరో హీరోయిన్ ను తీసుకు వెళ్లి ఆ షో నడిపించి తనకు ఎదురులేదని జనా నిరూపించుకున్నాడు.

జనార్దన్ ఫోన్ వచ్చిందంటే

జనార్దన్ ఫోన్ వచ్చిందంటే

జయా టీవీ ఉద్యోగులకు జనార్దన్ ఫోన్ చేస్తే హడలిపోయే స్థాయికి అతను చేరిపోయాడు. తమిళ సినీ రంగానికి చెందిన అనేక మందిని టీటీవీ దినకరన్, జనార్దన్ వేధింపులకు గురి చేశారని తమిళ మీడియా కోడైకూస్తోంది.

తమిళ సినీరంగంలోకి

తమిళ సినీరంగంలోకి

తమిళ సినీ పరిశ్రమలోని అనేక రంగంల్లో జనార్దన్ జోక్యం చేసుకుంటూ వచ్చాడు. అన్నిరంగాల్లో పట్టు సాధించి తన గుప్పెట్లో పెట్టుకోవాలని టీటీవీ దినకరన్, జనార్దన్ ప్లాన్ వేశారని ఒక్కొక్క విషయం బయలకు వస్తోంది. ఇప్పుడు ఈ టీటీవీ, జనార్దన్ ల విషయం తమిళనాడులో హాట్ టాఫిక్ అయ్యింది.

చిక్కులు

చిక్కులు

జయా టీవీ, తమిళ సినీరంగంలో టీటీవీ దినకరన్, జనార్దన్ లకు సన్నిహితంగా ఉన్న వారు ఇప్పుడు హడలిపోతున్నారు. దినకరన్ కు పలు కేసుల ఉచ్చు బిగిస్తున్న విషయం తెలుసుకుని ఎక్కడ పోలీసులు మా వరకు వస్తారో ? అంటూ హడలిపోతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+