చీటి చింపేసిన సెక్స్ స్యాండల్ కేసు, వేటు వేసి తాట తీస్తారా లేదా ? మాజీ ప్రధాని మనుమడిపై వేటు !
కర్ణాటకలోని హాసన్ సిట్టింగ్ ఎంపీ, లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిగా బరిలోకి దిగిన ప్రజ్వల్ రేవణ్ణ అశ్లీల వీడియో కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఇప్పటికే ప్రజ్వల్ రేవణ్ణ కర్ణాటక రాష్ట్రం విడిచి విదేశాలకు వెళ్లినట్లు ఆరోపణలు ఉన్నాయి. జేడీఎస్ సిట్టింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ వీడియో కేసు దర్యాప్తుకు కర్ణాటక ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిన తర్వాత ప్రజ్వల్ రేవణ్ణపై పలువురు నాయకులు మండిపడుతున్నారు.
ఇదే సమయంలో ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు వేయాలని సొంత పార్టీలో ఒత్తిడి పెరిగింది. ప్రజ్వల్ రేవణ్ణ కేసుకు సంబంధించి గురుమిఠ్కల్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన జేడీఎస్ ఎమ్మెల్యే శరణగౌడ్ కందకూర్ ప్రజ్వల్ రేవణ్ణను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చెయ్యండం జేడీఎస్ పార్టీలో కలకలం రేపింది. జేడీఎస్ పార్టీ అధినేత, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడకు జేడీఎస్ ఎమ్మెల్యే శరణగౌడ కందుకూర్ లేఖ రాశారు.

జేడీఎస్ అధినేత హెచ్‌డీ దేవెగౌడకు రాసిన లేఖలో ప్రజ్వల్ రేవణ్ణ గురించి మీరు లోతుగా ఆలోలించాలని అన్నారు. నేనే పార్టీలో చాలా జూనియర్, మీలాంటి సీనియర్‌కు, పార్టీ అధినేతకు సలహాలు ఇచ్చేంత పెద్దవాడిని కాను, అయితే మన పార్టీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ పరిస్థితి ఇంత వరకు వచ్చిందని, అందుకే ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చెయ్యాలని మీకు మనవి చేస్తున్నానని జేడీఎస్ ఎమ్మెల్యే శరణగౌడ కందుకూర్ మనవిచేశారు.
జేడీఎస్ పార్టీ గురించి నా అంతరంగిక అభిప్రాయాలను ఓపెన్ మైండ్‌తో వ్యక్తం చేస్తున్నానని, కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా హల్‌చల్ చేస్తున్న సెక్స్ స్కాండల్ వీడియో క్లిప్‌లు మన జేడీఎస్ పార్టీని తీవ్రంగా ఇబ్బందికి గురిచేస్తున్నాయని, హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ఆ వీడియో ఫుటేజీలో కనిపించారని, ఈ వీడియో చూస్తే ఆయన దోషి అని తెలుస్తోందని, వెంటనే ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని మిమ్మల్ని కోరుతున్నానని, ఆయనను వెంటనే పార్టీ నుంచి తప్పించండి అని మాజీ ప్రధాని దేవేగౌడకు ఆయన సొంత పార్టీ ఎమ్మెల్యే లేఖ రాయడం కలకలం రేపుతోంది.
ఇదే సమయంలో జేడీఎస్ పార్టీ గురించి ఎమ్మెల్యే శరణగౌడ కందుకూరు వివరించారు. ఆరు దశాబ్దాలకు పైగా మీరు సాగిస్తున్న రాజకీయ జీవితం యావత్ దేశానికే ఆదర్శం, మీ సిద్ధాంతాలు, మీ సిద్ధాంతాల పునాదులపై పార్టీని సమర్ధవంతంగా నిర్మించారు, దేశానికి ప్రధాని అయిన తొలి కన్నడిగ అనే ఘనత మీకు మాత్రమే దక్కిందని, మన్నినమగగా మీరు కన్నడిగులు తల ఎత్తుకునేలా చేశారని, మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని మాలాంటి వాళ్లు రాజకీయాల్లోకి వచ్చారని జేడీఎస్ ఎమ్మెల్యే శరణగౌడ కందుకూర్ ఆ లేఖలో వివరించారు.

మీ కుమారుడిగా, ముఖ్యమంత్రిగా హెచ్ డీ కుమారస్వామి కర్ణాటకకు చాలా సేవ చేశారని ఇదే సమయంలో జేడీఎస్ ఎమ్మెల్యే శరణగౌడ కందుకూరు వివరించారు. రైతుల శ్రేయస్సు కోసం నిత్యం పాటుపడే నాయకుడు కుమారస్వామి అని, కర్ణాటకలో లాటరీ నిషేధించి ఆడవాళ్ల ముఖంలో చిరునవ్వు చూశారని, లాటరీ నిషేధంతో ఎన్నో కాపురాలు నిలబెట్టిన ఘనత కుమారస్వామికి ఉందని, చదువుకుంటున్న ఆడపిల్లల కష్టాలు గమనించి వారికి ఉచితంగా సైకిళ్లు పంపిణి చేసిన చరిత్ర కుమారస్వామికి మాత్రమే సొంతం అని జేడీఎస్ ఎమ్మెల్యే శరణగౌడ కందకూరు మాజీ ప్రధాని హెచ్ డీ దేవేగౌడకు రాసిన లేఖలో వివరించారు.
సెక్స్ స్యాండల్ వ్యవహరంలో హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను పార్టీ నుంచి సస్పెండ్ చెయ్యాలని సొంత పార్టీ ఎమ్మెల్యే మాజీ ప్రధాని హెచ్ డీ దేవేగౌడకు లేఖరాయడం కర్ణాటకలో కలకం రేపింది. సొంతపార్టీ ఎమ్మెల్యేలు మీ మీద తిరగబడుతున్నారని, ఇప్పుడు మీరే ఏం సమాధానం చెబుతారని కాంగ్రెస్ నాయకులు జేడీఎస్ పార్టీని ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద హాసన్ జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన సెక్స్ స్కాండల్ వ్యవహారం కర్ణాటక రాజకీయాలను కుదిపేస్తోంది.












Click it and Unblock the Notifications