సెక్స్ స్యాండల్ కేసు సీబీఐకి ఇస్తే మ్యాటర్ బయటకు వస్తుంది, లేదంటే తేడా కొడుతుంది, రష్మీ !
హాసన్ జేడీఎస్ పార్టీ సిట్టింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అశ్లీల వీడియోల కేసు సంచలనం రేపుతుండగా ఇప్పటికే కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ సిట్ ఏర్పాటు చేసి ఆ సెక్స్ స్కాండల్ కేసు విచారణ చేపట్టింది. ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన అశ్లీల వీడియోలు ఉన్న పెన్ డ్రైవ్ లు భారీ సంఖ్యలో ప్రజలకు పంచిపెట్టి మహిళల పరువు తీసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.
హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అశ్లీల వీడియోలు అంటూ కొన్ని వీడియోల ఉన్న పెన్ డ్రైవ్ లను హాసన్ జిల్లా ప్రజలకు పంచి పెడుతున్న నిందితులను వెంటనే అరెస్టు చేసి అన్ని కేసుల దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని జేడీఎస్ మహిళా విభాగం కర్ణాటక రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు రష్మీ రామేగౌడ డిమాండ్ చేశారు. ప్రజ్వల్ రేవణ్ణ అశ్లీల వీడియోలు లీక్ అయిన వ్యవహారంపై కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్‌కు జేడీఎస్ పార్టీ మహిళా విభాగం మహిళా నాయకురాలు రష్మీ రామేగౌడ ఫిర్యాదు చేశారు.

డీకే శివకుమార్ కారణంగానే బాధిత మహిళలకు న్యాయం చేయడం అసాధ్యం కావడం లేదని, లీకైన అశ్లీల వీడియోల వల్ల బాధితులు విపరీతమైన బాధను, అవమానాన్ని, ఆవేదనను అనుభవిస్తున్నారని జేడీఎస్ నాయకురాలు రష్మీ రామేగౌడ ఆరోపించారు. బాధిత కుటుంభానికి జరిగిన నష్టం, అవమానాలు వర్ణనాతీతం. వీడియోలో ఉన్న మహిళల గుర్తింపును బయటపెట్టడం క్షమించరాని నేరమని రష్మీ రామేగౌడ ఆరోపించారు.

కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఈ కేసును నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయడంలో విఫలమైందని, ఈ నేపథ్యంలో బాధిత మహిళలు, వారి కుటుంబాలకు న్యాయం చేయడంలో సిట్ విఫలమైందని, అందుకే ఈ కేసును వెంటనే సీబీఐకి అప్పగించాలని, సీబీఐ విచారణతో మాత్రమే నిజానిజాలు పూర్తిగా బయటకు వస్తాయని రష్మీ రామేగౌడ అభిప్రాయం వ్యక్తం చేశారు.
సోషల్ మీడియాలోకి లెక్కలేనన్ని అశ్లీల వీడియోలు షేర్ చేసిన కుట్రలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ల ప్రమేయం ఉందని హోలెనరసీపుర బీజేపీ నాయకుడు, న్యాయవాది దేవరాజ్ గౌడ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. బీజేపీ నాయకుడు చేసిన ఆరోపణలను సిట్ పరిగణనలోకి తీసుకోలేదా అని జేడీఎస్ నాయకురాలు రష్మీ రామేగౌడ కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
-
రేపే ఐపీఎల్ ఓపెనర్: మెట్రో రైల్ లో ఫ్రీ ట్రావెల్: మంత్రులకూ -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా!












Click it and Unblock the Notifications