అదాని కాబోయే కోడలు ఎవరో తెలుసా?

Jeet Adani Wedding: దేశీయ పారిశ్రామిక దిగ్గజం, అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీల అధినేత గౌతమ్ అదాని ఇంట త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆయన తనయుడు జీత్ అదాని పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. ఫిబ్రవరి 7వ తేదీన దివా జైమిన్ షాను వివాహం చేసుకోనున్నారు.

అహ్మదాబాద్‌కు చెందిన వజ్రాల వ్యాపారి జైమిన్ షా.. కుమార్తె దివా. ఆయన- సీ దినేష్ అండ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్‌కు అధినేత. 023లో జీత్ అదాని- దివా జైమిన్ షా ఎంగేజ్‌మెంట్ జరిగింది. దాదాపుగా రెండు సంవత్సరాల తరువాత వారిద్దరూ పెళ్లి పీటలు ఎక్కబోతోన్నారు. 7వ తేదీన అంగరంగ వైభవంగా వివాహ వేడుకలను నిర్వహించడానికి రెండు కుటుంబాల వారు ఏర్పాట్లు చేస్తోన్నారు.

Jeet Adani along with his fianc e Diva Jaimin Shah visited Mitti Cafe

గౌతమ్ అదాని- ప్రీతి అదానీల చిన్న కుమారుడు జీత్. ప్రస్తుతం అదానీ ఎయిర్‌పోర్ట్స్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తోన్నారు. యూనివర్శిటీ ఆఫ్ పెన్సిల్వేనియా స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ అప్లైడ్ సైన్సెస్ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2019లో అదానీ గ్రూప్ సంస్థల్లో చేరారు. సీఎఫ్ఓగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. అదానీ ఎయిర్‌పోర్ట్స్ డైరెక్టర్‌గా బాధ్యతలను స్వీకరించారు. అదానీ డిజిటల్ ల్యాబ్స్‌నూ ఆయనే పర్యవేక్షిస్తున్నారు.

జీత్- దివా షా ఇటీవలే ముంబై ఛత్రపతి శివాజీ మహరాజ్ ఎయిర్‌పోర్ట్‌లో మిట్టీ కేఫ్‌ను సందర్శించారు. అక్కడి ఉద్యోగులతో ఉల్లాసంగా గడిపారు. ఈ కేఫ్‌కు ఓ ప్రత్యేకత ఉంది. శారీరక, మానసిక వైకల్యం, బుద్ధి మాంద్యం ఉన్న వాళ్లు ఈ కేఫ్‌ను నిర్వహిస్తోన్నారు. చెయిన్ కేఫ్ రెస్టారెంట్ ఇది. 2017లో అలీనా ఆలం దీన్ని నెలకొల్పారు.

Jeet Adani along with his fianc e Diva Jaimin Shah visited Mitti Cafe

సుప్రీంకోర్టు, ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్- ముంబై, కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం- బెంగళూరు, మెర్సిడెస్-బెంజ్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ వంటి కార్పొరేట్ పార్క్స్ సహా దేశవ్యాప్తంగా 40కి పైగా ప్రాంతాల్లో మిట్టీ కేఫ్ అవుట్ లెట్స్ కొనసాగుతున్నాయి.

సీఎస్ఎంటీ ఎయిర్‌పోర్ట్ ఆవరణలో గల ఈ కేఫ్‌ను ఇటీవలే జీత్ అదాని- దివా జైమిన్ షా సందర్శించారు. అక్కడి సిబ్బందితో ఉల్లాసంగా గడిపారు. వారిలో సెల్ఫీ దిగారు. కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా కేఫ్ సిబ్బంది జీత్- దివా జంటకు శాలువ కప్పి సత్కరించారు. అపర కుబేరుడు గౌతమ్ అదాని తనయుడు, కాబోయే కోడలు తమ కేఫ్‌కు రావడంతో అక్కడి సిబ్బంది ఉబ్బితబ్బిబ్బయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+