భారత్‌లో "జెన్నిఫర్ లోపేజ్" డాన్స్ వీడియో వైరల్.. ఎన్ని కోట్లు ఇచ్చారంటే ?
జెన్నిఫర్ లోపెజ్... ఈ ఏజ్ లెస్ బ్యూటీకి ప్రపంచ వ్యాప్తంగా ఫుల్ ఫాలోయింగ్ ఉంది. సింగర్, డ్యాన్సర్, హాలీవుడ్ నటిగా ఎంతో పేరు పొందిన ఈ బ్యూటీ.. ఈ వయస్సులో కూడా యంగ్ బ్యూటీలకు ఏ మాత్రం తగ్గకుండా అందర్నీ ఫిదా చేస్తోంది. 57 ఏళ్ల వయసులో కూడా ఎనర్జిటిక్ పర్ఫామెన్స్ లతో సెన్సేషన్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఆమె వీడియో క్లిప్స్ ఇప్పుడు కూడా నెట్టింట ఫుల్ ట్రెండింగ్ అవుతూనే ఉంటాయి. లేటెస్ట్ గా భారత్ తో ఆమె చేసిన పర్ఫామెన్స్ వీడియో ఇప్పుడు ఫుల్ ట్రెండ్ అవుతుండగా.. అందుకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుందని జోరుగా చర్చ నడుస్తోంది.
అంగరంగ వైభవంగా వివాహం..
భారత సంతతి అమెరికన్ బిలియనీర్ మంతెన రామరాజు కుమార్తె వివాహం.. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో ఇటీవల అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. అమెరికా ఫార్మా ఇండస్ట్రీలో పేరొందిన ఆయన కుమార్తె నేత్ర మంతెనకు.. సూపర్‌ఆర్డర్' సహ వ్యవస్థాపకుడు వంశీ గాదిరాజు వివాహాం జరిగింది. ఈ పెళ్లి వేడుకలకు వివిధ దేశాల నుంచి 600 మందికి పైగా ప్రముఖులు హాజరయ్యారు. దేశవిదేశాల నుంచి ప్రముఖులు హాజరవుతుండటంతో.. వారి కోసం ఉదయపుర్ విమానాశ్రయంలో మూడు రోజుల్లో 70కి పైగా చార్టర్ విమానాలు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

గత శుక్రవారం తాజ్ లేక్ ప్యాలెస్‌లో హల్దీ వేడుక.. శనివారం సిటీ ప్యాలెస్‌లోని మానెక్ చౌక్‌లో సంగీత్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ నటి దియా మీర్జా వ్యాఖ్యాతగా వ్యవహరించారు. జగ్ మందిర్ ప్యాలెస్‌లో వివాహ కార్యక్రమాలు అట్టహాసంగా నిర్వహించారు. వివాహానంతరం సాయంత్రం జెనానా మహల్‌లో విందు ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు ప్రముఖ వ్యాపారవేత్తలు, బిలియనీర్లు, రాజకీయ నాయకులు, బాలీవుడ్ హీరోలు హృతిక్ రోషన్, షాహిద్ కపూర్, రణబీర్ కపూర్ హాజరయ్యారు. అలానే నటీమణులు మాధురీ దీక్షిత్, జాన్వీ కపూర్, కృతి సనన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కూడా పాల్గొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు ట్రంప్ జూనియర్, అతడి గర్ల్ ఫ్రెండ్.. ప్రత్యేక అతిథులుగా విచ్చేశారు.
రూ.17 కోట్లు రెమ్యూనరేషన్..
కాగా ఈ క్రమంలోనే జెన్నిఫర్ లోపేజ్ ఈ వేడుక కోసం ధరించిన డిజైనర్ మోనోకిని ప్రత్యేక ఆకర్షణగా మారింది. భారతీయ వస్త్రధారణతో ఆమె ఆకట్టుకోగా.. ఈ వేడుకల్లో భాగంగా జెన్నిఫర్ లోపేజ్ ప్రదర్శన ఇచ్చారు. తన కెరీర్ లో చార్ట్ బస్టర్ పాటలను ఎంపిక చేసుకుని వాటికి పర్ఫామెన్స్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఒక్క ప్రదర్శనకు జెన్నిఫర్ లోపేజ్ గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇక ఈ ఈవెంట్లో జెన్నిఫర్ లోపేజ్ ప్రదర్శన కోసం ఏకంగా రూ.17 కోట్లు అందుకున్నారని ప్రచారం జరుగుతోంది. గతంలోనూ ఉదయ్ పూర్ లో జరిగిన పలు వివాహ వేడుకల్లో జెన్నిఫర్ లోపేజ్ పాల్గొన్నారు. 2015లో జరిగిన సంజయ్ హిందూజా పెళ్లికి జెన్నిఫర్ హాజరయ్యారు. ఆ వేడుకల్లో ప్రదర్శన ఇచ్చినందుకు గానూ జెన్నిఫర్ 6.5 కోట్ల రూపాయలు ఛార్జ్ చేశారని సమాచారం. దీంతో ఈ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ గా మారింది.
#OMG : Jenifer lopez ‘is paid m’ to perform at Indian billionaire’s ultra-lavish & star-studded wedding – complete with huge 15ft cake
— Mukund Shahi (@Mukundshahi73) November 25, 2025
#JenniferLopez #JLo #UdaipurWedding #NetraMantena #VamsiGadiraju #CelebrityPerformance #BillionaireWedding pic.twitter.com/KMPVt1Ac2y
Stage on fire.Crowd electrified. Jennifer Lopez amplified at viral Udaipur Wedding #JenniferLopez #hollywoodvibes #UdaipurWedding #Bollywood #Celebrities pic.twitter.com/Ps9RmmI8GD
— The Outspoken (@metheoutspoken) November 24, 2025
-
Kangana Ranaut:మంగ్లీ పాటపై మండిపడ్డ ఎంపీ కంగనా-హద్దులు దాటేశారంటూ..!! -
రెండు ఎలక్ట్రిక్ స్టవ్ లు కొన్నా.. గ్యాస్ కొరత వేళ సూపర్ స్టార్ సంచలనం -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications