జెరూసలేం: అల్-అక్సా... మందిరం ఒక్కటే... ముస్లింలు, యూదులకు పవిత్ర స్థలం ఎలా అయింది

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రమాణ స్వీకారం చేసిన వారం రోజుల్లోనే ఆ దేశ నేషనల్ సెక్యూరిటీ మంత్రి ఇత్మార్ బెన్ గివిర్, జెరూసలేంలోని అల్-అక్సాను సందర్శించడం వివాదానికి దారితీసింది.
దీన్ని 'రెచ్చగొట్టే చర్య’గా పాలెస్తీనా అథారిటీ పేర్కొంది.
జెరూసలెం ప్రాంతాన్ని ముస్లింలు, యూదులు, క్రైస్తవులు పవిత్రంగా భావిస్తారు. మక్కా, మదీనా తర్వాత మూడో పవిత్ర స్థలంగా అల్-అక్సాను ముస్లింలు పరిగణిస్తారు.
అల్-అక్సాను అత్యంత పవిత్రమైన ప్రదేశంగా యూదులు కూడా చూస్తారు.
మసీదు ప్రాంగణంలోకి యూదులు ప్రవేశించొచ్చు. కానీ అక్కడ వారు ప్రార్థనలు చేయడం నిషేధం.
మరి ఇజ్రాయెల్ మంత్రి అల్-అక్సా మసీదు ప్రాంగణాన్ని సందర్శించడం వివాదాస్పదంగా ఎందుకు మారింది?
- మనిషి మృతదేహాన్ని ఎరువుగా ఎలా మారుస్తారు... కూరగాయలు ఎలా పండిస్తారు
- చదువుకున్న బడిని కార్పొరేట్ స్కూల్‌గా అభివృద్ధి చేసిన ఎన్ఆర్ఐ

అల్-అక్సా మసీదు ఎందుకంత ముఖ్యం?
తూర్పు జెరూసలేంలో ఉన్న అల్-అక్సా మసీదు కాంప్లెక్స్ యూదులకు అత్యంత పవిత్రమైన ప్రదేశం. యూదులు 'టెంపుల్ మౌంట్', ముస్లింలు 'అల్-హరమ్ అల్-షరీఫ్' అని పిలిచే పవిత్ర స్థలంలో 'అల్-అక్సా మసీదు', 'డోమ్ ఆఫ్ ది రాక్'లు కూడా భాగం .
'డోమ్ ఆఫ్ ది రాక్' ను అత్యంత పవిత్రమైన ప్రదేశంగా యూదులు భావించినట్లే... మహమ్మద్ ప్రవక్తతో ఉన్న అనుబంధం కారణంగా ముస్లింలు కూడా 'డోమ్ ఆఫ్ ది రాక్'ను పవిత్ర ప్రదేశంగా భావిస్తారు.
అయితే ఈ స్థలంలో ముస్లింలు కాని వారు ప్రార్థనలు చేయడాన్ని నిషేధించారు.అల్-అక్సా అనేది 35 ఎకరాల కాంప్లెక్స్‌లో ఉన్న గుండ్రని గోపురం గల మసీదు. ముస్లింలు దీనిని 'అల్-హరమ్-అల్ షరీఫ్’ అని కూడా పిలుస్తారు. యూదులు దీనిని 'టెంపుల్ టౌన్’ అంటారు.
ఈ సముదాయం జెరూసలేంలోని ఓల్డ్ ఏరియాలో ఉంది. దీనికి యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద హోదా కూడా ఉంది.
- బాబ్రీ మసీదు విధ్వంసానికి ఒక రోజు ముందు 'రిహార్సల్స్' ఎలా జరిగాయంటే..
- 'మియా' మ్యూజియం: అస్సాంలోని 'ముస్లిం' మ్యూజియంపై వివాదం ఏంటి?

అల్-అక్సా చరిత్ర ఏంటి?
1967లో వెస్ట్ బ్యాంక్, గాజాలోని కొంతభాగం, ఓల్డ్ సిటీతో సహా తూర్పు జెరూసలేంను ఇజ్రాయెల్ ఆక్రమించుకున్నప్పటి నుంచి అల్-అక్సా మరింత వివాదాస్పద ప్రాంతంగా మారింది.
ఇజ్రాయెల్ రావడానికి ముందు నుంచి ఈ వివాదం కొనసాగుతోంది.1947లో ఐక్యరాజ్యసమితి ప్రత్యేక పాలెస్తీనా కోసం విభజన ప్రణాళికను రూపొందించింది. ఆ సమయంలో పాలెస్తీనా బ్రిటిష్ ఆక్రమణలో ఉంది.
ఈ ప్రణాళిక ప్రకారం రెండు దేశాలు ఏర్పడతాయి. ఒకటి ఐరోపా నుంచి వచ్చిన యూదుల కోసం, మరొకటి పాలెస్తీనా ప్రజల కోసం. యూదులకు 55 శాతం భూమిని, మిగిలిన 45 శాతాన్ని పాలెస్తీనాకు ఇవ్వాలని ఆ ప్రణాళిక చెబుతోంది.
అల్-అక్సా కాంప్లెక్స్ ఉన్న జెరూసలేంను మాత్రం ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ స్థాయి పర్యవేక్షణలోనే ఉంచాలని ప్రకటించింది. కానీ 1948లో వెస్ట్ బ్యాంక్, గాజా ప్రాంతం సహా 72 శాతం భూమిని ఇజ్రాయెల్ ఆక్రమించింది. తనను తాను స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది.
వాస్తవానికి 1967లో రెండో అరబ్-ఇజ్రాయెల్ యుద్ధం తరువాత తూర్పు జెరూసలేం నగరాన్ని ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకుంది. ఈ విధంగా అక్కడి ఓల్డ్ ఏరియాలో ఉన్న అల్-అక్సా కాంప్లెక్స్ కూడా దాని నియంత్రణలోకి వచ్చింది.
జోర్డాన్ నుంచి దాన్ని ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకుంది. కానీ, పవిత్ర స్థలాల నియంత్రణపై వివాదం తలెత్తడంతో అక్కడ యథాతథ స్థితి కొనసాగించడానికి ఒక వ్యవస్థ రూపొందించారు.
దీని ప్రకారం ఈ స్థలం సంరక్షణ బాధ్యత (కస్టోడియన్)ను జోర్డాన్‌కు అప్పగించారు. సెక్యూరిటీ బాధ్యతను ఇజ్రాయెల్ చూస్తోంది. కానీ, నమాజ్ చేయడానికి ముస్లింలకు మాత్రమే అనుమతి ఉంది. యూదులు ఇక్కడికి రావచ్చు, కానీ వారు అక్కడ ప్రార్థన చేయడాన్ని నిషేధించారు.
- అఫ్గానిస్తాన్: 'దేవుడు మాకు చదువుకునే హక్కు ఇచ్చాడు, మమ్మల్ని చదువుకోనివ్వండి' - ఖురాన్‌లోని ఒకే ఒక్క పదంతో తాలిబాన్లపై మహిళల పోరాటం
- అడాల్ఫ్ హిట్లర్: అరవై లక్షల యూదుల హత్యకు కారణమైన ఆ నియంత... ఈ యూదు చిన్నారికి మంచి స్నేహితుడు

మహ్మద్ ప్రవక్తకు సంబంధమేంటి?
ఏడో శతాబ్దంలో నిర్మించిన అల్-అక్సా మసీదు, 'డోమ్ ఆఫ్ ది రాక్' రెండూ కూడా ముస్లింల పవిత్ర స్థలాలు. మహమ్మద్ ప్రవక్త ఇక్కడి నుంచి స్వర్గానికి వెళ్లారని ముస్లింలు నమ్ముతారు.
బైబిల్ ప్రస్తావించిన యూదుల దేవాలయాలు ఇక్కడే ఉన్నాయని యూదులు నమ్ముతారు. ఈ కాంప్లెక్స్ పశ్చిమ గోడను 'వైలింగ్ వాల్' (శోక గోడ) అని పిలుస్తారు. ఇది యూదుల ఆలయంలో భాగమని నమ్ముతారు. ముస్లింలు దీనిని అల్-బురాక్ గోడ అని పిలుస్తారు.
ఇక్కడ మహమ్మద్ ప్రవక్త అల్-బురాక్ అనే జంతువును కట్టివేసినట్లు నమ్ముతారు. దీని కారణంగా ఆయన స్వర్గానికి వెళ్లి అక్కడ అల్లాతో మాట్లాడారని విశ్వసిస్తారు.
- ఇజ్రాయెల్-పాలస్తీనా: యూదులను క్రైస్తవులు అంటరానివారిగా చూస్తారా.. గాంధీ చెప్పిందే నిజమైందా
- ఇజ్రాయెల్ - పాలస్తీనా మధ్య మళ్లీ భీకర ఘర్షణ.. ఇజ్రాయెల్ దాడుల్లో గాజాలో చిన్నారులు సహా 31 మంది మృతి
తెరపైకి కొత్త డిమాండ్లు
అల్-అక్సా కాంప్లెక్స్‌కు సంబంధించి ఇజ్రాయెల్, జోర్డాన్ మధ్య 1967లో ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం జోర్డాన్ వక్ఫ్ బోర్డు మసీదు లోపల నిర్వహణ బాధ్యత పొందింది. ఇజ్రాయెల్‌కు బయటి భద్రత చూసే బాధ్యత ఉంది.
అల్-అక్సా మసీదు కాంప్లెక్స్ లోపలకు యూదులు వెళ్లకుండా ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని టెంపుల్ మౌంట్‌ను విశ్వసించే టెంపుల్ ఇన్‌స్టిట్యూట్ ఒత్తిడి చేస్తోంది. ఆ ప్రాంగణంలో మూడో యూదు ఆలయాన్ని నిర్మించాలని వారు భావిస్తున్నారు.
యథాతథ స్థితిని కొనసాగించాలని చెబుతున్నప్పటికీ ఇజ్రాయెల్ ప్రభుత్వం టెంపుల్ ఇన్‌స్టిట్యూట్ వంటి గ్రూపులకు డబ్బు ఇస్తోందని న్యూస్ వెబ్‌సైట్ అల్-జజీరా తన కథనంలో పేర్కొంది.
కానీ క్రమంగా ఇజ్రాయెల్ సైనికులు పాలస్తీనా ప్రాంతాల్లో స్థిరపడిన యూదులను అక్కడికి వెళ్లేందుకు అనుమతిస్తూనే ఉన్నారు.
యూదులు లోపలకు వెళ్లడానికి ఇజ్రాయెల్ పోలీసులు, సైన్యం రక్షణ ఇస్తున్నట్లుగా అల్-జజీరా తెలిపింది. దీంతో అల్-అక్సా ఇజ్రాయెల్ అధీనంలోకి వెళ్తుందనే భయాన్ని పాలెస్తీనా వ్యక్తం చేస్తోంది.
అల్-జజీరా కథనం ప్రకారం 1999లో 'డోమ్ ఆఫ్ ది రాక్' స్థానంలో మూడో ఆలయానికి పునాది రాయి వేస్తామని టెంపుల్ టౌన్‌ను విశ్వసించేవాళ్లు ప్రకటించారు.
దీని తరువాత ఆ ప్రాంతంలో పాలెస్తీనియన్లు, ఇజ్రాయెల్ సైనికుల మధ్య రక్తపాతం జరిగింది. ఇందులో 20 మంది పాలస్తీనియన్లు మరణించారని తెలిపింది.
ఇవి కూడా చదవండి:
- దర్గా ముందు తిండి కోసం ఎదురు చూసే ఈ చిన్నారి మిలియనీర్ ఎలా అయ్యాడు?
- న్యూయార్క్ మహా నగరం 'ఖాళీ’ అయిపోతోంది... ఎందుకు?
- చెంఘిజ్ ఖాన్ ఓ బండి నిండా పురుగులను వెంటబెట్టుకుని ఎందుకు తిరిగేవాడు?
- 2023లో మానవ జీవితాల్ని మార్చబోయే 5 శాస్త్రీయ పరిశోధనలు
- స్పామ్ కాల్స్: 'హలో... మీకు 5 లక్షల పర్సనల్ లోన్ అప్రూవ్ అయింది, తీసుకుంటారా?'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
-
ట్రంప్ సీజ్ ఫైర్ కు నో..! మళ్లీ తీవ్రస్థాయికి ఇరాన్ వార్...! -
హార్ముజ్ రక్షకుడిని చంపేశాం..! ఇజ్రాయెల్ సంచలన ప్రకటన..! -
అమెరికా-ఇరాన్ యుద్ధంలో బిగ్ ట్విస్ట్: రంగంలోకి హిజ్బుల్లా..! -
అమెరికా పరువుతీసిన పాకిస్థాన్.. మంత్రి సంచలన ట్వీట్! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..!












Click it and Unblock the Notifications