గాలిలో విమానం: లండన్-ముంబై ఫ్లైట్లో కొట్టుకున్న పైలట్లు, వేడుకోలు

Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: ఓ జెట్‌ ఎయిర్‌‌వేస్‌ విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానం నడుపుతున్న ఇద్దరు సీనియర్‌ పైలట్లు విమానం గాల్లో ఉండగానే ఘర్షణకు దిగారు. ఒకరినొకరు కొట్టుకున్నారు.

గజల్ శ్రీనివాస్ నీచుడు, గదిలో నగ్నంగా: బాధితురాలు కన్నీటిపర్యంతం

కాక్‌పీట్‌లోనే వారు ఒకరితో ఒకరు గొడవపడ్డారు. అయితే, సిబ్బంది జోక్యం చేసుకుని వారిని శాంతింపజేయడంతో చివరకు విమానాన్ని జాగ్రత్తగా కిందికి దించారు. జనవరి 1న లండన్‌ నుంచి ముంబై మధ్య నడిచే జెట్‌ ఎయిర్‌ వేస్‌ విమానంలో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

జనవరి 1న

జనవరి 1న

ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. బోయింగ్‌ 777 విమానం 324మంది ప్రయాణీకులు, 14మంది సిబ్బందితో బ్రిటన్‌ కాలమానం ప్రకారం జనవరి 1న ఉదయం పదిగంటలకు నూతన సంవత్సరం రోజే ముంబైకి బయలు దేరింది.

కో-పైలట్‌పై చేసుకున్న పైలట్

కో-పైలట్‌పై చేసుకున్న పైలట్

మొత్తం తొమ్మిదిగంటలపాటు సాగే ఈ ప్రయాణం మధ్యలో విమానం టేకాఫ్‌ తీసుకున్న తర్వాత ఇద్దరు పైలట్ల మధ్య గొడవ మొదలైంది. కాక్‌పీట్‌ కెప్టెన్‌ కో-పైలట్‌ను చెంపచెల్లుమనిపించాడు. దీంతో ఆమె ఏడుస్తూ కాక్‌పీట్‌ నుంచి బయటకొచ్చింది.

కన్నీళ్లపర్యంతమైన కోపైలట్

కన్నీళ్లపర్యంతమైన కోపైలట్

ఆ తర్వాత కిచెన్‌లోకి వెళ్లి కన్నీటిపర్యంతమైంది. అయితే, ఇతర సిబ్బంది ఆమెను ఓదార్చి తిరిగి కాక్‌పీట్‌లోకి పంపించారు. అప్పటికే కెప్లెన్‌ కూడా ఆమెను కాక్‌పీట్‌లోకి పంపించాలని సిబ్బందిని కోరారు. అనంతరం కూడా వారిద్దరు తీవ్రంగా మరోసారి గొడవపడి.. కాక్‌పీట్‌ను ఇద్దరూ వదిలేయడం జరిగింది.

చివరికి సురక్షితంగా..

చివరికి సురక్షితంగా..

కాగా, కో-పైలెట్‌ మరోసారి అందులోకి వెళ్లేందుకు నిరాకరించగా.. ప్రయాణీకులను సురక్షితంగా చేర్చాలన్న సిబ్బంది వేడుకోలు మేరకు ఆమె అంగీకరించింది. ఎట్టకేలకు విమానాన్ని సురక్షితంగా ల్యాండ్‌ చేశారు. ఈ గొడవను జెట్‌ ఎయిర్‌ వేస్‌ అధికారులు కూడా ధ్రువీకరించారు. వారిద్దరి మధ్య సమాచార బదిలీ లోపం కారణంగా ఈ సమస్య ఏర్పడినట్లు ప్రాథమికంగా తెలిపారు. కాగా, డీజీసీఏ ఈ వవ్యహారంపై తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు తెలిపింది. ప్రయాణికులను ప్రమాదంలో పెట్టడం సరైంది కాదని పేర్కొంది. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Two senior pilots of the Jet Airways London-Mumbai flight fought inside the cockpit, following which they were derostered. The commander allegedly slapped the lady co-pilot mid-flight after which she left the cockpit in tears.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి