రూ. 32 కోట్లు పట్టుబడిన కేసు: జార్ఖండ్ మంత్రి, కాంగ్రెస్ నేత అలంగీర్ ఆలం అరెస్ట్

రాంచీ: మనీలాండరింగ్ కేసులో జార్ఖండ్​ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు ఆలంగీర్ ఆలమ్‌​ను ఎన్​‌ఫోర్స్‌​మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం అరెస్ట్ చేసింది. ఆలంగీర్ ఆలమ్​ పీఏ సంజీవ్ లాల్ ఇంటి పనిమనిషి ఇంట్లో భారీ నగదు స్వాధీనం చేసుకున్న కేసులో అరెస్ట్ చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు.

మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎమ్‌ఎల్‌ఏ) నిబంధనల ప్రకారం, ఈడీ జోనల్ కార్యాలయంలో రెండో రోజు ప్రశ్నోత్తరాల సమయంలో సుమారు ఆరు గంటల పాటు విచారించిన తర్వాత అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.గత వారం ఆలంగీర్ ఆలమ్​ పీఏ సంజీవ్ కుమార్ లాల్ (52) పనిమనిషి జహంగీర్ ఆలమ్ ఇంట్లో 32 కోట్ల రూపాయలకు పైగా నగదును ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Jharkhand minister and congress leader alamgir alam arrested in money laundering case

రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖలో అక్రమాలు జరుగుతున్నాయని, ఆ సొమ్ము అందుకు సంబంధించిందేనని ఆరోపించారు. కాగా, గత ఏడాది అరెస్టైన జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మాజీ చీఫ్ ఇంజినీర్ వీరేంద్ర కే రామ్ పై మనీలాండరింగ్ కేసులో విచారణకు సంబంధించి ఈ దాడులు జరిగాయి. ఈ శాఖలో కొన్ని పథకాల అమలులో అవతవకలు జరిగినట్లు తెలుస్తోంది.


కాగా, ఈ దాడిలో పట్టుబడిన నగదును లెక్కించేందుకు పెద్ద మొత్తంలో కౌంటింగ్ మిషన్లు తెప్పించడం, గుట్టలుగా ఉన్న రూ. 500 నోట్లను లెక్కించిన దృశ్యాలు ఇటీవల వైరల్ అయిన విషయం తెలిసిందే. 70 ఏళ్ల ఆలంను మంగళవారం ఈడీ రాంచీ జోనల్ కార్యాలయంలో విచారించిన ఒకరోజు తర్వాత ఆయనను అరెస్ట్ చేయడం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+