భర్తపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళను స్టేషన్ లోని రూమ్ లోకి తీసుకెళ్లి.. ఏం జరిగిందంటే..?

సమాజంలో ఇటీవలి కాలంలో మహిళలపై రోజురోజుకూ అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. చిన్నాపెద్దా అన్న తేడా లేకుండా కొన్ని మానవ మృగాలు విచక్షణారహితంగా ప్రవర్తిస్తున్నాయి. ఆడపిల్ల అయితే చాలు అని మృగాళ్లలా మీదపడిపోతున్నారు. వావి వరసలు మరచి అత్యాచారాలకు తెగబడుతున్న వారు మరోవైపు ఉన్నారు. తమ కామ వాంఛ కారణంతో ఎన్నో కుటుంబాలను వాళ్లు విచ్చిన్నం చేస్తున్నారు. కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాలు పోక్సో, నిర్భయ, దిశ లాంటి ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా.. కఠినంగా శిక్షించినా ఇలాంటి ఘటనలు మాత్రం ఆగడం లేదు. మరోవైపు ప్రజల్ని సంరక్షించాల్సిన పోలీసులే కొన్ని చోట్ల ఇలాంటి దారుణాలకు పాల్పడటం తీవ్ర కలకలం రేపుతోంది. తమ గోడును చెప్పుకోవడానికి పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఓ మహిళపై ఓ పోలీస్ అధికారి స్టేషన్ లోనే అఘాయిత్యానికి పాల్పడటం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చట్టాల్ని కాపాడాల్సిన పోలీసులే ఇలాంటి పనులు చేయడంపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర స్థాయిలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.

తాజాగా ఝార్ఖండ్ లోని సెరాయ్ ఖేలా ఖర్సావాన్ జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. తన భర్తపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఓ మహిళపై పోలీస్ అధికారి స్టేషన్ లోనే అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణమైన ఘటన ఘమ్ హరియా పోలీస్ స్టేషన్ లో జరిగింది. ఉన్నతాధికారుల సమాచారం ప్రకారం ప్రస్తుతం నిందితుడ్ని అరెస్ట్ చేసి కస్టడీకి తరలించారు. ఈ ఘటనపై సెరాయ్ ఖేలా సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ అనుభవ్ భరద్వాజ్ మాట్లాడుతూ.. వీలైనంత త్వరగా ఈ కేసును పూర్తి స్థాయిలో దర్యాప్తు పూర్తి చేస్తామని తెలిపారు. ఇక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలు గురువారం రాత్రి పోలీస్ స్టేషన్ కు వచ్చింది. తన భర్తపై ఫిర్యాదు చేసేందుకు ఆమె స్టేషన్ కు రాగా అప్పటికే రాత్రి కావడంతో అక్కడి అధికారి ఆమెకు స్టేషన్ లోనే నిద్ర పోయేందుకు రూమ్ ఏర్పాటు చేశాడు.

Jharkhand Shocking incident latest news Woman raped inside a police station police officer arrested

కొద్దిసేపటి తర్వాత రాత్రి డ్యూటీలో ఉన్న ఓ అధికారి ఆమెకు వచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె సాయం కోసం ఆర్తనాదాలు పెట్టినా స్టేషన్ లో ఎవరూ పట్టించుకోలేదు. దాంతో పక్కనే ఉన్న కత్తితో పోలీస్ ఆఫీసర్ పై దాడికి పాల్పడింది. ఈ క్రమంలో అతడు ఘటనాస్థలి నుంచి పారిపోయాడు. తెళ్లారి ఈ ఘటనపై మరో పోలీస్ అధికారికి చెప్పగా కొంత డబ్బు తీసుకుని స్టేషన్ నుంచి వెళ్లిపోవాల్సిందిగా బెదిరించినట్లు బాధితురాలు స్పష్టం చేసింది. ఇక ఈ ఘటన గుర్తించి తెలుసుకున్న ఎస్డీపీఓ భరద్వాజ్ తన టీమ్ తో శుక్రవారం రాత్రి పోలీస్ స్టేషన్ కు వచ్చి ఘటన జరిగిన రూమ్ ను పరిశీలించారు. ఆధారాల కోసం రూమ్ లోకి ఎవరూ వెళ్లకుండా లాక్ వేశారు. ఇక నిందితుడ్ని వెంటనే అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రస్తుతం విచారణ చేపట్టారు. నిందితుడిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని ఎస్డీపీఓ భరద్వాజ్ పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+