ముగ్గురు బాలికలు.. నలుగురు యువకులు.. వెలుగులోకి ఘోరం!

ఝార్ఖండ్‌లోని ఖుంటీ జిల్లాలో అత్యంత దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. బైక్ ట్రిప్ అని నమ్మించి ముగ్గురు మైనర్ బాలికలను తీసుకెళ్లిన నలుగురు యువకులు, అందులోని ఇద్దరు బాలికలపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు త్వరతగతిన చర్యలు చేపట్టి నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.

మొదటి భర్తను వదిలేసింది.. రెండో మొగుడిని చంపేసింది.. చివరకు!
మొదటి భర్తను వదిలేసింది.. రెండో మొగుడిని చంపేసింది.. చివరకు!

స్కూటీ, బైక్‌పై తీసుకెళ్లి అఘాయిత్యం
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి నలుగురు యువకులు ముగ్గురు మైనర్ బాలికలను స్కూటీ, బైకులపై ఎక్కించుకుని మారాంగ్‌హాదా పోలీస్ స్టేషన్ పరిధిలోని నిర్జన ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ ఇద్దరు బాలికలపై వరుసగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితుల్లో ఇద్దరు ముర్హు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒకే కుటుంబానికి చెందిన అక్కాచెల్లెళ్లు కాగా.. మూడో బాలిక సోయ్‌కో ప్రాంతానికి చెందినదిగా గుర్తించారు.

Jharkhand Shocking News 2 Minors Gang-Raped on Bike Trip in Khunti 4 Arrested Registered POCSO Case

పోక్సో కేసు నమోదు.. నిందితుల అరెస్ట్
ఘటన అనంతరం మంగళవారం బాధితులు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఖుంటీ మహిళా పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు వెంటనే స్పందించి పోక్సో కేసు నమోదు చేశారు. ఖుంటీ ఎస్పీ రిషబ్ గర్గ్ ఘటన గురించి మాట్లాడుతూ.. మంగళవారం రాత్రి కేసు నమోదు చేసిన వెంటనే ప్రత్యేక బృందాలతో దాడి చేసి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని, బాధితులకు వైద్య పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించారు. అరెస్ట్ చేసిన నిందితులను రిమాండ్‌కు తరలించనున్నట్లు ఎస్పీ తెలిపారు.

దారుణం.. కోడలి తలనరికి హతమార్చిన అత్తమామలు, బావమరుదులు!
దారుణం.. కోడలి తలనరికి హతమార్చిన అత్తమామలు, బావమరుదులు!

లా అండ్ ఆర్డర్‌పై ప్రతిపక్షాల ఆగ్రహం
ఈ దారుణ ఘటనపై బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సందీప్ వర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖుంటీలో జరిగిన సామూహిక అత్యాచారం రాష్ట్రంలో క్షీణిస్తున్న శాంతిభద్రతలకు, పోలీస్ వ్యవస్థ వైఫల్యానికి అద్ధం పడుతోందని విమర్శించారు. ప్రభుత్వం తక్షణమే ఈ ఘటనకు బాధ్యత వహించి కఠిన చర్యలు తీసుకోవాలని, రాష్ట్రంలో శాశ్వత డీజీపీని నియమించాలని డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+