సునీత రాకతో గుజరాత్ పల్లెటూరిలో సందడే సందడి
Sunita Williams: భూమికి సుదూరంగా ఎక్కడో అంతరిక్ష కేంద్రంలో 286 రోజుల పాటు గడిపిన భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్.. క్షేమంగా తిరిగివచ్చారు. తోటి వ్యోమగామి బ్యారీ బుచ్ విల్మోర్‌తో కలిసి భూమండలానికి చేరుకున్నారు. అమెరికాలోని ఫ్లోరిడాలో ల్యాండ్ అయ్యారు.
భారత కాలమానం ప్రకారం ఈ తెల్లవారు జామున సరిగ్గా 3:27 నిమిషాలకు స్పేస్ ఎక్స్‌కు చెందిన డ్రాగన్ క్యాప్సుల్ క్రూ- 9.. ఫ్లోరిడాలో గల నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్‌కు చేరుకుంది. అక్కడి నుంచి వారిద్దరినీ టెక్సాస్‌లోని హ్యూస్టన్‌లో నాసాకు చెందిన జాన్సన్ స్పేస్ సెంటర్‌కు తీసుకెళ్లారు. 45 రోజుల పాటు అక్కడే రిహాబిలిటేషన్‌లో గడపనున్నారు.

ఫ్లోరిడా తీరంలో స్పేస్‌ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్ నేరుగా సముద్రంలో దిగింది. లక్షలాది మంది నాసా యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా దీన్ని వీక్షించారు. భూ వాతావరణంలోకి తిరిగి ప్రవేశించిన కొద్ది నిమిషాలకే ఈస్టర్న టైమ్ జోన్ ప్రకారం..సాయంత్రం 5:57 నిమిషాలకు క్యాప్సూల్ సురక్షితంగా నీటిలో దిగింది. ఆ వెంటనే నాసా కంట్రోల్ రూమ్‌లో హర్షాతిరేకాలు వెల్లువెత్తాయి.
అమెరికన్ వ్యోమగామి సునీత విలియమ్స్, బ్యారి విల్మోర్‌తో పాటు నిక్ హేగ్, రష్యన్ వ్యోమగామి అలెగ్జాండర్ గోర్బునోవ్ ఈ క్యాప్సూల్‌లో ఉన్నారు. ఈ క్యాప్సుల్ భూ కక్ష్యలోకి ప్రవేశించే సమయంలో కొద్దిసేపు కమ్యూనికేషన్ బ్లాక్ అవుట్ ఏర్పడింది. నాసా దాన్ని క్షణాల్లోనే పునరుద్ధరించగలిగింది.
తొలుత నిగ్ హేగ్ నాసాను ఉద్దేశించి మాట్లాడారు. ఇదొక అద్భుత ప్రయాణంగా అభివర్ణించారు. దాదాపుగా 2,000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో ఈ డ్రాగన్ క్యాప్పుల్ భూ కక్ష్యలోకి ప్రవేశించింది. సముద్ర జలాల్లోకి క్యాప్సుల్ దిగిన వెంటనే నాసాకు చెందిన రికవరీ టీమ్ అలర్ట్ అయింది. వారిని అందులో నుంచి సురక్షితంగా బయటికి తీసుకొచ్చింది.
సునీత విలియమ్స్ భూమ్మీదికి చేరుకున్న సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకుంది.. గుజరాత్‌లోని ఓ చిన్న గ్రామం. దాని పేరు ఝులాసన్. రాజధాని గాంధీనగర్‌కు 27 కిలోమీటర్ల దూరంలో.. మెహసానా జిల్లాలో ఉంటుందీ విలేజ్. ఇక్కడ సంబరాలు మిన్నంటాయి. పండగ వాతావరణం నెలకొంది.
సునీత విలియమ్స్ సురక్షితంగా భూమికి చేరుకోవాలంటూ ఇక్కడ పూజలు, హోమాలు, యజ్ఞయాగాదులను సైతం నిర్వహించారు స్థానికులు. రాత్రంతా జాగారణ చేశారు. స్పేస్ ఎక్స్ క్యాప్సుల్ భూమ్మీదికి చేరుకునే గడువు సమీపిస్తోన్న కొద్దీ ఉత్కంఠభరితంగా గడిపారు. టీవీలకు అతుక్కుపోయారు.ఆ గ్రామంలో ఉన్న అయిదారు ఆలయాల్లో స్థానికులు పూజలు చేస్తూ గడిపారు.
VIDEO | People at NASA astronaut Sunita Williams's ancestral village, Jhulasan, celebrate her return to Earth after nine months.
— Press Trust of India (@PTI_News) March 19, 2025
Sunita Williams along with fellow astronaut Butch Wilmore departed for an eight-day mission to the International Space Station which turned out to… pic.twitter.com/sJSJmuun8b
ఝులాసన్.. సునీత విలియమ్స్ పూర్వీకుల గ్రామం. ఆమె తండ్రి దీపక్ భాయ్ పాండ్యాది ఈ ఊరే. 1953లో గుజరాత్ విశ్వవిద్యాలయంలో ఇంటర్మీడియట్ సైన్స్ పూర్తి చేశారు. 1957లో ఎండీ పట్టా పొందారు. అనంతరం అమెరికా వెళ్లిపోయారు. ఒహియోలోని క్లీవ్‌ల్యాండ్‌లో మెడిసిన్‌లో ఇంటర్న్‌షిప్ పూర్తి చేశారు.
1964లో వెస్ట్రన్ రిజర్వ్ యూనివర్శిటీలో అనాటమీ విభాగంలో పోస్ట్‌డాక్టోరల్ ఫెలోగా చేరారు. అమెరికాలోని వివిధ ఆసుపత్రులు, రీసెర్చ్ సంస్థల్లో పనిచేశారు. స్లోవేనియన్-అమెరికన్ ఉర్సులిన్ బోనీ జలోకర్‌తో ఆయనకు పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. అదే ఏడాది ఆమెను వివాహం చేసుకున్నారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications