ప్రియా ప్రకాశ్ వారియర్‌పై జగ్నేష్ మేవాని ఆసక్తికర వ్యాఖ్య

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఒక్క కన్ను గీటుతో ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారిన ప్రియా ప్రకాశ్ వారియర్‌పై దళిత నేత, శాసనసభ్యుడు జిగ్నేష్ మేవాని అసక్తికరమైన వ్యాఖ్య చేశారు. ఆమె వీడియోపై ఆయన ట్విట్టర్ ద్వారా స్పందించారు.

ప్రేమికుల రోజు నిరసనలు వ్యక్తం చేసే ఆర్ఎస్ఎస్‌కు అదో సమాధానమని ఆయన అన్నారు. ఒక్క రోజులోనే ప్రియా ప్రకాశ్ వారియర్ ఇంటర్నెట్‌ను ముంచెత్తిన విషయం తెలిసిందే.

మాణిక్య మలరయ పవీ వైరల్ హిట్ కావడం వాలెంటైన్ డేను నిరసించే ఆర్ఎస్ఎస్‌కు ఒక సమాధానమని జిగ్నేష్ మేవాని అన్నారు. ఒకరిని ద్వేషించడం కన్నా ప్రేమించడాన్ని అధికంగా ఇష్టపడుతామని భారతీయులు మరోసారి రుజువు చేశారని ఆయన అన్నారు.

హిందూత్వ అతివాద సంస్థలు మొదటి నుంచి కూడ ప్రేమికుల రోజును వ్యతిరేకిస్తూ వస్తున్నాయి. హిందూ మహాసభ, శ్రీరామసేన, భరతసేన భజరంగ్ దళ్ తదితర సంస్థలు ప్రేమికుల రోజును వ్యతిరేకిస్తూ వస్తున్నాయి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Dalith leader and MLA Jignesh Mevani made interesting comments on Priya Prakash varriers video.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి