జియో అదిరిపోయే ఆఫర్
రిలయన్స్ జియో (Reliance Jio) 'రిపబ్లిక్ డే ఆఫర్ (Republic Day Offer)' ప్రకటించింది. రూ.2,999 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌పై 'హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ 2024' పేరుతో అదనపు వ్యాలిడిటీని తెచ్చింది. కాలపరిమితి ఏడాది. తాజాగా అదే ప్లాన్‌పై కొన్ని కూపన్లను అందజేస్తోంది. ఈ ఆఫర్ జనవరి 15 నుంచి జనవరి 31 వరకు అందుబాటులో ఉంటుంది. లాంగ్ టర్మ్ ప్లాన్ కోసం ఎదురుచూసేవారికి ఇది బాగుంటుంది.
రూ.2,999తో రీఛార్జి చేసుకునేవారికి 365 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు, 2.5 జీబీ డేటా చొప్పున 912.5 జీబీ వస్తుంది. జియో క్లౌడ్, జియో టీవీ, జియో సినిమా ఏడాది పాటు ఉచితం. 'రిపబ్లిక్ డే' ఆఫర్ కింద రీఛార్జ్ చేసుకునేవారికి అదనంగా నెట్‌మెడ్స్, అజియో, ఇక్సిగో, తిరా, స్విగ్గీ కూపన్లను అందిస్తున్నారు.

అజియోలో రూ.2,499 పైగా షాపింగ్ చేస్తే రూ.500 రాయితీ వస్తుంది. ఆన్‌లైన్ బ్యూటీ ప్రొడక్ట్ ప్లాట్‌ఫామ్ తిరాలో రూ.వెయ్యి, అంత కంటే ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేస్తే 30 శాతం రాయితీ ఉంటుంది. ఇక్సిగోలో విమాన టికెట్ల బుకింగ్‌పై రూ.1,500 తగ్గింపు, స్విగ్గీ ద్వారా చేసే కొనుగోళ్లపై రూ.125 విలువైన రెండు రాయితీ కూపన్లు వస్తాయి. రిలయన్స్ డిజిటల్‌లో రూ.5వేల కొనుగోలుపై 10శాతం డిస్కౌంట్ రాయితీ ఇస్తున్నారు. మై జియో యాప్/ వెబ్‌సైట్ నుంచి ఈ ప్లాన్ ను పొందొచ్చు.
రిలయన్స్ జియో 2015 డిసెంబరు 27న ప్రారంభమైంది. దేశంలో అతి పెద్ద మొబైల్ నెట్ వర్క్ ఆపరేటర్ గా, ప్రపంచంలో మూడో అతి పెద్ద మొబైల్ నెట్ వర్క్ ఆపరేటర్ గా ఉంది. 42.62 కోట్ల వినియోగదారులు సంస్థకు ఉన్నారు. నవీ ముంబయిలో దీని ప్రధాన కార్యాలయం ఉంది. 4జీతోపాటు 5జీ సేవలను కూడా అనేక నగరాల్లో జియో అందిస్తోంది.












Click it and Unblock the Notifications