చిన్నా చితక పార్టీలు, స్వతంత్రులదే రాజ్యం

Jammu Kashmir assembly Election 2024 exit polls: కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్, హర్యానాల్లో ముగిసిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడుతున్నాయి. 90 సీట్లు ఉన్న జమ్మూ కాశ్మీర్‌లో మూడు దశల్లో పోలింగ్ ముగిసింది. కిందటి నెల 18, 25, ఈ నెల 1న తమ ఓటు హక్కును వినియోగించుకున్నారక్కడి ఓటర్లు.

హర్యానాలో కూడా 90 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ సాయంత్రం 6 గంటలకు ఒకే విడతలో పోలింగ్ ముగిసింది. 6:30 గంటల నుంచి ఎగ్జిట్ పోల్స్ అంచనా పోటెత్తుతున్నాయి. ఆర్టికల్ 370 రద్దు, దశాబ్దకాలం తరువాత అసెంబ్లీ ఎన్నికలు జరగడం వల్ల అందరి దృష్టి కూడా జమ్మూ కాశ్మీర్ మీదే నిలిచింది.

JK assembly Election 2024 exit polls Will Independents and smaller parties play kingmaker

ఇక్కడ హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ సంస్థలు అంచనా వేశాయి. దైనిక్ భాస్కర్, రిపబ్లిక్- గులిస్తాన్ వంటి ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి. సంస్థ అంచనా వేసింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్ 46. ఈ సంఖ్య ఏ పార్టీకి కూడా అందబోదని అభిప్రాయపడింది.

తాజాగా యాక్సిస్ మై ఇండియా కూడా ఇదే బాట పట్టింది. జమ్మూ కాశ్మీర్‌లో హంగ్ అసెంబ్లీ తప్పదని అంచనా వేసింది. దాదాపుగా ఏ పార్టీకి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్యా బలం దక్కకపోవచ్చని తెలిపింది. నేషనల్ కాన్ఫరెన్స్- కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద కూటమిగా ఆవిర్భవిస్తాయని పేర్కొంది. ఈ కూటమికి 35 నుంచి 45 సీట్లు దక్కవచ్చు.

యాక్సిస్ మై ఇండియా కూడా ఇలాంటి అంచనాలనే వెలువడించింది. ఈ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం చూస్తే బీజేపీ 24 నుంచి 34 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. మెహబూబా ముఫ్తికి చెందిన పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీకి ఏడు సీట్లు మాత్రమే లభిస్తాయి. ఇతరులు 15 స్థానాలను గెలుచుకుంటారు.

జమ్మూ కాశ్మీర్‌లో ఇతరులు అధిక స్థానాల్లో విజయం సాధిస్తారంటూ దాదాపుగా మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా అంచనా వేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇందులో- బారాముల్లా లోక్‌సభ సభ్యుడు ఇంజినీర్ రషీద్‌కు చెందిన ఆవామీ ఇత్తెహాద్, ఇతర చిన్న పార్టీలు, స్వతంత్రులు ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించే అవకాశం ఉంది.

ఏ మాత్రం హంగ్ అసెంబ్లీ ఏర్పడినా చిన్న పార్టీలు, స్వతంత్రులకు డిమాండ్ ఏర్పడవచ్చు. ఇది కాస్తా- రిసార్ట్స్, క్యాంప్ పాలిటిక్స్‌కు తెర తీసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. స్వతంత్రులకు ప్రభుత్వంలో కల్పించడం, మంత్రివర్గంలో వారికి కీలక పోర్ట్ ఫోలియోలు దక్కొచ్చనే అంచనాలు ఉన్నాయి.

మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తికి చెందిన పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ ఈ ఎన్నికల్లో నిరాశపరుస్తుందంటూ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. హంగ్ అసెంబ్లీ ఏర్పడితే పీడీపీకి చెందిన ఎమ్మెల్యేలకూ డిమాండ్ పెరుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+