ఉన్నత స్థాయి ఉద్యోగాలకు చెక్... వేతనాల్లో భారీ మార్పులకు కంపెనీలు సిద్ధం
ముంబై: ఆర్థిక వ్యవస్థ తగ్గుముఖం పడుతుండటంతో పై స్థాయి లేదా ఉన్నత ఉద్యోగాలు క్రమంగా తగ్గిపోతున్నాయి. ఆర్థిక వ్యవస్థ మందగిస్తుండటంతో దానికి అనుగుణంగానే నియామకాలు ఆయా సంస్థలు చేపడుతున్నాయి. సీ క్లాస్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నాయి. అయితే తక్కువ వేతనంతో ఎక్కువ పనిచేసే వారికోసం సంస్థలు వేటాడుతున్నాయని హెడ్‌హంటర్స్ అనే సంస్థ వెల్లడించింది.
చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్లు, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ల నియామకాలు దాదాపు 10శాతం తగ్గిపోయాయని, వారి జీతభత్యాల్లో కూడా మార్పులు జరిగే అవకాశాలున్నాయని హెడ్ హంటర్స్ సంస్థ పేర్కొంది.సీఈఓలను కూడా సంస్థలు తాము అనుకున్న వేతనాల పరిధిలో ఉంటేనే వ్యక్తులను నియమించుకుంటున్నట్లు కొందరు నిపుణులు చెబుతున్నారు. ఒక వేళ సంస్థలో మేనేజర్ కింద డిప్యూటీలు ఉంటే ఒకే పనికి అంతమంది ఉద్యోగస్తులు అవసరంలేదనే అభిప్రాయానికి కంపెనీ యాజమాన్యాలు వచ్చాయని, ఆ డ్యూటీలన్నీ ఒకే వ్యక్తితో చేయించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు నిపుణులు చెబుతున్నారు.

సెప్టెంబర్ 11న విడుదలైన నౌకరీ డాట్ కామ్ ప్రకారం నాయకత్వ పాత్రను పోషించే ఉద్యోగుల అంటే లీడర్‌షిప్ రోల్స్ టేకప్ చేసేవారికి 16 ఏళ్ల అనుభవంను ఇప్పటి వరకు సంస్థలు చూసేవని ఇప్పుడు అది 8శాతానికి పడిపోయినట్లు తెలుస్తోంది. ఇక జీతం కాకుండా ఇతర ఇన్సెన్‌టివ్స్ కూడా తగ్గించే పనిలో కంపెనీలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. వారి పనితనం ఆధారంగా అంటే పెర్‌ఫార్మెన్స్ ఆధారంగా వారి జీతాల్లో పెంపును ఇవ్వాలని కంపెనీలు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.ఇలా చేయడం వల్ల సంస్థకు ఎంతో ఆదా అవుతుందనే ఒపీనియన్‌లో యాజమాన్యాలు ఉన్నట్లు సమచారం.
ఇప్పటికే ఉత్పత్తి, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఫైనాన్షియల్ సేవా రంగాలు భారీగా దెబ్బతిన్నాయి. సీఎఫ్‌ఓ అవసరమా అనే స్థాయికి కంపెనీ యాజమాన్యాలు వచ్చేశాయని నిపుణులు చెబుతున్నారు. అదే పనిని ప్రస్తుతం ఉన్న ఫైనాన్షియల్ కంట్రోలర్‌కు అప్పగించే పనిలో ఉన్నట్లు నిపుణులు వెల్లడిస్తున్నారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications