మరికొన్ని గంటల్లో అక్కాచెల్లెళ్ల పెళ్లి.. విగత జీవులుగా.. ఏం జరిగింది..?

ఇళ్లంతా చుట్టాలతో నిండిపోయింది.. మరికొన్ని గంటల్లో ఆ ఇంట్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి.. ఒకటి కాదు రెండు పెళ్లిళ్లు ఒకేసారి జరుగుతున్న తరుణంలో అందరూ పట్టరాని సంతోషంతో ఉన్నారు. అయితే ఇంతలో ఆ ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. మరికొన్ని గంటల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఆ అక్కాచెల్లెళ్లు విగతజీవులుగా పడి ఉండటం చూసి ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. మృతదేహాల వద్ద ఎలాంటి సూసైడ్ నోట్ కనిపించలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

రాజస్థాన్ జోధ్ పుర్ లోని మనాయ్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మరికొన్ని గంటల్లో పెళ్లి చేసుకోబోతున్న అక్కాచెల్లెళ్లు విగతజీవులుగా మారారు. ఏమైందో ఏమోగానీ పెళ్లి కుమార్తెలిద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. దాంతో ఆ తల్లిదండ్రుల రోదనలు ఆకాశాన్ని తాకాయి. పెళ్లి కుమార్తెలు శోభ (25), విమల (23) ఇద్దరూ ప్రైవేట్ స్కూల్‌ లో టీచర్లుగా పనిచేస్తున్నారు. అయితే వీరిద్దరికీ ఒకేరోజు వివాహం చేయాలని తల్లిదండ్రులు నిర్ణయించారు. ఈమేరకు ఫిబ్రవరి 21 శనివారం పెళ్లి జరగాల్సి ఉండగా.. శుక్రవారం అర్ధరాత్రి వరకూ ఇంట్లో సంబరాలు, వేడుకలు జరిగాయి. ఇక మరికొద్ది గంటల్లో పెళ్లి అనగా అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య చేసుకున్నారు.

అక్కాచెల్లెళ్లు ఇద్దరూ విగత జీవులుగా పడి ఉండటాన్ని గమనించిన తల్లిదండ్రులు హుటాహుటిన వారిని సమీప ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దాంతో ఆ తల్లిదండ్రులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. అయితే అక్కాచెల్లెళ్ల శరీరం నీలిరంగులోకి మారడాన్ని గమనించిన వారి మేనమామ జస్వంత్ సింగ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. మృతదేహాలకు అంత్యక్రియలు నిలిపివేసి పోస్టుమార్టంకు తరలించారు.

Jodhpur two sisters suicide Sadness Two Sisters Commit Suicide Hours Before Same-Day Wedding

పోస్టుమార్టం రిపోర్టు ప్రకారం..అక్కాచెల్లెళ్లు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడినట్లు తేలిందని పోలీసులు తెలిపారు. అయితే వారి వద్ద ఎలాంటి సూసైడ్ లేఖ లభించలేదని తేల్చారు. మరోవైపు ఇదే ఘటనపై కుటుంబ సభ్యులందరినీ విచారిస్తున్నామని ఏడీసీపీ రోషన్ మీనా తెలిపారు. అయితే తమకు ఇష్టం లేని పెళ్లిళ్లు చేస్తున్నారన్న కారణంతోనే వారు సూసైడ్ కు పాల్పడినట్లు మేనమామ జస్వంత్ సింగ్ ఆరోపిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+