షాక్: ఢిల్లీ మెట్రో స్టేషన్లో మహిళా జర్నలిస్టుకు లైంగిక వేధింపులు(వీడియో)
దేశ రాజధాని నగరంలో వరుసగా జరుగుతున్న ఘటనలు మహిళల భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి.
Recommended Video

న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరంలో వరుసగా జరుగుతున్న ఘటనలు మహిళల భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. తాజాగా, అత్యంత రద్దీగా ఉంటే ఐటీఓ మెట్రో స్టేషన్‌లో ఓ మహిళా జర‍్నలిస్టును వేధింపులకు గురిచేసిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
నవంబర్ 13న ఢిల్లీలో మెట్రో స్టేషన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఢిల్లీ ఐటీవో మెట్రో స్టేషన్లో జర్నలిస్టు(25) ను ఓ దుండుగుడు వేధింపులకు గురిచేశాడు. కావాలని ఆమెను తాకి వేధించాడు. అయితే క్షణాల్లో అతగాడినుంచి తప్పించుకున్న ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడుని అరెస్ట్ చేశారు పోలీసులు.
#WATCH: 25-year-old journalist molested at ITO Metro station in #Delhi on 13 November; accused arrested.(Source: CCTV) pic.twitter.com/xbkDVKBu0K
— ANI (@ANI) November 17, 2017
బాధితురాలి ఫిర్యాదుమేరకు మెట్రోస్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఉద్దేశపూర్వంగా అనుచితంగా తాకడం.. బాధితురాలు ప్రతిఘటించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. దీని ఆధారంగా నిందితుడిని గుర్తించిన పోలీసులు అతగాడిని అదుపులోకి తీసుకున్నారు.
ముందు పొరపాటున తాకినట్టుగా తాను భావించాననీ, కానీ మళ్లీ అదేపనిచేయడంతో షాకయ్యానని జర్నలిస్టు చెప్పారు. కొన్నిసెకన్లలలో వెంటనే తేరుకున్నట్టు చెప్పారు. అయితే, అక్కడ సెక్యూరిటీ ఎవరూ లేరు. లేదంటే స్పాట్‌లోనే ఆ దుర్మార్గుడిని పోలీసులుకు అప్పగించేదాన్నని చెప్పారు. మహిళల రక్షణ కోసం మెరుగైన చర్యలు తీసుకోవాలని అన్నారు.
-
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ సిలిండర్ బుకింగ్ సాధ్యం కాదు- కేంద్రం క్లారిటీ.. !!












Click it and Unblock the Notifications