నిర్భయ నిందితుల కేసు: సుప్రీంకోర్టులో పవన్‌కు షాక్... క్యూరేటివ్ పిటిషన్ కొట్టేసిన ధర్మాసనం
న్యూఢిల్లీ: నిర్భయ కేసు నిందితుడు పవన్ గుప్తాకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. తాను దాఖలు చేసిన క్యూరేటివ్ పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. తనకు విధించిన ఉరిశిక్షను జీవితఖైదుగా మార్చాలంటూ క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేశాడు పవన్ గుప్తా. నిర్భయ ఘటన జరిగిన సమయంలో తాను మైనర్‌ను అంటూ పిటిషన్‌లో పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే పవన్ తరపున లాయర్ ఏపీ సింగ్ ఆదివారం రోజున సుప్రీంకోర్టు రిజిస్ట్రీ వద్ద పిటిషన్ దరఖాస్తు చేశారు.
ఇదిలా ఉంటే క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేసిన వారిలో పవన్ గుప్తా చివరివాడు. ఇక ఉన్న చివరి అస్త్రంను ప్రయోగించినప్పటికీ సుప్రీంకోర్టు తోసిపుచ్చడంతో ఇక మిగతా ముగ్గిరితో పాటు పవన్‌గుప్తాకు కూడా ఉరిశిక్ష అమలు కానుంది. నిర్భయ ఘటన జరిగిన రోజునాటికి తన వయస్సు 16 ఏళ్లు రెండు నెలలని అది తన స్కూలు రికార్డులను పరిశీలిస్తే తెలుస్తుందంటూ తన పిటిషన్‌లో పేర్కొన్నాడు.

అంతేకాదు జువైనల్ జస్టిస్ చట్టం ప్రకారం తన వయస్సును పరిగణలోకి తీసుకోలేదని వెల్లడించాడు. విచారణ సందర్భంగా ఈ అంశాన్ని విచారణాధికారులు పరిగణలోకి తీసుకోలేదని పవన్ పిటిషన్‌లో పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే తనకు అందుబాటులో ఉన్న లీగల్ పరమైన అవకాశాలను వినియోగించుకోవడంలో పవన్ చివరివాడు. అంతేకాదు రాష్ట్రపతి వద్ద క్షమాభిక్ష పిటిషన్ కూడా ఫైల్ చేయగా దాన్ని కూడా తిరస్కరించడం జరిగింది.
ఇదిలా ఉంటే తమకు విధించిన డెత్‌వారెంట్‌పై స్టే ఇవ్వాలని కోరుతూ పవన్ కుమార్ గుప్తాతో పాటు మరో నిందితుడు అక్షయ్ సింగ్‌లు ట్రయల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్రపతి వద్ద తాను క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేసినందున డెత్ వారెంట్‌పై స్టే ఇవ్వాలని అక్షయ్ సింగ్ కోరాడు. అదే సమయంలో తాను క్యూరేటివ్ పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలు చేసినందున తన డెత్ వారెంట్‌పై స్టే ఇవ్వాలని ట్రయల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు పవన్ కుమార్ గుప్తా.
ఇదిలా ఉంటే మార్చి3వ తేదీన నిర్భయ ఘటనలో నిందితులకు ఉరి శిక్ష విధించాలని ట్రయల్ కోర్టు ఫిబ్రవరి 17న తీర్పు వెల్లడించింది. ఇప్పటికే ముఖేష్, వినయ్, అక్షయ్ సింగ్‌లు రాష్ట్రపతి వద్ద క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేయగా రామ్‌నాథ్ కోవింద్ వాటిని తిరస్కరించారు. తాజాగా పవన్ కుమార్ గుప్తా వేసిన క్యూరేటివ్ పిటిషన్ కూడా తిరస్కరించడంతో ఇక నిర్భయ ఘటనలో నిందితులకు మార్చి 3వ తేదీన ఉరిశిక్ష అమలుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
-
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
చరిత్ర సృష్టించిన భారత ఆయిల్ ట్యాంకర్ 'జగ్ విక్రమ్'.. 20 వేల టన్నుల LPGతో హార్మూజ్ ను దాటి..











Click it and Unblock the Notifications