మోడీ కారణజన్ముడా, ప్రముఖులకు ఓటమి తప్పదా?: జ్యోతిష్య పండితులు ఏం చెబుతున్నారంటే?
డా.యం.ఎన్.చార్య - ఫోన్: 9440611151
సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. మళ్లీ ఎన్డీయేనే అధికారంలోకి వస్తుందని, నరేంద్ర మోడీయే రెండోసారి ప్రధాని అవుతారని పలు ప్రీపోల్ సర్వేలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో జ్యోతిష్య పండితులు కూడా ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే అంచనా వేస్తున్నారు. ప్రత్యర్థులు గతంలో కంటే గట్టి పోటీ ఇచ్చినప్పటికీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేనే గెలిచి, మోడీయే ప్రధాని అవుతారని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

నరేంద్రమోడి జాతక విశ్లేషణ:-
నరేంద్ర మోడి గారి జన్మ వివరాల ప్రకారం వారు 17-09-1950, జన్మ సమయం 11:00 Am. జన్మస్థలం వాద్ నగర్, మేహసానా జిల్లా, గుజరాత్ రాష్ట్రంలో జన్మించారు. ఆనాటి పంచాంగ ప్రకారం శ్రీ వికృతి నామ సంవత్సరం, భాద్రపద మాసం. మోడీగారి జనన సమయానికి ఆ రోజు ఆదివారం, కృష్ణ పక్ష షష్టి తిధి, అనురాధ నక్షత్రం 2 వ పాదం. వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నంలో జన్మించారు. జన్మకాల ప్రారంభదశ శని మహర్దశలో శుక్రుని అంతర్ధశతో ప్రారంభం అయ్యింది. ప్రస్తుత దశ చంద్ర మహార్ధశలో కేతు అంతర్ధశ నడుస్తుంది.
గోచారరిత్య ఏలినాటి శని మూడవ పర్యాయం నడుస్తుంది. మోడీ గారి జన్మ కుండలిలో ద్వాదశ భావాలలో గ్రహా స్థానాల ప్రకారంగా, గ్రహ దృష్టులు, షడ్భలాల ప్రకారం, దశమ భావం సింహ రాశి అయ్యింది. దశమాధిపతి లాభాస్థానం ఉండటం, దశమ భావంపై గురు గ్రహ శుభ దృష్టి ఉండటం వలన మోడీ గారు ఎట్టకేలకు విజయకేతనం ఎగరవేస్తారు.

కాంగ్రెస్ నుంచి మోడీకి గట్టి పోటీయే
నరేంద్ర మోడి గారి జాతకం, రాహుల్ గాంధీ గారి జాతక గోచార గ్రహ స్థితి ప్రకారం చూడగా మోడీ గారు మంచి గట్టి పోటీనే ఎదుర్కోవల్సి వస్తుంది. మొత్తానికి వీరిరువురి జాతకంలో ఉన్న గ్రహా భలా బలాల ప్రకారం నా అనుభం ఉన్న మేరకు నరేంద్ర మోడీ గారే తిరిగి ప్రధాన మంత్రి పదవిని కైవసం చేసుకుంటారు.

ప్రముఖులకు ఓటమి తప్పదు
మోడీ గారి జాతకరీత్య ఈ ఎన్నికల్లో బలీయంగా పోటీ నెదుర్కొని అధికారంలోకి వస్తారు. కొందరి ప్రముఖులకు ఓటమి తప్పదు. మోడీ గారికి 2020 జనవరి 24 తారీకు వరకు భద్రతాపరంగా, ఆరోగ్య పరంగా, ప్రయాణాల పరంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. శత్రు దృష్టి ఎక్కువైతుంది. వీరి తల్లి గారి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు సూచింపబడుతున్నాయి. ఇది గమనార్హం.

మోడీ కారణజన్ముడు
నరేంద్ర మోడి గారి జాతకం, జన్మ కుండలిలోని గ్రహాల స్థితి ప్రకారం చూడగా ఇతడొక కారణ జన్ముడు. మరో హనుమంతుని అంతటివాడు. క్రమ శిక్షణ, కార్యదక్షత అనేవి మెండుగా ఉంటాయి. భారత దేశానికి ఇలాంటి వ్యక్తీ ప్రధానిగా కావడం భారత ప్రజల అదృష్టంగా భావించవచ్చు. అమోఘమైన అంతు పట్టని ఆలోచనశక్తి , ఆలోచనకు తగ్గట్టుగా వ్యవహరించడం లగ్నం, రాశి ఒక్కటి కావడం. జీవితంలో ఎన్నో ఆటుపోట్లను తట్టుకుని అంచలంచలుగా ఎదిగే జాతకం వీరిది. శ్రీ వికారి నామ సంవత్సరం వీరిని ఆశీర్వదిస్తుంది. నరేంద్ర మోడీ జయిభవ దిగ్విజయిభవ.
గమనిక:- ఎలక్షన్లలో పోటీ చేసే వ్యక్తి యొక్క పుట్టిన తేదీ ఆధారంగా జాతక చక్రం వేసి, నక్షత్రం, రాశి, లగ్నం ద్వాదశ భావాలలో గ్రహస్థితి గతులు, షట్భలాలు, దృష్టులు, యోగాలు, గోచార గ్రహస్థితి మొదలగునవి ఎన్నో పరిశీలిస్తే కాని ఫలితాలు చెప్పలేము. మా గురువుల శుభాశీస్సుల వలన మరియు, ఉపాసన బలం, శాస్త్రంపై పఠీష్టమైన కృషి వలన నాకున్న పరిజ్ఞానంతో ఈ ఫలితాలు చెప్పడం జరుగుతుంది.
ఇంకో విషయం ఒక ముఖ్య నాయకుడు అధికార పదవి చేపట్టాలి అంటే అతని జాతకం బాగుంటే సరిపోదు. అతనితో పాటు పార్టీలో ఉన్న ఇతర నాయకుల గ్రహ బలం మంచి, చెడు ఫలితాలు ప్రధాన వ్యక్తిపై ప్రభావం తప్పక చూపుతాయి. అలాగే పోటీలో నిలబడుతున్న ప్రతి పక్ష నాయకులందరి వివరాలు తెలియాలి. అన్ని వివరాలు సరిగ్గా ఉంటే సంపూర్ణ విశ్లేషణ చేయడం జరుగుతుంది. గతంలో తెలంగాణలో కెసిఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి అవుతారు ఆ ఆధారంగానే చెప్పడం జరిగింది.
ఇది దేశ రాజకీయలకే కాదు వ్యక్తీ గత కుటుంబ సభ్యుల యొక్క జాతక మంచి, చెడు ఫలితాలు తప్పక చూపిస్తాయి. ముఖ్యంగా దేశ నాయకులవి, ఇతర ప్రముఖ రంగాల వారివి, సినిమా రంగం వారివి ఎక్కువ శాతం పుట్టిన వివరాలు సరైనవి బహిర్గతం చేయరు.పేరుతో జాతక ఫలితాలు చూసుకోవడం సరైన పద్దతి కాదు. మేము ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వారం కాదు. శాస్త్రంలో ఏమి ఉందో అదే తెలియ జేయడం జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ.












Click it and Unblock the Notifications