యడియూరప్పకు షాక్, ఆ పార్టీలో చేరిన బెంగళూరు సిటీ మాజీ పోలీసు కమీషనర్ !
కర్ణాటకలో లోక్‌సభ ఎన్నికల వేడి రాజుకుంది. వివిధ పార్టీల్లో చేరే నేతల సంఖ్య కూడా పెరుగుతోంది. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఒకరు జేడీఎస్ పార్టీలో చేరారు. సోమవారం రిటైర్డ్ ఐపీఎస్ అధికారి బి. జి. జ్యోతి ప్రకాష్ మిర్జీ కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్ డీ. కుమారస్వామి సమక్షంలో జేడీఎస్ పార్టీలో చేరారు. అయితే జ్యోతి ప్రకాష్ మిర్జీ మాజీ సీఎం బీఎస్ యడియూరప్పకు చాలా సన్నిహితుడు కావడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.
మాజీ ఐపీఎస్ అధికారి జ్యోతి ప్రకాష్ మిర్జీ బెంగుళూరు సిటీ పోలీస్ కమీషనర్ గా పని చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. బెంగళూరు నగర పోలీసు కమీషనర్ తో పాటు వివిధ పదవులను నిర్వహించిన జ్యోతి ప్రకాష్ మిర్జీ మంచి పేరు తెచ్చుకున్నారు. యువజనతాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు నిఖిల్ కుమారస్వామి, పార్టీ మాజీ అధ్యక్షుడు హెచ్. కే. కుమారస్వామి, ఎమ్మెల్యే నేమిరాజ్ నాయక్, మాజీ మంత్రి అనిల్ లాడ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

కర్ణాటక మాజీ బీఎస్ యడ్యూరప్పకు రిటైడ్ ఐపీఎస్ అధికారి జ్యోతి ప్రకాష్ మిర్జీ చాలా సన్నిహితంగా ఉన్నారు. లింగాయత్ వర్గానికి చెందిన మిర్జీ విశ్వ వీరశైవ లింగాయత్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కూడా. బీ ఎస్ యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జ్యోతి ప్రకాష్ మిర్జీ బెంగళూరు సిటీ పోలీస్ కమిషనర్‌గా నియమితులయ్యారు. 2019లో యడ్యూరప్ప మళ్లీ సీఎం కాగానే మిర్జీ సలహాదారుగా జ్యోతి ప్రకాష్‌ని నియమిస్తారని వార్తలు వచ్చాయి.
2018 అసెంబ్లీ ఎన్నికలలోగా లింగాయత్ సామాజికవర్గ నేతలకు టిక్కెట్లు ఇవ్వాలని జ్యోతి ప్రకాష్ మిర్జీ మూడు పార్టీల నేతలకు మనవి చేశారు
జేడీఎస్ లో చేరిన జ్యోతి ప్రకాష్ మిర్జీని మీరు లోక్ సభ ఎన్నికల్లో నిలబడతారా అని మీడియా ప్రశ్నించగా నాకు ఏ ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం లేదని అన్నారు. నేను అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకుని ఉంటే ఒక్క నియోజకవర్గానికే పరిమితమయ్యేవాడినని జ్యోతి ప్రకాష్ మిర్జీ స్పష్టం చేశారు.
నేను పుట్టినప్పటి నుంచి పులినే, పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఉన్నప్పుడు కాల్పులు, లాఠీచార్జి చేశాను.. దుబాయ్‌లో దాక్కున్న దావూద్ ఇబ్రహీం సహచరుడిని పట్టుకుని తీసుకొచ్చాను.. డిపార్ట్‌మెంట్‌లో రిటైరయ్యాక కూడా నేను పులిలాగే ఉండిపోయాను అని మిర్జీ చెప్పారు. మాజీ సీఎం యడ్యూరప్పకు అత్యంత సన్నిహితుడు మిర్జీ జేడీఎస్‌లో చేరడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.












Click it and Unblock the Notifications