గ్యాస్ సిలిండర్‌ను ఢీకొన్న కాళింది ఎక్స్‌ప్రెస్...20 నిమిషాల పాటు ట్రైన్ నిలిపివేత..
కాళింది ఎక్స్‌ప్రెస్‌కు ప్రమాదం జరిగింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్‌లోని అన్వర్‌గంజ్-కాస్‌గంజ్ రైలు మార్గంలో పట్టాలపై ఉన్న గ్యాస్ సిలిండర్‌ను కాళింది ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టింది. దీంతో పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరీ పీల్చుకున్నారు. కాళింది ఎక్స్‌ప్రెస్ ప్రయాగ్‌రాజ్ నుంచి కాన్పూర్ సెంట్రల్ మీదుగా హర్యానాలోని భివానీకి ప్రయాణిస్తుండా ఈ ఘటన చోటుచేసుకుంది.
నిన్న (ఆదివారం) రాత్రి శివరాజ్‌పూర్ ప్రాంతంలో రైలు పట్టాలపై ఏదో వస్తువు ఉన్నట్లు గుర్తించిన లోకోపైలట్ వెంటనే అప్రమత్తమై ఎమర్జెన్సీ బ్రేకులు వేశాడు. అయినప్పటకీ ట్రైన్ సిలిండర్‌ను ఢీకొంది. సమాచారం తెలుసుకున్న కాన్పూర్ పోలీసులు, యాంటీ టెర్రరిజం స్క్వాడ్(ATS) ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు ప్రక్రియ వేగవంతం చేశారు. అక్కడి పట్టాలపై ఎల్ పీజీ సిలిండర్ తో పాటు పెట్రోల్ బాటిల్, పేలుడు పదార్థాలు, అగ్గిపెట్టెలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో ఆ స్థలంలో కాళింది ఎక్స్‌ప్రెస్‌ను సుమారు ఇరవై నిమిషాల పాటు నిలిపివేశారు. ఆ తర్వాత విచారణ నిమిత్తం మళ్లీ కాన్పూర్‌లోని బిల్హౌర్ స్టేషన్‌లో కొంతసేపు ట్రైన్‌ను నిలిపివేసినట్లు అధికారులు వివరించారు.

నిందితులకు కఠిన చర్యలు తప్పవు..
ఇక, ఈ సంఘటనపై కాన్పూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో భాగంగానే ఇద్దరు అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. కేసు దర్యాప్తు కోసం ఐదు పోలీసు బృందాలను కూడా ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ సంఘటనపై కాన్పూర్ అదనపు పోలీసు కమిషనర్ హరీష్ చందర్ మాట్లాడారు.. "ప్రయాగ్‌రాజ్ నుండి భివానీకి వెళ్తున్న కాళింది ఎక్స్‌ప్రెస్ గ్యాస్ సిలిండర్‌ను ఢీకొట్టిందని రైల్వే అధికారులు పోలీసులకు సమాచారం చేరవేశారు. దీంతో అప్రమత్తమైన అధికారులు ఘటన స్థలానికి చేరుకున్నారు. వెంటనే సీనియర్ అధికారులు, ఫోరెన్సిక్స్ బృందం సంఘటనా స్థలంలో ఆధారాలు సేకరించారు. ఘటనా స్థలంలో పోలీసులు, అధికారులు పాడైన సిలిండర్‌ను స్వాధీనం చేసుకునట్లు ఆయన తెలిపారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications