కమల్ హాసన్ పేరు చివర..!!

Kamal Hassan: తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకేకు చెందిన రాజ్యసభ అభ్యర్థులందరూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సల్మా, సీనియర్ అడ్వొకేట్ పీ విల్సన్, ఎస్ ఆర్ శివలింగం.. మక్కల్ నీథి మయ్యం (MNM) అధినేత, ప్రముఖ నటుడు కమల్ హాసన్ కూడా ఎటువంటి పోటీ లేకుండా రాజ్యసభకు ఎన్నికయ్యారు. పెద్దల సభలో అడుగు పెట్టనున్నారు.

తమిళనాడులో మొత్తం ఆరు రాజ్యసభ స్థానాలు ఖాళీ అయిన విషయం తెలిసిందే.. దీనితో పాటు అస్సాంలో ఖాళీగా ఉన్న రెండు స్థానాలకు ఎన్నికలను నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల కమిషన్ ఇదివరకే షెడ్యూల్ ను జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ రెండు రాష్ట్రాలకు చెందిన మొత్తం ఎనిమిది రాజ్యసభ సీట్ల కోసం జూన్ 19వ తేదీన పోలింగ్ ను నిర్వహించాల్సి ఉంది.

Kamal Haasan declared elected unopposed to the Rajya Sabha from Tamil Nadu

పీఎంకే- అన్బుమణి రామదాస్, ఏఐఏడీఎంకే- ఎన్ చంద్రశేఖరన్, డీఎంకే- ఎం షణ్ముగం, సీనియర్ అడ్వొకేట్ పీ విల్సన్, ఎంఎం అబ్దుల్లా, ఎండీఎంకే- వైగో సభ్యత్వ కాలం జులైలో ముగియబోతోంది. అస్సాంకు సంబంధించి.. భారతీయ జనతా పార్టీకి చెందిన ఇద్దరు సభ్యులు- బీరేంద్ర ప్రసాద్ భైష్య, మిషన్ రంజన్ దాస్ మాజీలు కానున్నారు.

ఈ నేపథ్యంలో ఆయా స్థానాలకు ఎన్నికలు అవసరం అయ్యాయి. ఈ ఎన్నిలకు సంబంధించిన నోటిఫికేషన్ జూన్ 2వ తేదీన విడుదల అవుతుంది. అదే నెల 9వ తేదీన నామినేషన్ పర్వం ఆరంభమౌతుంది. నామినేషన్లను దాఖలు చేయడానికి ఈసీ నిర్దేశించిన చివరి తేదీ.. 12. 19వ తేదీన పోలింగ్ ఉంటుంది.

నేడు నామినేషన్ చివరి రోజు. కమల్ హాసన్, సల్మా, సీనియర్ అడ్వొకేట్ పీ విల్సన్, ఎస్ ఆర్ శివలింగం మినహా మరెవరూ కూడా డీఎంకే నుంచి నామినేషన్ పత్రాలు దాఖలు చేయలేదు. దీనితో వారందరూ కూడా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారికంగా ప్రకటించింది.

తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకేకు మొత్తం నాలుగు స్థానాలు దక్కనున్నాయి. ఇందులో ముగ్గురు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది ఆ పార్టీ. ప్రముఖ రచయిత్రి, సామాజిక ఉద్యమకారిణి జఖియా అలియాస్ రాజాత్తి సహా మరో ఇద్దరిని ఎంపిక చేసింది డీఎంకే. సల్మా ఆమె పెన్ నేమ్.

ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు సీనియర్ అడ్వొకేట్ పీ విల్సన్ ను ఈ దఫా కూడా కొనసాగించింది. తాజాగా విడుదల చేసిన జాబితాలో ఆయన పేరును పొందుపరిచింది. సేలం జిల్లాకు చెందిన పార్టీ సీనియర్ నాయకుడు శివలింగం పేరును ఖరారు చేసింది డీఎంకే అగ్ర నాయకత్వం.

మరో సీటును మిత్ర పార్టీ మక్కల్ నీథి మయ్యంకు కేటాయించింది. దీనితో- ఆ పార్టీ అధినేత కమల్ హాసన్.. రాజ్యసభకు ఎన్నిక అయ్యారు. ఈ మేరకు ఇదివరకే ఈ రెండు పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది. లోక్ సభ ఎన్నికల్లో డీఎంకేకు మద్దతు ప్రకటించింది ఎంఎన్ఎం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+