తమిళనాట బిగ్ షాక్.. ఎన్నికల బరి నుంచి తప్పుకున్న స్టార్ హీరో.. ఆ పార్టీకి మద్దతు..
తమిళనాడులో ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు శర వేగంగా మారుతున్నాయి. ప్రస్తుతం అరవ రాజకీయం అంతా తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ చుట్టూనే తిరుగుతున్నట్లు కనిపిస్తోంది. తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ టీవీకే పార్టీ పెట్టిన సంగతి తెలిసిందే. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేస్తున్న ఆయనకు ఇప్పుడు రోజుకో చిక్కు వచ్చి పడుతోంది. కరూర్ తొక్కిసలాట ఘటన నుంచి మొదలు.. ఇటీవల తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ వ్యవహారం వరకూ అన్నీ ఆయన మెడకు చుట్టుకుంటున్నాయి.
అయితే తమిళ స్టార్ హీరో విజయ్ మాత్రం తమ పార్టీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోదని.. ఒంటరిగానే బరిలోకి దిగుతుందని చాలాసార్లు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఇక తమిళనాడులో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో విజయ్ ప్రచారాన్ని వేగవంతం చేశారు. మరోవైపు తాజాగా రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన AIADMK తన ఎన్నికల మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. మొత్తం 297 హామీలతో అన్నాడీఎంకే ఎన్నికల మేనిఫెస్టోను ఆ పార్టీ చీఫ్ ఎడప్పాడి కే పళనిస్వామి విడుదల చేశారు. అందులో మహిళలకు ఉచితంగా ఏసీలు, స్టడీ లోన్ మాఫీ, పురుషులకు ఉచిత బస్సు ప్రయాణం తదితర పథకాలు ఉన్నాయి.
ఇదిలాఉంటే తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక పరిణామం జరిగింది. తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన స్థాపించిన మక్కల్ నీది మయ్యం పార్టీ తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేయదని తెలిపారు. కానీ అధికార డీఎంకే కు తమ పార్టీ ఫుల్ సపోర్ట్ ఇస్తుందని స్పష్టం చేశారు. డీఎంకే కూటమిలోని అందరు నాయకులకు తమ పార్టీ మద్దతు ఉంటుందని కమల్ హాసన్ పేర్కొన్నారు. తాజాగా తమిళనాడు సీఎం స్టాలిన్ తో భేటీ అనంతరం కమల్ హాసన్ ఈ కీలక ప్రకటన చేశారు.

ఇక కమల్ హాసన్ ప్రకటనను తమిళనాడు సీఎం స్టాలిన్ స్వాగతించారు. తమిళనాడులో అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యతను ఇస్తూ కమల్ హాసన్ గొప్ప నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు. మరోవైపు డీఎంకే కూటమిలో భాగం అయిన డీఎండీకే పార్టీకి 10 స్థానాలను కేటాయించింది డీఎంకే పార్టీ. రోజురోజుకూ రసవత్తరంగా మారుతున్న తమిళనాడు రాజకీయాల్లో విజయం సాధించేది ఎవరో తెలియాలంటే మే 4 వరకు ఆగాల్సిందే. ఇక తమిళనాడులోని 234 అసెంబ్లీ స్థానాలకు గాను ఏప్రిల్ 23 న పోలింగ్ జరగనుంది. అలాగే ఎన్నికల ఫలితాలు మే 4 న వెల్లడికానున్నాయి.
-
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
విజయ్ కు బిగ్ షాక్.. -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఎంత సీఎం అయినా.. !! -
విజయ్ పార్టీలో సినిమా చిచ్చు! కీలక పార్టీ మద్దతు ఖతం -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
విజయ్ విజిల్ రీసౌండ్- పెరంబూరు, తిరుచ్చి ఈస్ట్ గ్రౌండ్ రిపోర్ట్ -
ఎన్నికల వేళ విజయ్ సంచలనం.. మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్..? -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్












Click it and Unblock the Notifications