వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గజిని బిడెన్: అయిదు నిమిషాలకోసారి మెమరీ లాస్..డేటా క్రాష్: ఇక పెత్తనం అంతా కమలదే: కంగనా

|
Google Oneindia TeluguNews

ముంబై: అగ్రరాజ్యం అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన ముచ్చట ఇంకా తీరనే లేదు.. ఇంకా ప్రమాణ స్వీకారం చేయనే లేదు. నాలుగేళ్ల పాటు అగ్రరాజ్యాన్ని ఏలాల్సిన అధినాయకుడు జో బిడెన్‌పై అప్పుడే విమర్శలు చెలరేగుతున్నాయి. అది కూడా మనదేశం నుంచే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. బాలీవుడ్ ఫైర్‌‌బ్రాండ్‌గా గుర్తింపు పొందిన కంగనా రనౌత్.. జో బిడెన్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయనను అమీర్ ఖాన్ నటించిన గజినీ మూవీ క్యారెక్టర్‌తో పోల్చారు.

బిడెన్ వయస్సుపై..

బిడెన్ వయస్సుపై..

అదే సమయంలో- ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌ను ఆకాశానికెత్తేశారు. ఇక అమెరికా పెత్తనం అంతా ఆమెదేనని కామెంట్స్ చేశారు. అమెరికా 46వ అధ్యక్షుడిగా ఎన్నికైన జో బిడెన్.. వయస్సును దృష్టిలో ఉంచుకుని కంగనా రనౌత్ ఈ వ్యాఖ్యలు చేశారనేది స్పష్టమౌతోంది. జో బిడెన్ వయస్సు 77 సంవత్సరాలు. ఈ వయస్సులో సహజంగానే కొన్ని అనారోగ్యకరమైన సమస్యలు తలెత్తుతుంటాయని, ఫలితంగా పరిపాలనపై ఆయన పెద్దగా దృష్టి సారించలేకపోవచ్చని కంగనా రనౌత్ అభిప్రాయపడ్డారు. పరోక్షంగా ఆమె ఇదే విషయాన్ని ట్వీట్ ద్వారా వెల్లడించారు.

గజిని బిడెన్‌గా అభివర్ణన..

గజిని బిడెన్‌గా అభివర్ణన..

జో బిడెన్‌ను.. గజినీ బిడెన్‌గా ఆమె అభివర్ణించారు. ప్రతి అయిదు నిమిషాలకోసారి ఆయన గజినీ క్యారెక్టర్‌లాగా మారిపోతుంటారని చెప్పారు. ఆయన డేటా క్రాష్ అవుతుంటుందని, మెమరీ లాస్ అవుతుంటుందని ఎద్దేవా చేశారు. ప్రతి విషయాన్నీ మరిచిపోతుంటారని పరోక్షంగా చెప్పుకొచ్చారు. అలాగే- వయస్సు మళ్లడం, వృద్ధాప్యం వల్ల ప్రతిరోజూ జో బిడెన్ మందులను వేసుకోవాల్సిన పరిస్థితులు ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ఆయన శరీరంలోకి మందులను రోజూ పంపించాల్సి ఉంటుందని చెప్పారు.

ఇక కమలా హ్యారిస్ షో..

ఇక కమలా హ్యారిస్ షో..

ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా వంటి అగ్రరాజ్యాన్ని పరిపాలించడం అసాధ్యమని కంగనా రనౌత్ అభిప్రాయపడ్డారు. ఆయనకు బదులుగా ఇక పెత్తనం అంతా కమలా హ్యారిస్ చేతుల్లోకి వెళ్తుందని అన్నారు. ఇక నడిచేదంతా కమలా హ్యారిస్ షో అని చెప్పారు. ఓ మహిళ అత్యున్నత స్థానానికి చేరుకుందంటే.. ప్రతి ఒక్క మహిళకూ ఆమె మార్గదర్శనం చేసినట్టవుతుందని వ్యాఖ్యానించారు. ఛీర్స్ టు ద హిస్టారిక్ డే అంటూ కామెంట్స్ చేశారు కంగనా రనౌత్.

విల్మింగ్టన్ కార్యక్రమానికి సంబంధించిన వీడియో క్లిప్..

విల్మింగ్టన్ కార్యక్రమానికి సంబంధించిన వీడియో క్లిప్..

డెల్వర్‌లోని విల్మింగ్టన్‌లో గల క్రిస్టీనా రివర్ ఫ్రంట్ ఛేజ్ సెంటర్‌లో జో బిడెన్‌తో కలిసి కమలా హ్యారిస్ పాల్గొన్న కార్యక్రమానికి సంబంధించిన ఓ వీడియో క్లిప్పింగ్‌ను కంగనా రనౌత్ తన ట్వీట్‌కు జత చేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే వారిద్దరూ అమెరికా ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలోని క్లిప్పింగ్ అది. దీన్ని తన ట్వీట్‌కు జత చేసిన కంగనా రనౌత్.. కమలా హ్యారిస్‌కు శుభాకాంక్షలు తెలిపారు. జో బిడెన్‌ పట్ల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

English summary
Bollywood actress Kangana Ranaut took to Twitter and shared Kamala's tweet, in which she shared the video of the speech. Kamala has captioned the speech video, "While I may be the first, I won’t be the last." To this, Kangana wrote, "Not sure about Gajni Biden who’s data crashes every 5 minutes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X