Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మత్తు మందు ఇచ్చి రేప్, హీరో అరెస్టు, పొలిటికల్ పార్టీ పేరుతో రూ. కోట్లు లూటీ !

బెంగళూరు: కన్నడ నటుడి మీద రేప్ కేసు నమోదు కావడం కలకలం రేపింది. 2011లో స్వయం కృషి సినిమాతో కన్నడ చిత్ర పరిశ్రమలోకి నటుడిగా, నిర్మాతగా అడుగుపెట్టిన వీరేంద్రబాబుపై రెండో కేసు దాఖలైంది. అత్యాచారం ఆరోపణలపై బెంగళూరులోని కొడిగేహళ్లి పోలీసులు నటుడు వీరేంద్ర బాబును అరెస్టు చేశారు. అపస్మారక స్థితిలో ఉన్న మహిళపై కన్నడ నటుడు వీరేంద్రబాబు అత్యాచారానికి పాల్పడ్డాడని కేసు నమోదు కావడంతో స్యాండిల్ వుడ్ ఉలిక్కిపడింది.

అత్యాచారం చేసి వీడియో తీసి తరచూ బెదిరింపులకు పాల్పడుతున్నాడని, ఆ వీడియోలతో తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇది కేవలం బెదిరింపు మాత్రమే కాదని, బాధితురాలి నుంచి నటుడు వీరేంద్ర బాబు రూ. 15 లక్షలు డిమాండ్ చేశాడని, డబ్బు ఇవ్వలేదని ఆమెను బెదిరించాడని, డబ్బులు ఇవ్వకపోతే వీడియో లీక్ చేస్తామని నటుడు వీరేంద్ర బాబు ఆమెను బెదిరించాడని కేసు నమోదు అయ్యింది.

Kannada actor arrested for making videos of drugging and raping a woman in Bengaluru
ఈ సంఘటన 2021లో జరిగింది ఆ రోజు ఆ మహిళ నగలు అమ్మి నటుడు వీరేంద్ర బాబుకు డబ్బులు ఇచ్చిందని, గత జూలై 30వ తేదీ నుంచి మళ్లీ ఆ మహిళకు ఫోన్ చేసి మరోసారి నటుడు వీరేంద్ర బాబు బెదిరించాడని పోలీసులు చెప్పారు. ఒకసారి ఆ మహిళను కారులో తిప్పి బెదిరించి బంగారు ఆభరణాలు తీసుకున్నాడని పోలీసులు చెప్పారు.

నటుడు వీరేంద్ర బెదిరించడమే కాకుండా పాయింట్ బ్లాక్ గన్ తో తనను చంపేస్తానని బెదిరిస్తున్నాడని మహిళ ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటనకు సంబంధించి వీరేంద్రబాబు, అతని స్నేహితులపై కొడిగేహళ్లి పోలీస్ స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చెయ్యడంతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్టు చేసి తదుపరి విచారణ జరుపుతున్నారు.

కొన్ని నెలల క్రితం వీరేంద్రబాబు రూ. 1.8 కోట్ల రూపాయల మోసం చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రీయ జనహిత పార్టీని ఏర్పాటు చేస్తామని బెంగళూరులోని యలహంక వాసి వీరేంద్ర బాబు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యే, ఎంపీతోపాటు వివిధ పదవులకు అభ్యర్థుల కోసం పార్టీ అభ్యర్థుల ఎంపిక కోసం పలువురిని ఆహ్వానించారు. ఎమ్మెల్యే టిక్కెట్లు కావాలని అనుకునే వాళ్లు లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని వీరేంద్ బాబు చెప్పారని ఆరోపణలు ఉన్నాయి.

Kannada actor arrested for making videos of drugging and raping a woman in Bengaluru

ఆ డబ్బుతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లలకు వికేర్ లెర్నింగ్ యాప్ ద్వారా ఉచిత ఆన్‌లైన్ విద్యతోపాటు పలు టూల్స్ అందించి ప్రజలను తమ పార్టీ వైపు ఆకర్షించే ప్లాన్‌ను ఆర్యన్ ఇన్ఫోటెక్ అన్నో కంపెనీ తెలిపింది. బసవరాజ్ ఘోషల్ అనే వ్యక్తితో పాటు చాలా మంది దీనిని నమ్మి వీరేంద్రబాబుకు రూ. 1.8 కోట్లకు పైగా డబ్బులు ఇచ్చారని తెలిసింది.

ఆ డబ్బులు తీసుకున్న నటుడు వీరేంద్ర బాబు సహా ఏడుగురిపై బెంగళూరులోని కొడిగేహళ్లి పోలీస్ స్టేషన్ లో ఎఫ్ ఐఆర్ నమోదైంది. పేద పిల్లలకు ఉచిత విద్య అందిస్తామనే సాకుతో ప్రజల నుంచి కోట్లలో డబ్బులు వసూలు చేసి ఎలాంటి సాయం చెయ్యకుండా మోసం చేశాని, వీరి మీద చర్యలు తీసుకుని విచారణ చేయాలని ఫిర్యాదుదారు బసవరాజ్ ఘోషల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చీటింగ్ కేసుతో పాటు ఇప్పుడు నటుడు వీరేంద్ర బాబు మీద రేప్ కేసు నమోదు కావడం హాట్ టాపిక్ అయ్యింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+