వాడుకుని వదిలేసిన ప్రియుడు, నటి ఆత్మహత్య, సెల్ఫీ వీడియోలో షాకింగ్ నిజాలు, రూ. లక్షలు స్వాహా !

బెంగళూరు: పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఐదు సంవత్సరాల నుంచి అన్ని విదాలుగా ఉపయోగించుకుని చివరికి ప్రియుడు మోసం చెయ్యడంతో నటి జీర్ణించుకోలేకపోయింది. వాడుకుని వదిలేసిన ప్రియుడు తాను పెళ్లి చేసుకోనని తేల్చి చెప్పడంతో జీవితంపై విరక్తి చెందిన నటి చందన (29) సోమవారం పట్టపగలు సెల్ఫీ వీడియో తీసి ఆమె భాద మొత్తం బయటకు చెప్పుకుని విషం సేవించి ఆత్మహత్య చేసుకుంది. రైతు కుటంబంలో పుట్టిపెరిగిన నటి చందన ఆత్మహత్య చేసుకోవడంతో సాటి కళాకారులతో పాటు ఆమె కుటుంబ సభ్యులు షాక్ కు గురైనారు.

కన్నడ నటి

కన్నడ నటి

కర్ణాటకలోని హాసన్ జిల్లా బేలూరు ప్రాంతానికి చెందిన చందన (29) బెంగళూరు చేరుకుని తావరకెరెలోని క్రిష్ణమూర్తి లేఔట్ లో నివాసం ఉంటూ పలు కన్నడ టీవీ సీరియల్స్, సినిమాలు, పలు ప్రకటనల కంపెనీలో మోడల్ గా నటిస్తోంది. రైతు కుటుంబంలో చందన పుట్టింది. చందన తల్లిదండ్రులు పరువు కోసం ప్రాణాలు ఇచ్చే వాళ్లు అని తెలిసింది.

నటితో ఐదేళ్లుగా లవ్

నటితో ఐదేళ్లుగా లవ్

బెంగళూరు నగరంలో నివాసం ఉంటున్న దినేష్ అనే యువకుడు అదే నగరంలోని ప్రముఖ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. గత ఐదు సంవత్సరాల నుంచి దినేష్, నటి చందన ప్రేమించుకుంటున్నారు. ఎప్పటికైనా దినేష్ ను పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడి పిల్లలతో కలిసి సంతోషంగా జీవించాలని నటి చందన ఎన్నో కలలుకనింది.

హ్యాండ్ ఇచ్చిన ప్రియుడు

హ్యాండ్ ఇచ్చిన ప్రియుడు

నటి చందనతో ఐదు సంవత్సరాలు ఎంజాయ్ చేసిన దినేష్ ఆమెను మాత్రం పెళ్లి చేసుకోవడానికి ఈ రోజు రేపు అంటూ ఇంత కాలం వెళ్లదీశాడు. అయితే ఇటీవల చందన తనను వెంటనే పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టింది. పెళ్లి చేసుకోవాలని చందన ఎక్కువ పట్టుపట్టడంతో దినేష్ కు ఏం చెయ్యాలో అర్థం కాలేదని తెలిసింది.

నువ్వు చెడిపోయావు, మా ఇంటి కోడలివా ?

నువ్వు చెడిపోయావు, మా ఇంటి కోడలివా ?

దినేష్ ను ప్రేమిస్తున్నానని, అతనినే పెళ్లి చేసుకుంటానని చందన ఆమె కుటుంబ సభ్యులకు తేల్చిచెప్పింది. చందన ఇష్టపడిన దినేష్ తోనే వివాహం చెయ్యాలని ఆమె కుటుంబ సభ్యులు నిర్ణయించారు. పెళ్లి విషయం మాట్లాడటానికి చందన కుటుంబ సభ్యులు దినేష్ ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో చందన క్యారెక్టర్ సరిగా లేదని, ఆమె ఎవరితో పడితే వారితో తిరిగుతుందని, అలాంటి అమ్మాయిని మా ఇంటి కోడలని చేసుకోమని దినేష్ తల్లి గాయిత్రి, అతని మామ దయానంద్ చందన కుటుంబ సభ్యులకు తేల్చిచెప్పారని ఆరోపణలు ఉన్నాయి. అంతే కాకుండా చందన గురించి చెడుగా మాట్లాడటంతో ఆమె కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోయారని తెలిసింది. దినేష్ కుటంబ సభ్యులు పెళ్లికి నిరాకరించడంతో వారి పెళ్లి క్యాన్సిల్ అయ్యింది.

నటి డబ్బులతో జల్సాలు, అబార్షన్ ?

నటి డబ్బులతో జల్సాలు, అబార్షన్ ?

తన తల్లిదండ్రులు పెళ్లికి అంగీకరించరని, నేను నిన్ను పెళ్లి చేసుకోనని దినేష్ తేల్చిచెప్పాడు. గత ఐదు సంవత్సరాల నుంచి నేను సంపాదించిన డబ్బులు మొత్తం నీ జల్సాల కోసం ఖర్చు చేసుకున్నావని, ఇప్పుడు పెళ్లి చేసుకోనని నువ్వు ఎలా చెబుతావని నటి చందన ప్రియుడు దినేష్ ను నిలదీసింది. ఇప్పటికే ఒక సారి దినేష్ ప్రియురాలు చందనాతో జల్సాలు చేసి ఆమెకు అబార్షన్ చేయించాడని తెలిసింది. పెళ్లి చేసుకోవాలంటే తనకు రూ. 5 లక్షలు కట్నం ఇవ్వాలని దినేష్ డిమాండ్ చేశాడని తెలిసింది. పెళ్లి చేసుకున్న తరువాత రూ. 5 లక్షలు ఇవ్వడానికి చందన కుటుంబ సభ్యులు సిద్దం అయ్యారు. అయితే పెళ్లికి ముందే దినేష్ డబ్బులు ఇవ్వాలని చందనను డిమాండ్ చేశాడని, అందుకు ఆమె అంగీకరించలేదని తెలిసింది.

సెల్ఫీ వీడియో తీసిన నటి

సెల్ఫీ వీడియో తీసిన నటి

పెళ్లి చేసుకోవడానికి ప్రియుడు దినేష్ నిరాకరించడంతో నటి చందన కుమిలిపోయింది. జూన్ 1వ తేదీ సోమవారం డెత్ నోట్ రాసిపెట్టిన చందన సెల్ఫీ వీడియో తీసింది. సెల్ఫీ వీడియోలో నటి చందన ఇలా మాట్లాడింది. పెళ్లి చేసుకుంటానని గత ఐదేళ్లుగా తనను అన్ని విదాలుగా ఉపయోగించుకుని లెక్కలేనన్ని లక్షల రూపాయలు తీసుకున్నావు. ఇప్పుడు పెళ్లి చేసుకోనని ఎదురుతిరిగావు, నేను ఈ గ్లాసులో ఉన్న విషం సేవించి ఆత్మహత్య చేసుకుంటున్నా, నువ్వు నన్ను మోసం చేసినట్లు మరొక అమ్మాయిని మోసం చెయ్యవద్దు, నేను చనిపోయాక నువ్వు సంతోషంగా ఉండూ అంటూ గ్లాసులో ఉన్న విషయం సేవించిన నటి చందన కొంత సేపటికి కుప్పకూలిపోయింది.

ప్రియుడు ఏం చేశాడంటే ?

ప్రియుడు ఏం చేశాడంటే ?

నటి చందన సెల్ఫీ వీడియోను ఆమె ప్రియుడు దినేష్ కు పంపించింది. వెంటనే తావరకెరెలోని క్రిష్ణమూర్తి లేఔట్ లోని చందన ఇంటికి దినేష్ పరుగు తీశాడు. అపస్మారకస్థితిలో పడి ఉన్న చందనను ఆమె ప్రియుడు దినేష్ స్వయంగా ఆసుపత్రికి తరలించాడు. అయితే చందన ఎక్కువగా విషం సేవించడంతో మృతి చెందింది. చందన మృతి చెందిందని తెలుసుకున్న ఆమె ప్రియుడు దినేష్ ఆసుపత్రి నుంచి తప్పించుకుని పరారైనాడు.

Recommended Video

    Video Of Rishi Kapoor Blessing Doctor Goes Viral
    అవమానించి చంపేశారు

    అవమానించి చంపేశారు

    చందన ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకున్న ఆమె మామ సంతోష్ ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు రంగంలోకి దిగారు. చందన చాలా ధైర్యవంతురాలు అని, పెళ్లి చేసుకుంటానని దినేష్ మోసం చెయ్యడం, అతని కుటుంబ సభ్యులు అవమానించడం వలనే చందన ఆత్మహత్య చేసుకుందని ఆమె కుటుంబ సభ్యులు కేసు పెట్టారు. దినేష్, అతని తల్లి గాయిత్రి, తండ్రి, మామ దయానంద్ తో పాటు మొత్తం ఐదు మంది మీద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని సుద్దగుంటపాళ్య పోలీసులు తెలిపారు. నటి చందన ఆత్మహత్య చేసుకోవడంతో సాటి కళాకారులతో పాటు ఆమె స్నేహితులు షాక్ కు గురైనారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+