రోడ్ షో, ఎన్నికల ప్రచారం చేసి క్లైమాక్స్ లో మాజీ సీఎంకు షాక్ ఇచ్చిన స్టార్ హీరో, ఒట్టు !
బెంగళూరు/మైసూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీల రాజకీయ పార్టీల ప్రముఖులతో పాటు సినీ తారలు ఎన్నికల ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. బీజేపీ తరుపున హీరో సుదీప్, దర్శన్, కాంగ్రెస్ పార్టీ తరుపున డాక్టర్ శివరాజ్ కుమార్, దునియా విజయ్, నటి రమ్యా తదితరులు ప్రచారం చేస్తున్నారు.
మైసూరు జిల్లాలోని వరుణ నియోజక వర్గంలో కర్ణాటక మాజీ సీఎం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సిద్దరామయ్య పోటీ చేస్తున్నారు. సిద్దరామయ్యకు పోటీగా కర్ణాటక మంత్రి, బెంగళూరు బీజేపీ లీడర్ వి. సోమణ్ణ పోటీ చేస్తున్నారు. శుక్రవారం మాజీ సీఎం సిద్దరామయ్యకు మద్దతుగా కన్నడ హ్యాట్రిక్ హీరో డాక్టర్ శివరాజ్ కుమార్ ఎన్నికల ప్రచారం చేశారు.

సిద్దరామయ్యతో కలిసి రోడ్ షోలో పాల్గొన్న తరువాత వరుణా నియోజక వర్గం ప్రజలను ఉద్దేశించి హీరో శివరాజ్ కుమార్ మాట్లాడుతూ సిద్దరామయ్యకు ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని మనవి చేశారు. సిద్దరామయ్య చాలా మంచి వ్యక్తి అని ఇదే సమయంలో హ్యాట్రిక్ హీరో డాక్టర్ శివరాజ్ కుమార్ అన్నారు. తరువాత మీడియాతో మాట్లాడిన శివరాజ్ కుమార్ బాంబు పేల్చారు.
వరుణా నియోజక వర్గంలో సిద్దరామయ్య మీద పోటీ చేస్తున్నది మంత్రి సోమణ్ణ అని తనకు ఇంతవరకు తెలీదని, ఈమాట నేను ఒట్టు వేసి చెబుతున్నానని శివరాజ్ కుమార్ చెప్పడంతో సిద్దరామయ్యతో పాటు కాంగ్రెస్ నాయకులు ఉలిక్కిపడ్డారు. మైసూరు-కొడుగు లోక్ సభ బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా, సిద్దరామయ్య మీద పోటీ చేస్తున్న సోమణ్ణ తనకు చాలా సన్నిహితులు అని శివరాజ్ కుమార్ అన్నారు.
అలాఅని వారితో నేనే మాట్లాడకూడదు అని ఎవరైనా చెబితే నేను ఒప్పుకోను అని శివరాజ్ కుమార్ అన్నారు. హీరో సుదీప్ బీజేపీ తరుపున ఎన్నికల ప్రచారం చేస్తున్నారని, ఇద్దరూ సినిమాల్లో నటిస్తున్నామని. తాను కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేశానని నేను సుదీప్ తో మాట్లాడకుండా ఉంటానా, సుదీప్ నేను బెస్ట్ ఫ్రెండ్స్ అని డాక్టర్ శివరాజ్ కుమార్ అన్నారు.

తనకు చాలాకాలం నుంచి రాహుల్ గాంధీని కలవాలని అనుకుంటున్నానని, ఆయన్ను ఇటీవలే కలిశానని, రాహుల్ గాంధీ ఈ వయసులో కూడా చాలా ఫిట్ గా ఉన్నారని, ఆయన అంటే తనకు చాలా ఇష్టం అని శివరాజ్ కుమార్ అన్నారు. మాకు మద్దతుగా ఎన్నికల ప్రచారం చెయ్యాలని ఇంత వరకు తనను ఎవ్వరూ అడగలేదని శివరాజ్ కుమార్ అన్నారు.
కాంగ్రెస్ పార్టీ మద్దతు కోరడంతో తాను ఆపార్టీకి ఎన్నికల ప్రచారం చేశానని, అయినా ఒకరిమాటలు విని తాను గుడ్డిగా ఎన్నికల ప్రచారం చెయ్యడానికి నేను ఏమైనా చిన్నపిల్లవాడినా, తన వయసు 61 ఏళ్లు అని హ్యాట్రిక్ హీరో డాక్టర్ శివరాజ్ కుమార్ అన్నారు. మొత్తం మీద కొన్ని గంటల పాటు సిద్దరామయ్యతో కలిసి రోడ్ షో నిర్వహించి ఎన్నికల ప్రచారం చేసిన శివరాజ్ కుమార్ క్లైమాక్స్ లో సినిమా ట్విస్ట్ టైపులో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులకు జర్క్ ఇచ్చి అక్కడి నుంచి వచ్చేశారు.
-
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!!












Click it and Unblock the Notifications