నటి మైత్రియా గౌడ సినిమా: ఐఏఎస్ డికె రవి లైఫ్ స్టోరీ? (ఫోటోలు)

బెంగళూరు: ఐఏఎస్ అధికారి డికె రవి అనుమానాస్పద మృతి కేసు దర్యాప్తు ఒక పక్క జరుగుతుంటే ఆయన జీవిత చరిత్ర ఆధారంగా సీనిమా తియ్యడానికి కన్నడ సినీ నిర్మాతలు పోటీ పడుతున్నారు. డికే రవి టైటిల్ నిర్మాతలు పోటీ పడుతున్నారు.

డికే రవి టైటిల్ దక్కించుకోవడానికి కన్నడ చలన చిత్ర వాణిజ్య మండలి దగ్గర నిర్మాతలు క్యూ కడుతున్నారు. డికే రవి కుటుంబ సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే వరకు ఆ పేరుతో సినిమా నిర్మించడానికి వీలులేదని, ఆ టైటిల్ రిజిస్టర్ చేయ్యమని వాణిజ్యమండలి తేల్చి చెప్పింది.

ఇదే సందర్బంలో వివాదాస్పద నటి మైత్రియా గౌడ ఒక చిత్రంలో నటిస్తున్నారు. ఆ సినిమాలో ఐఏఎస్ అధికారి జీవిత చరిత్ర ఉందని గాంధీనగర్ వర్గాలు అంటున్నాయి. ఈ సినిమాను డికే రవి జీవిత చరిత్రకు కొంత కల్పనను జోడించి అక్షతే పేర నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది.

అక్షతేలో ఏముంది

అక్షతేలో ఏముంది

కేంద్ర మంత్రి సదానందగౌడ కుమారుడు కార్తిక్ గౌడ తన భర్త అని చెప్పి బాంబు పేల్చి నానా హంగామా చేస్తూ ప్రధాని నరేంద్ర మోడిని కలవాలని బహిరంగ సభ దగ్గర రాద్దాంతం చేసిన నటి మైత్రియా గౌడ కన్నడ సినీ రంగంలో చాలా బిజి అయిపోయారు. Love on NH4 సినిమా తరువాత మైత్రియా గౌడ నటిస్తున్న సినిమా అక్షతే.

డికే. రవి రియల్ స్టోరీ

డికే. రవి రియల్ స్టోరీ

అక్షతే సినిమాలో హీరో, హీరోయిన్ల పాత్రలకు ఎంత ప్రాధన్యత ఉందో ఒక సిన్సియర్ ఐఏఎస్ అధికారి పాత్రకు అంతే ప్రాధాన్యత ఇస్తున్నారని సమాచారం. పేదరికంలో పుట్టి ఐఏఎస్ అధికారి అయిన ఆ వ్యక్తి అక్రమ మైనింగ్ పై ఉక్కుపాదం మోపి ఈ సినిమాలో అదృశ్యం అవుతాడంట.

దర్శకుడు రాజు చెబుతున్న మాట

దర్శకుడు రాజు చెబుతున్న మాట

మా సినిమాలో ఐఏఎస్ అధికారి పాత్ర ఉన్న మాట నిజం. కష్టపడి ఐఏఎస్ అధికారి అవుతాడు. తరువాత అవినీతి పై పోరాటం చేసి అదృశ్యం అవుతాడు. అయితే డికే రవి జీవితం ఆధారంగా ఈ సినిమా తియ్యడం లేదు, ఇక్కడ ఆయన జీవితం ఆధారంగా సినిమా తియ్యడం లేదు. వివాదం వచ్చే సమస్యే లేదు.

ప్రేమ..... పెళ్లి చుట్టు

ప్రేమ..... పెళ్లి చుట్టు

ఒక పెళ్లి చుట్టూ తిరిగే సినిమానే ఈ అక్షతే. ఈ సినిమాలో ప్రేమించిన జంట పెళ్లి చేసుకోవడానికి వారు ఎదుర్కోనే సమస్యలు చూపిస్తున్నారని సమాచారం. ఈ సినిమాలో మైత్రియా గౌడ, యువ సినిమా ఫేం కార్తిక్ శెట్టి, సంచారి సినిమా ఫేం రాజ్ తదితరులు నటిస్తున్నారు.

కొత్త ప్రయత్నం

కొత్త ప్రయత్నం

జటాయు అనే సినిమాకు సహాయ దర్శకుడిగా పని చేసిన రాజు అక్షతే సినిమా ద్వారా కన్నడ సినీ పరిశ్రమకు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. మైత్రియా గౌడ నటించిన Love on NH4 సినిమా నిర్మాతలు ఎస్. వెంకటేష్, సంజీవ్ శెట్టి అక్షతే సినిమాను నిర్మిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+