వివాహిత మహిళతో జల్సాలు: దినపత్రిక రిపోర్టర్ దారుణ హత్య, గెస్ట్ హౌస్ లో అడ్డంగా !
వివాహిత మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ కన్నడ దిన పత్రిక రిపోర్టర్ ను అతి దారుణంగా హత్య చేసిన ఘటన కర్ణాటకలోని హావేరీ తాలుకాలో జరిగింది.
బెంగళూరు: వివాహిత మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ కన్నడ దిన పత్రిక రిపోర్టర్ ను అతి దారుణంగా హత్య చేసిన ఘటన కర్ణాటకలోని హావేరీ తాలుకాలో జరిగింది. గదగ్ జిల్లా శిరహట్టి ప్రాంతానికి చెందిన నాగనగౌడ (40) అనే రిపోర్టర్ హత్యకు గురైనాడు.
ఓ కన్నడ దిన పత్రికలో శిరహట్టి తాలుకా రిపోర్టర్ గా నాగనగౌడ మరిగౌడ రిపోర్టర్ గా పని చేస్తున్నాడు. ఇతను శిరహట్టి పట్టణంలోని ఓ వివాహిత మహిళతో అక్రమ సంబంధం సాగిస్తున్నాడని సమాచారం. మంగళవారం వివాహిత మహిళతో కలిసి నాగనగౌడ మరిగౌడ బళ్లారి జిల్లా వెళ్లాడు.

తరువాత బళ్లారి జిల్లాలోని హువినహడలి తాలుకాలోని మైలారదలోని గెస్ట్ హౌస్ లో మహిళతో కలిసి ఏకాంతంగా ఉన్నాడు. విషయం తెలుసుకున్న మహిళ భర్త, అతని బంధవులు గెస్ట్ హౌస్ చేరుకుని నాగనగౌడ మరిగౌడను మారణాయుధాలతో దారుణంగా హత్య చేశారు.
తరువాత అక్కడి నుంచి మృతదేహాన్ని తీసుకెళ్లి హావేరీ సమీపంలోని బెళవగి గ్రామం సమీపంలోని రహదారి బ్రిడ్జి కింద విసిరివేసి పరారైనారని పోలీసులు చెప్పారు. వివాహిత మహిళతో పాటు హంతకులు పారిపోయారని, వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications