బెంగళూరులో సన్నీ లియోన్‘హాట్ నైట్’పార్టీ, టెక్కీలు టార్గెట్, రద్దు చెయ్యండి!
Recommended Video

బెంగళూరు: 2018 నూతన సంవత్సరం వేడుకల సందర్బంగా బెంగళూరులో జోరుగా నైట్ పార్టీలు జరుగుతాయి. బెంగళూరులోని ఎంజీ రోడ్డులో డిసెంబర్ 31వ తేదీ రాత్రి మొదలు అయ్యే నూతన సంవత్సర వేడుకలు మరుసటి రోజు వరకూ ఎంతో వైభవంగా జరుగుతాయి. ఇప్పుడు సెక్స్ బాంబ్ సన్నీ లియోన్ తో ఓ ప్రైవేటు సంస్థ బెంగళూరులో న్యూఇయర్ సందర్బంగా సన్నీ హాట్ నైట్ కార్యక్రమం నిర్వహించడానికి ఏర్పాట్లు చెయ్యడంతో వివాదం మొదలైయ్యింది.

బెంగళూరులో సన్నీ నైట్!
బెంగళూరు నగరంలోని అనేక స్టార్ హోటల్స్, రిసార్ట్స్, పబ్ లు, మాల్స్, పార్టీ ఫంక్షన్ హాల్స్ తదితర ప్రాంతాలు 2018 నూతన సంవత్సర వేడుకలకు ముస్తాబు అవుతోంది. ఇదే సందర్బంలో బెంగళూరులో సన్నీహాట్ నైట్ పార్టీ ఏర్పాట్లకు రంగం సిద్దం చేశారు.

టెక్కీలు టార్గెట్
బెంగళూరు నగరంలోని ప్రసిద్ది చెందిన అనేక సాఫ్ట్ వేర్ కంపెనీల ఉద్యోగులను టార్గెట్ చేసుకుని సన్నీ హాట్ నైట్ న్యూ ఇయర్ పార్టీ ఏర్పాటు చేశారని తెలిసింది. బెంగళూరు నగరంలోని నాగవార సమీపంలోని మాన్యతా ఎంబాసి బిజినెస్ టెక్ పార్క్ లో డిసెంబర్ 31వ తేదీ సన్నీ హాట్ నైట్ పార్టీకి ఏర్పాట్లు చేస్తున్నారు.

ఆన్ లైన్ లో టిక్కెట్లు
ప్రముఖ ప్రైవేటు ప్రకటనల కంపెనీ, సన్నీ లియోన్, కణ్ భాగస్వామ్యంతో బెంగళూరులో న్యూఇయర్ పార్టీ నిర్వహించడానికి సిద్దం అయ్యారు. ఇప్పటికే సన్నీనైట్ పార్టీకి జోరుగా టిక్కెట్లు విక్రయించేశారు. కార్పొరేట్ కంపెనీ ఉద్యోగులను టార్గెట్ చేసుకుని ఆన్ లైన్ లోనే టిక్కెట్లు విక్రయిస్తున్నారని సమాచారం.

కన్నడ సంఘాల ఆందోళన
బెంగళూరులో సన్నీ లియోన్ నైట్ పార్టీ నిర్వహించడానికి వీల్లేదని కన్నడ రక్షణా వేదిక, కరవే యువసేనతో సహ పలు కన్నడ సంఘాలు ఆందోళన చేపట్టాయి. కర్ణాటక సంసృతి, సాంప్రధాయాలకు భంగం కలిగించే అర్దనగ్న నైట్ పార్టీలు ఏర్పాటు చేస్తే సహించమని హెచ్చరించారు.

సన్నీ చిందులు, మందు పార్టీ
సన్నీ లియోన్ తో ఏర్పాటు చేస్తున్న సన్నీనైట్ పార్టీకి హాజరు అయ్యేవారికి భారీగా మద్యం సరఫరా చేస్తామని నిర్వహకులు ఇప్పటికే సమాచారం ఇచ్చారని, కన్నడ సంసృతి, సాంప్రధాయాలను వీరు నాశనం చెయ్యడానికే ఇలాంటి పార్టీలు ఏర్పాటు చేస్తున్నారని కన్నడ రక్షణా వేదిక నాయకుడు హరీష్ ఆరోపించారు.

21 సంవత్సరాలు ఉంటేనే!
సన్నీ హాట్ నైట్ పార్టీ నిర్వహకులు 21 సంవత్సరాల పైన వయసు ఉన్న వారికి మాత్రమే న్యూఇయర్ పార్టీకి రావడానికి అవకాశం కల్పించారు. అంటే అక్కడ సెక్స్ బాంబ్ తో అర్దనగ్నంగా డ్యాన్సులు వేయించి యువతను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నారని పరోక్షంగా చెబుతున్నారని కన్నడ రక్షణా వేదిక నాయకుడు హరీష్ ఆరోపించారు.

సినిమా షూటింగ్ ఓకే
సన్నీ లియోన్ కర్ణాటకలో సినిమా షూటింగ్ లకు హాజరు అయితే మాకు ఎలాంటి అభ్యంతరం లేదని, కన్నడ
సంసృతి, సాంప్రధాయాలకు వ్యతిరేకంగా నైట్ పార్టీలు నిర్వహిస్తే తాము అంగీకరించమని కన్నడ సంఘాలు తేల్చి చెప్పాయి. వెంటనే సన్నీనైట్ పార్టీని రద్దు చెయ్యాలని డిమాండ్ చేస్తూ బెంగళూరులోని మైసూరు బ్యాంక్ సర్కిల్. చాళుక్య సర్కిల్ లో సన్నీ లియోన్ బ్యానర్లు, దిష్టిబొమ్మలు దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications