కన్నడ నటి బలవ్మరణం.. ఇంటిలో ఉరేసుకొని ఆత్మహత్య..
రంగుల ప్రపంచంలో లైఫ్.. ఏ లోటు లేకుండా ఉంటారు. లగ్జరీ లైఫ్ అనుభవిస్తారు. అయినా ఎక్కడో తేడా.. ఏం చేయాలో తెలీదు.. క్షణికావేశంలో డిసిషన్ తీసుకుంటారు. అలా చాలా మంది నటీనటులు సూసైడ్ చేసుకున్నారు. తాజాగా కన్నడ టీవీ నటి సౌజన్య బెంగళూరులోని తన అపార్ట్‌మెంట్‌లో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ వార్త ఇండస్ట్రీలో తీవ్ర కలకలం రేపింది.
బెంగళూరులోని కుంబల్గోడులో గల అపార్ట్‌మెంట్‌లో సౌజన్య ఉంటున్నారు. ఏం జరిగిందో తెలియదు.. కానీ సౌజన్య ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. చాలా సమయం వరకూ తలుపు తెరుచుకోలేదు. దీంతో అనుమానం వచ్చింది. బలవంతంగా తలుపులు బద్దలుకొట్టి లోపలికి వెళ్లారు. అయితే సౌజన్య విగతజీవిగా కనిపించింది. ఆమె రాసిన నాలుగు పేజీల సూసైడ్ నోట్ లభించింది. సూసైడ్ నోట్‌లో తన చావుకి ఎవరు కారణం కాదు అని.. వ్యక్తిగత కారణాల వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లు పేర్కొంది. ఇంగ్లీష్, కన్నడ భాషల్లో రాసిన సూసైడ్ నోట్ ద్వారా పోలీసులు ప్రాధమిక విచారణ ప్రారంభించారు.

సౌజన్య కో స్టార్స్ కుటుంబ సభ్యులను పోలీసులు విచారిస్తున్నారు. కుటుంబసభ్యులను క్షమించాలని సూసైడ్ నోట్‌లో కోరింది. ఆమెకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని ఫ్యామిలీ మెంబర్స్ చెబుతున్నారు. మానసికంగా కొన్ని సమస్యలు ఉన్నాయని విశ్వసనీయంగా తెలిసింది. సౌజన్య పలు కన్నడ సీరియల్స్‌తోపాటు సినిమాల్లో కూడా నటించారు. ఆమె మరణం ఇప్పుడు కన్నడ చిత్ర పరిశ్రమలో చర్చకు దారితీసింది. ఈ కేసుపై పోలీసులు క్షుణ్ణంగా విచారణ జరుపుతున్నారు. అభిమానులు, తోటి కళాకారులు సౌజన్య ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నారు.
సౌజన్య వయస్సు కేవలం 25 సంవత్సరాలే.. అంత చిన్న వయస్సులో ఆమె చనిపోవడం బాధాకరం.. ఆమెకు మంచి భవిష్యత్ ఉంది అని కో స్టార్స్ అంటున్నారు. సౌజన్య స్వస్థలం కొడగు జిల్లా కుషాల్ నగర్ కాగా.. నటిగా గుర్తింపు తెచ్చుకుందామని భావించి బెంగళూరుకు మకాం మార్చారు. ఆరోగ్య సమస్యల వల్లె చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. సిరియల్స్‌లోనే కాదు.. సినిమాల్లో సౌజన్య నటించారు.












Click it and Unblock the Notifications