పెళ్లికి ఒప్పుకో.. లేదంటే చంపి, ముక్కలు ముక్కలు చేస్తా, బెదిరింపు, అరెస్ట్
ఇప్పుడు ఒక్కటే చర్చ.. అదే ఢిల్లీలో ఆఫ్తాబ్ తన గర్ల్‌ఫ్రెండ్‌ను హత్య చేసిన ఘటన గురించే డిస్కషన్. ఆ ఉదంతం ఉలిక్కిపడేలా చేసింది. ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ తీసుకొని ఒకడు రెచ్చిపోయాడు. అవును ప్రేమను అంగీకరించు, పెళ్లి చేసుకో అని రచ్చ చేశాడు. ఉత్తరప్రదేశ్‌లో ఒకడు అలానే చేయగా.. పోలీసులు అరెస్ట్ చేశారు.
ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌కి చెందిన మహ్మద్ ఫయాజ్ అలా చేశాడు. ఓ 17 ఏళ్ల మైనర్ బాలికను బెదిరించాడు. తనను పెళ్లి చేసుకోవాలని కోరాడు. ఒకవేళ నిరాకరిస్తే.. చంపి, ముక్కలు ముక్కలు చేస్తామని వార్నింగ్ ఇచ్చాడు. దీంతో ఆమె బెదిరిపోయింది. వెంటనే తన కుటుంబ సభ్యులకు విషయం తెలియజేసింది. వారు పోలీసులను ఆశ్రయించారు.

దీంతో వారు పోలీసులకు కంప్లైంట్ చేశారు. అయినప్పటికీ అతనిలో మార్పు రాలేదు. కౌన్సిలింగ్ ఇచ్చిన వినలేదు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. నౌబస్తా పోలీసులు చామన్ గంజ్ వద్ద గల ఫయాజ్ ఇంటి వద్ద రైడ్ చేసి.. మరీ అరెస్ట్ చేశారు. అయితే అంతకుముందు ఫయాజ్ ఫ్యామిలీతో వారికి గొడవ జరిగింది. దీంతో మరిన్ని బలగాలను తీసుకొచ్చారు. ఆ తర్వాత ఫయాజ్ బయటకు వచ్చాడు.
గతనెల 16వ తేదీన ఫయాజ్‌పై కేసు నమోదు చేశామని తెలిపారు. పోక్సో చట్టం కింద కేసు ఫైల్ చేశామని తెలిపారు. తనను పెళ్లి చేసుకోవాలని అతను పదే పదే కోరాడు. దీంతో అతనిని అరెస్ట్ చేసి, జైలుకు తరలించారు. ఢిల్లీ దారుణం తర్వాత ఇలా కొందరు రెచ్చిపోతున్నారు. వారిపై పోలీసులు చర్యలు తీసుకోవడంతో బాధితులు ఊపిరి పీల్చుకుంటున్నారు.












Click it and Unblock the Notifications