మహిళకు లైంగిక వేధింపులు: పోలీస్ ఇన్‌స్పెక్టర్ అరెస్ట్

కాన్పూర్: మహిళలకు, ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసులే మహిళలపై వేధింపులకు పాల్పడుతుండటం విచారకరం. తాజాగా ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్‌లో చోటు చేసుకుంది. రైలులో ప్రయాణిస్తున్న ఓ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడిన పోలీస్ ఇన్‌స్పెక్టర్‌ను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు.

నిందితుడ్ని పోలీస్ ఇన్‌స్పెక్టర్ జెపి సోలంకిగా గుర్తించినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. అతడు ఇటీవలే కాన్పూర్‌కు బదిలీ అయ్యాడు. ఈటావా నుంచి కాన్పూర్‌కు కోటా-పాట్నా ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణించిన అతడు సోమవారం రాత్రి ఈ ఘటనకు పాల్పడ్డాడు.

 Kanpur: Police Inspector Arrested for Allegedly Molesting Woman

రైలులో ప్రయాణిస్తున్న ఓ మహిళను అతడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో ఆమె రైల్వే కోచ్ కండక్టర్‌కు సోమవారం అర్ధరాత్రి ఫిర్యాదు చేసిందని రైల్వే పోలీస్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

కోచ్ కండక్టర్ రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నిందితుడు సోలంకిని సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో అరెస్ట్ చేసినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+