28 మందితో సిద్ధరామయ్య జంబో కేబినెట్: జగదీష్ షెట్టర్‌కూ ఛాన్స్: లిస్ట్ ఇదే

బెంగళూరు: కర్ణాటకలో కొత్త ప్రభుత్వం ఇవ్వాళ కొలువుదీరబోతోంది. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మధ్యాహ్నం 12:30 గంటలకు వారు ప్రమాణ స్వీకారం చేస్తారు. గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ వారితో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. సిద్ధు-డీకేశితో పాటు మరో 28 మంది- మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం ఉంది.

దీనికోసం బెంగళూరులోని కంఠీరవ స్టేడియం ముస్తాబయింది. లక్షన్నర మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమానికి హాజరవుతారనే అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు- కనీవినీ ఎరుగని భద్రతను ఏర్పాటు చేశారు. కంఠీరవ స్టేడియం పరిసరాల్లో వాహనాల రాకపోకలపై ఆంక్షలను విధించారు.. దారి మళ్లించారు. ఉదయం నుంచే వాహనాల మళ్లింపు అమలులోకి వచ్చింది.

28 ministers are expected to take oath along with Siddaramaiah and DK Shivakumar

ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధినేత మల్లికార్జున ఖర్గే, మాజీ అధినేత్రి సోనియా గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, రాహుల్ గాంధీ.. హాజరు కానున్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. అశోక్ గెహ్లాట్ (రాజస్థాన్), సుఖ్వీందర్ సింగ్ సుకు (హిమాచల్ ప్రదేశ్), భూపేష్ బఘేల్ (ఛత్తీస్‌గఢ్) పాల్గొననున్నారు.

యూపీఏ భాగస్వామ్య పక్షాల తరఫున బిహార్, జార్ఖండ్ ముఖ్యమంత్రులు నితీష్ కుమార్, హేమంత్ సోరెన్.. ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఢిల్లీ, కేరళ, పుదుచ్చేరి ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, పినరయి విజయన్, ఎన్ రంగస్వామి ఈ కార్యక్రమానికి రానున్నారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీకి ఆహ్వానం ఉన్నప్పటికీ.. రావట్లేదు. పార్టీ తరఫున సీనియర్ నాయకుడు కకోలి ఘోష్ దస్తిదార్ హాజరు కానున్నారు.

మొత్తం 28 మందితో సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన బీజేపీ సీనియర్ నేత జగదీష్ షెట్టర్‌ను కూడా మంత్రివర్గంలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. పలువురు సీనియర్ నాయకులు, యువనేతలకు కేబినెట్‌లో ఛాన్స్ ఇచ్చినట్లు సమాచారం. ఈ 28 మందిలో 12 చొప్పున సిద్ధరామయ్య-డీకే శివకుమార్ వర్గం, మిగిలిన నలుగురు మల్లికార్జున ఖర్గే వర్గానికి చెందినవారిగా భావిస్తున్నారు.

ఇందులో- జీ పరమేశ్వర, కేహెచ్ మునియప్ప/రూపకళ, ఎంబీ పాటిల్, రామలింగా రెడ్డి, ఆర్‌వీ దేశ్‌పాండే, కేజే జార్జ్, హెచ్‌కే పాటిల్, కృష్ణబైరె గౌడ, యూటీ ఖాదర్, జమీర్ అహ్మద్ ఖాన్/ ఎన్ఏ హ్యారిస్, సతీష్ జార్కిహోలి, హెచ్‌సీ మహదేవప్ప, బీకే హరిప్రసాద్, అజయ్ సింగ్, లక్ష్మణ సవాది, లక్ష్మీ హెబ్బాల్‌కర్, దినేష్ గుండూరావు, మధు బంగారప్ప, ప్రియాంక్ ఖర్గే, సంతోష్ లాడ్, విజయానంద్ కాశప్పనవర్, టీడీ రాజేగౌడ/శివలింగగౌడ, ఆర్‌బీ తిమ్మాపుర, కొత్తూరు మంజునాథ్, శామనూరు శివశంకరప్ప/ఎస్ఎస్ మల్లికార్జున, ఎం కృష్ణప్ప/ ప్రియాకృష్ణ, శరణ్ ప్రకాష్ పాటిల్ ఉండొచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+