కర్నాటక ఎన్నికల ఫలితాలు 2023 Live: కొత్త సీఎంపై సస్పెన్స్ అలాగే, ఆ రోజునే ప్రమాణ స్వీకారం

శనివారం విడుదలైన కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. కనకపురా నుంచి కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ భారీ మెజార్టీతో గెలుపొందారు. వరుణా నుంచి మాజీ సీఎం సిద్ధరామయ్య కూడా విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ 136 స్థానాల్లో విజయం సాధించగా.. 65 స్థానాలతో బీజేపీ రెండో స్థానానికి పరిమితమైంది. జేడీఎస్ 19 స్థానాలు దక్కించుకుంది.

ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం 5:30 గంటలకు కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సీఎల్పీ) తొలి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ కర్ణాటక సీఎం ఎవరనేది నిర్ణయించనున్నారు. దీంతో ఈ సమావేశంపై ఆసక్తి నెలకొంది.

కర్ణాటక ఫలితాల అనంతరం పరిణామాలపై మినిట్-టూ-మినిట్ లైవ్ అప్‌డేట్స్ మీకోసం..

Karnataka Assembly Election 2023 Results

12:19 AM, 15 May

‘పరిశీలకులు ప్రతి ఎమ్మెల్యే అభిప్రాయాన్ని కోరడం, దానిని హైకమాండ్‌కు తెలియజేయడం; ప్రక్రియ ఈరోజే పూర్తి అవుతుంది’ అని కర్ణాటక కొత్త సీఎంపై కాంగ్రెస్ పేర్కొంది.

8:54 PM, 14 May
:

కర్ణాటక సీఎం ఎవరనేది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేనే నిర్ణయిస్తారని సీఎల్పీ మీటింగ్ తేల్చి చెప్పింది.

8:51 PM, 14 May

సీఎల్పీ మీటింగ్ జరుగుతున్న హోటల్ ముందు సిద్దరామయ్య, డీకే శివకుమార్ మద్దతుదారుల నినాదాలు.

8:50 PM, 14 May

బెంగళూరులోని షాంగ్రిలా హోటల్‌లో కొనసాగుతున్న సీఎల్పీ భేటీ. సీఎం పదవిపై చర్చిస్తున్న కీలక నేతలు.

8:23 PM, 14 May

కర్ణాటక ఎన్నికల్లో గెలుపొందిన స్వతంత్ర ఎమ్మెల్యే లతా మల్లిఖార్జున్.. కాంగ్రెస్ పార్టీకి బేషరతుగా మద్దతిస్తున్నట్లు ప్రకటించారు.

7:46 PM, 14 May

బెంగళూరులో జరిగే సీఎల్పీ సమావేశానికి వచ్చిన కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్

7:45 PM, 14 May

ఒక్క రాష్ట్రంలో గెలిచి కాంగ్రెస్ ఇంత హంగామా చేస్తోంది. బీజేపీ చాలా రాష్ట్రాల్లో గెలిచింది.ఎప్పుడూ ఇంతలా ఓవర్ యాక్షన్ చేసిందిలేదు: అస్సాం సీఎం హిమాంత బిశ్వ శర్మ

7:43 PM, 14 May

ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచిన లతా మల్లికార్జున్ కాంగ్రెస్‌కు షరతులు లేని మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు

7:09 PM, 14 May
:

సీఎల్పీ సమావేశానికి హాజరవుతున్న మాజీ సీఎం సిద్దరామయ్య.

7:08 PM, 14 May

సీఎల్పీ మీటింగ్‌లో పాల్గొనేందుకు వస్తున్న కాంగ్రెస్ కీలక నేతలు.

7:07 PM, 14 May
:

‘స్వామీజీ నాకు ఎల్లప్పుడూ మార్గదర్శకత్వం వహించారు’: కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తర్వాత తుమకూరులోని శ్రీ కాడసిద్దేశ్వర మఠాన్ని సందర్శించిన డీకే శివకుమార్.

6:55 PM, 14 May

డీకే శివకుమార్‌ను ముఖ్యమంత్రి చేయాలంటూ ఆందోళన చేస్తున్న ఆయన మద్దతుదారులు. మరోవైపు సీఎల్పీ భేటీ జరుగుతోంది.

6:18 PM, 14 May

డీకే శివకుమార్‌నే కర్ణాటక ముఖ్యమంత్రిని చేయాలంటూ ఆయన మద్దతుదారులు ఆందోళన చేస్తున్న దృశ్యం.

6:17 PM, 14 May

తన నివాసానికి చేరుకున్న డీకే శివకుమార్.

5:38 PM, 14 May

కర్ణాటక ఎన్నికల ఫలితాలు, బీజేపీ ఓటమిపై సమగ్రంగా విశ్లేషించుకుంటామని కర్ణాటక మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై తెలిపారు.

5:35 PM, 14 May

కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరనే అంశంపై సీఎల్పీ సమావేశంలో కీలకంగా చర్చించనున్నట్లు, తీసుకున్న అభిప్రాయాన్ని కాంగ్రెస్ హైకమాండ్ కు పంపించడం జరుగుతుందని పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే తెలిపారు.

4:57 PM, 14 May

భజరంగ్ దళ్.. భజరంగ్ భళీ వేరు వేరని.. ప్రధాని మోడీ మాటలను కర్ణాటక ప్రజలు నమ్మలేదన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్.

4:55 PM, 14 May

మాజీ సీఎం సిద్దరామయ్యతో తనకు ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్.

2:54 PM, 14 May
కర్నాటక:

సీఎల్పీ నేత ఎంపిక పరిశీలకులుగా నియమితులైన సుశీల్ కుమార్ షిండే, దీపక్ బవారియా, భన్వర్ జితేంద్ర సింగ్.

2:25 PM, 14 May
కర్నాటక:

బెంగళూరులో సిద్ధరామయ్య నివాసం ముందు అభిమానులు శ్రీరాముడు, ఆంజనేయస్వామి వారి భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఆ తరువాత భద్రత కారణాల వల్ల దాన్ని సిబ్బంది తొలగించారు.

1:38 PM, 14 May
కర్నాటక:

కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్యను బెంగళూరులోని ఆయన నివాసంలో కలిసిన ఇండిపెండెంట్ ఎమ్మెల్యే లత మల్లికార్జున్. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె హరపనహళ్లి నియోజకవర్గం నుంచి విజయం సాధించారు.

12:34 PM, 14 May
కర్నాటక:

ఏఐసీసీ అధినేత మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సిద్ధరామయ్య భేటీ కావడానికి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదు. పార్టీ విజయం సాధించిన నేపథ్యంలో మర్యాదపూరకంగా కలిశారు- కాంగ్రెస్ కొత్త ఎమ్మెల్యే, మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే.

12:31 PM, 14 May
కర్నాటక:

ఈ సాయంత్రం సీఎల్పీ భేటీ సమావేశం నేపథ్యంలో బెంగళూరులో తన నివాసం నుంచి బయలుదేరిన ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే.

12:15 PM, 14 May
కర్నాటక:

ఈ సాయంత్రం సీఎల్పీ భేటీ సమావేశం ఏర్పాటైన నేపథ్యంలో బెంగళూరులో కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్యను కలిసిన కొత్త ఎమ్మెల్యేలు దినేష్ గుండూరావు, రిజ్వాన్ అర్షద్, పుట్టరంగ షెట్టి, సతీష్ జార్కిహోళి

12:13 PM, 14 May
కర్నాటక:

ఈ సాయంత్రం సీఎల్పీ భేటీ సమావేశం ఏర్పాటైన నేపథ్యంలో బెంగళూరులో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నివాసానికి చేరుకున్న కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య.

12:12 PM, 14 May
కర్నాటక:

తుమకూరు జిల్లాలోని నొనవినకెరెలో గల కడసిద్ధేశ్వర మఠానికి చేరుకున్న పీసీసీ చీఫ్ డీకే శివకుమార్. వృషభ దేశికేంద్ర మఠాధిపతి ఆశీర్వాదాన్ని తీసుకోనున్నారు.

12:10 PM, 14 May
మహారాష్ట్ర:

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ముంబైలోని ఆంజనేయస్వామి ఆలయంలో హనుమాన్ చాలీసాను పారాయణం చేసిన ఆ పార్టీ నాయకులు భాయ జగ్తప్, సంజయ్ నిరుపమ్, ఇతర నాయకులు.

11:37 AM, 14 May
కర్నాటక:

కనకపురలోని డీకే శివకుమార్ నివాసానికి వచ్చిన హరిహరపుర మఠాధిపతి .

11:27 AM, 14 May
కర్నాటక:

కర్ణాటక ముఖ్యమంత్రి పదవి కోసం డీకే శివకుమార్, సిద్ధరామయ్యతో పాటు ఎంబీ పాటిల్, జీ పరమేశ్వర కూడా ఆసక్తిగా ఉన్నారంటూ వెల్లడించిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి రామలింగారెడ్డి.

11:20 AM, 14 May
కర్నాటక:

ఈ సాయంత్రం సీఎల్పీ భేటీ సమావేశం ఏర్పాటైన నేపథ్యంలో తన నివాసం నుంచి బయలుదేరిన ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య.

READ MORE

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+