కర్ణాటక ఎన్నికలు: బీజేపీ మూడో జాబితా విడుదల, శెట్టర్‌పై పోటీకి మహేష్ రెడీ

బెంగళూరు: త్వరలో జరగనున్న కర్ణాటక ఎన్నికల కోసం బీజేపీ సోమవారం 10 మంది అభ్యర్థులతో కూడిన మూడవ జాబితాను విడుదల చేసింది. గతంలో జగదీష్ షెట్టర్ పోటీ చేసిన హుబ్లీ-ధార్వాడ్ సెంట్రల్ నుంచి మహేష్ టెంగినాకైని పోటీకి దింపింది.

మూడో జాబితా ప్రకారం.. బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ లింబావలి భార్య మంజులా అరవింద్ లింబావలి రాబోయే ఎన్నికల్లో మహదేవపుర నుంచి, సంజీవ్ ఐహోళే నాగథాన్ నుంచి, రాజ్ కుమార్ పాటిల్ సేడం నుంచి, మంజుల అమరేష్ కొప్పల్ నుంచి, కలకప్ప బండి.. రాన్ నుంచి, బి. రామన్న హగరిబొమ్మనహళ్లి, కట్టా జగదీష్.. హెబ్బాల్ నుంచి రానున్న ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ఉమేష్ శెట్టి.. గోవింద్రాజ్ నగర్ నుంచి, శ్రీవత్స.. కృష్ణరాజా నుంచి పోటీ చేయనున్నారు.

 Karnataka: BJP Releases Third List, Fields Mahesh Tenginakai From Shettars Hubli Seat

జగదీశ్ శెట్టర్ కాంగ్రెస్‌లో చేరిక

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ శెట్టర్ సోమవారం ఉదయం బెంగళూరులో కాంగ్రెస్‌లో చేరారు. మల్లికార్జున్ ఖర్గే, పార్టీ కర్ణాటక విభాగం ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ రణదీప్ ఎస్ సురేజేవాలా, సీఎల్పీ నేత సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన షెట్టర్‌కు ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్ నిరాకరించారు. దీంతో కోపోద్రిక్తుడైన శెట్టర్ తనను అవమానించారని, అనుచితంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ బీజేపీపై విమర్శలు గుప్పించారు. కాగా, హుబ్బళ్లి-ధార్వాడ్ సెంట్రల్ నియోజకవర్గం నుంచి షెట్టర్‌కు కాంగ్రెస్ టికెట్ దక్కుతుందని భావిస్తున్నారు.

మే 10న జరిగే 224 స్థానాల అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ ఇప్పటివరకు 222 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఏప్రిల్ 20లోగా నామినేషన్లు సమర్పించాలి. అంతకుముందు బీజేపీ 189 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై షిగ్గావ్ అసెంబ్లీ స్థానంలో, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి చిక్కమగ్లూరు స్థానానికి పోటీ చేయనున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+