మాజీ ముఖ్యమంత్రుల తనయులు- రసవత్తర పోరు
CP Yogeswar: కర్ణాటకలో అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ- జనతాదళ్ (సెక్యులర్) కూటమి మధ్య హోరాహోరీగా పోటీ నెలకొంది. ఎవరిది పైచేయి అనేది నవంబర్ 23వ తేదీన జరిగే ఓట్ల లెక్కింపు సందర్భంగా తేలిపోనుంది.
మొత్తం మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరుగనున్నాయి. బెంగళూరు దక్షిణ (రామనగర) జిల్లా చెన్నపట్న, హవేరి జిల్లా షిగ్గావ్, బళ్లారి జిల్లాలోని సండూరు స్థానాలకు నవంబర్ 13వ తేదీన ఉప ఎన్నిక జరుగనుంది. మాజీ ముఖ్యమంత్రులు హెచ్ డీ కుమారస్వామి, బసవరాజ్ బొమ్మై, కాంగ్రెస్ ఎమ్మెల్యే తుకారాం ప్రాతినిథ్యాన్ని వహించిన నియోజకవర్గాలు అవి.

ఈ ముగ్గురూ లోక్‌సభకు ఎన్నికయ్యారు. తమ శాసన సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఫలితంగా ఈ మూడు సీట్లకూ ఉప ఎన్నిక అవసరమైంది. ప్రస్తుతం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేబినెట్‌లో కుమారస్వామికి బెర్త్ లభించింది. కేంద్ర ఉక్కు శాఖ మంత్రిగా వ్యవహరిస్తోన్న విషయం తెలిసిందే.
కుమారస్వామి, బసవరాజ్ బొమ్మై తాము ఖాళీ చేసిన స్థానాల్లో వారసులను బరిలో దింపారు. చెన్నపట్నలో జేడీఎస్- బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ప్రముఖ నటుడు నిఖిల్ కుమారస్వామి పోటీ చేస్తోన్నారు. ఈ మధ్యాహ్నమే ఆయన తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఇదే చెన్నపట్న నుంచ బీజేపీకి చెందిన మాజీ మంత్రి సీపీ యోగేశ్వర్.. కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
షిగ్గావ్‌లో బసవరాజ్ బొమ్మై తనయుడు భరత్ బొమ్మై బీజేపీ అభ్యర్థిగా రంగంలో దిగారు. సండూర్ స్థానాన్ని బీజేపీ బంగారు హనుమంతుకు కేటాయించింది. ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. కాంగ్రెస్ నుంచి తుకారాం భార్య అన్నపూర్ణ పోటీ చేస్తోన్నారు. ఈ మూడు స్థానాలు కూడా కుటుంబ సభ్యులకే దక్కడం హైలైట్.
ఈ ముగ్గురిలో ఎవరు గెలుస్తారనేది నవంబర్ 23వ తేదీన ఓట్ల లెక్కింపు సందర్బంగా తేటతెల్లమౌతుంది. నిఖిల్ కుమారస్వామి ఇప్పటివరకు రెండుసార్లు ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ పరాజయమే ఎదురైంది. 2019 నాటి ఎన్నికల్లో మండ్య లోక్‌సభ, 2023 అసెంబ్లీ పోరులో రామనగర నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
-
బంగారం ధరల్లో లాభాల మోత -
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి ఉన్నవారి మే నెల జాతక ఫలం -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం












Click it and Unblock the Notifications