ఫలించిన డీకే శివకుమార్ మంత్రాంగం?

Bengaluru South: ఏపీ తరహాలోనే పొరుగునే ఉన్న కర్ణాటకలో జిల్లాల పేర్ల మార్పు మళ్లీ తెరమీదికి వచ్చింది. గతంలో బెల్గాం, షిమోగ, బిజాపూర్, గుల్బర్గా వంటి జిల్లాల పేర్లను.. బెళగావి, శివమొగ్గ, విజయపుర, కలబురగిగా మార్పు చేశారు. ఇప్పుడు మళ్లీ అదే తరహా డిమాండ్ ఊపందుకుంది.

బెంగళూరుకు ఆనుకుని ఉన్న రామనగర జిల్లా పేరును దక్షిణ బెంగళూరుగా మార్చింది సిద్ధరామయ్య ప్రభుత్వం. దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై కర్ణాటక మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని న్యాయ శాఖ మంత్రి హెచ్ కే పాటిల్ వెల్లడించారు. రామనగర జిల్లా ఇక బెంగళూరు సౌత్‌గా మారినట్లు చెప్పారు.

Karnataka cabinet has approved to rename Ramanagara district to Bengaluru South district

బెంగళూరు నగర పరిధి శరవేగంగా విస్తరిస్తోన్న నేపథ్యంలో రామనగర పేరును దక్షిణ బెంగళూరుగా మార్చాలంటూ ఇదివరకు అధికార కాంగ్రెస్ నాయకులు పట్టుబట్టిన విషయం తెలిసిందే. ఉప ముఖ్యమంత్రి, కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత డీకే శివకుమార్, ఆయన సోదరుడు డీకే సురేష్, మంత్రి రామలింగారెడ్డి, అశ్వర్థ తదితరులు సచివాలయంలో సిద్ధరామయ్యను కలిసి వినతిపత్రం సైతం ఇచ్చారు.

గతంలో దొడ్డబళ్లాపుర, నెలమంగళ, యలహంక, దేవనహళ్లి, అనేకల్, బెంగళూరు సౌత్, బెంగళూరు ఈస్ట్, హోస్కోటే, రామనగర, మాగడి, కనకపుర, చెన్నపట్టణ తాలూకాలు బెంగళూరు రూరల్ జిల్లాలో భాగంగా ఉండేవి. పరిపాలన సౌలభ్యం కోసం 2007లో రామనగర జిల్లాను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.

రామనగర, మాగడి, కనకపుర, చెన్నపట్టణ, హారోహళ్లి తాలూకాలను ఇందులో విలీనం చేశారు. ఇప్పుడు మారిన పరిస్థితులకు అనుగుణంగా రామనగర పేరును దక్షిణ బెంగళూరు జిల్లాగా మార్చాలంటూ కాంగ్రెస్ నాయకులు పట్టుబట్టారు. దీనికి ప్రభుత్వం అంగీకారం తెలిపింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.

Karnataka cabinet has approved to rename Ramanagara district to Bengaluru South district

ఈ పేరు మార్పు వెనుక రియల్ ఎస్టేట్ పెద్దల ప్రమేయం ఉందని చెబుతున్నారు. రియల్ ఎస్టేట్, భూముల ధరల పెరుగుదలపరంగా చూసుకుంటే రామనగర కంటే బెంగళూరు అనే పేరుకే మంచి డిమాండ్ ఉందని రియల్టర్లు బహిరంగంగా వ్యాఖ్యానిస్తోన్నారు. దీనిపై ప్రభుత్వ వాదన మరోలా ఉంటోంది.

గ్రేటర్ బెంగళూరు ప్రాజెక్ట్‌ను తలపెట్టినందు వల్ల రామనగర పేరును తొలగించాల్సి వచ్చిందని హెచ్ కే పాటిల్ చెప్పారు. బెంగళూరు నగరం చుట్టూ 1,400 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో గల ప్రాంతాలన్నింటినీ కూడా గ్రేటర్ బెంగళూరు పరిధిలోకి తీసుకొచ్చారు. దీనికోసం గ్రేటర్ బెంగళూరు గవర్నెన్స్ బిల్లు 2024ను సైతం రూపొందించింది ప్రభుత్వం. ఈ బిల్లుపై ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+